MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాలో అకౌంట్ లేని స్టార్ హీరో ఎవరో తెలుసా?

సోషల్ మీడియాలో అకౌంట్ లేని స్టార్ హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి ఇండియన్ సూపర్ స్టార్స్ వరకూ అందరు సోషల్ మీడియా అకౌట్స్ ను కలిగి ఉంటున్నారు. కానిఓ స్టార్ హీరో మాత్రం ఇంత వరకూ ఒక్క సోషల్ మీడియా అకౌంట్ ను కూడా వాడటం లేదు. ఇంతకీ ఎవరా హీరో?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2025, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

ప్రపంచం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో కొనసాగుతోంది. చిన్న పిల్లల నుంచీ పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల విషయానికి వస్తే, వారి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

25
Image Credit : instagram

అయితే, ఈ క్రమంలో ఒక స్టార్ హీరో మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియా‌కు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఏ ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కూడా అకౌంట్ లేదు. ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Related image1
నాగార్జున, వెంకటేష్ లతో రొమాన్స్ చేసి, చిరంజీవికి మాత్రం అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
Related image2
హైదరాబాద్ లో 14 ఎకరాల ద్రాక్ష తోట, పెద్ద ఫామ్ హౌస్ ఉన్న హీరోయిన్ ఎవరు? మురళీ మోహన్ చెప్పిన రహస్యం
35
Image Credit : Social Media

రణబీర్ తన సినిమాలకు సంబంధించిన సమాచారం కూడా స్వయంగా షేర్ చేయరు. ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్‌ను ప్రొడక్షన్ కంపెనీలు లేదా ఫ్యాన్స్ పేజీలు మాత్రమే షేర్ చేస్తుంటాయి. ఆయన నుంచి మాత్రం ఏ పోస్టూ బయటకు రాదు. సోషల్ మీడియా యుగంలో ఒక టాప్ హీరో ఇలా దూరంగా ఉండటం చాలా అరుదుగా కనిపించే విషయమే.

45
Image Credit : Social Media

ఈ క్రమంలో రణబీర్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న "రామాయణ" సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి ‘సీత’గా నటిస్తుండగా, కన్నడ రాక్‌స్టార్ యష్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణంలో ఉంది

55
Image Credit : Social Media

రామాయణాన్ని ఆధునిక టెక్నాలజీతో తెరకెక్కించే ప్రయత్నంలో మూవీ టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది. 2026లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశముంది.రణబీర్ సోషల్ మీడియా దూరంగా ఉన్నప్పటికీ, ఆయన సినిమా అప్‌డేట్స్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
నాగార్జున, వెంకటేష్ లతో రొమాన్స్ చేసి, చిరంజీవికి మాత్రం అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
Recommended image2
హైదరాబాద్ లో 14 ఎకరాల ద్రాక్ష తోట, పెద్ద ఫామ్ హౌస్ ఉన్న హీరోయిన్ ఎవరు? మురళీ మోహన్ చెప్పిన రహస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved