MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాహుబలి ఫస్ట్ డే బ్యాడ్ టాక్, దగ్గరుండి చూసిన రమ్యకృష్ణ .. ఆ విషయంలో రాజమౌళిని మించిన తోపు లేరు

బాహుబలి ఫస్ట్ డే బ్యాడ్ టాక్, దగ్గరుండి చూసిన రమ్యకృష్ణ .. ఆ విషయంలో రాజమౌళిని మించిన తోపు లేరు

బాహుబలి 1 చిత్రానికి మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ గురించి రమ్యకృష్ణ మాట్లాడారు. ఆ రోజు శోభు, రాజమౌళి ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారో రమ్యకృష్ణ వివరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 27 2025, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాహుబలి ది ఎపిక్
Image Credit : Asianet News

బాహుబలి ది ఎపిక్

దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం బాహుబలి రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31న రీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి టైటిల్ బాహుబలి ది ఎపిక్ అని పెట్టారు. బాహుబలి ఎపిక్ రిలీజ్ అవుతుండడంతో మరోసారి ప్రభాస్ అభిమానులు బాహుబలి విశేషాలు గుర్తు చేసుకుంటున్నారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన, భల్లాల దేవుడిగా రానా విలనిజం, రాజమాత శివగామిగా రమ్యకృష్ణ రాజసం ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. 

25
జగపతి బాబుతో రమ్యకృష్ణ
Image Credit : instagram

జగపతి బాబుతో రమ్యకృష్ణ

రమ్యకృష్ణ రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో రమ్యకృష్ణ బాహుబలి జర్నీ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్రని మీరు చేశారు కదా అని జగపతి బాబు ప్రశ్నించారు. దీనికి రమ్యకృష్ణ బదులిస్తూ.. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. శ్రీదేవి రిజెక్ట్ చేసిన సంగతి నాకు తెలియదు. నాకు అవకాశం వచ్చింది నేను చేశా అని రమ్యకృష్ణ అన్నారు. 

Related Articles

Related image1
నలుగురితో డేటింగ్ చేశా, నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. ప్రభాస్, మహేష్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసిన నటి వ్యాఖ్యలు
Related image2
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. అసలైన మజా అందించే సూపర్ హీరో మూవీ కోసమే అంతా వెయిటింగ్
35
ముందుగా బాహుబలికి ఒప్పుకోలేదు
Image Credit : Facbook / Baahubali

ముందుగా బాహుబలికి ఒప్పుకోలేదు

ఈ మూవీలో నాకు అవకాశం వచ్చే సమయానికి నా కొడుకు వయసు 6 ఏళ్ళు మాత్రమే. మీ కాల్ షీట్స్ 45 రోజులు కావాలి అని శోభుగారు అడిగారు. వామ్మో 45 రోజులా నాకు కుదరదు అని చెప్పా. అప్పటికి బాహుబలి ఎంత పెద్ద సినిమా, ఏ రేంజ్ లో తీస్తున్నారు, పాన్ ఇండియా అంటే ఏంటి ఇలాంటి విషయాలేవీ నాకు తెలియదు. ఏదో నార్మల్ మూవీనే అని అనుకున్నా. కానీ రాజమౌళి గారు నెరేషన్ ఇచ్చాక అర్థం అయింది. 

45
ఆ విషయంలో రాజమౌళి కంటే తోపు లేరు
Image Credit : zee telugu

ఆ విషయంలో రాజమౌళి కంటే తోపు లేరు

శోభుగారు వచ్చి డేట్స్ ఆడినప్పుడు నా కొడుకుని వదిలి అన్ని రోజులు ఉండాలంటే కుదరదని చెప్పేశాను. ఆ తర్వాత రాజమౌళి గారు కథ చెప్పారు. రాజమౌళి గారి స్టోరీ నెరేషన్ లో ఆయన బీట్ చేసేవారెవరూ లేరు అని రమ్యకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక బాహుబలి 1 రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే టాక్ చూసి చాలా డిప్రెసింగ్ గా అనిపించింది. 

55
బాహుబలి నెగిటివ్ టాక్ పై రమ్యకృష్ణ
Image Credit : our own

బాహుబలి నెగిటివ్ టాక్ పై రమ్యకృష్ణ

ఎక్కడ చూసినా నెగిటివ్ టాక్ వస్తోంది. నేను దగ్గరుండి చూశాను. కానీ శోభు గారు, రాజమౌళి గారు ఒక రాక్ లాగా నిలబడిపోయారు. మేమెంత కలిసి సినిమా చూశాం. ఇంత అద్భుతంగా ఉంది నెగిటివ్ టాక్ ఎందుకు వస్తోంది అనేది అర్థం కాలేదు అని రమ్య కృష్ణ తెలిపారు. దీనిపై శోభు స్పందించారు. ఆయన కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శోభు మాట్లాడుతూ.. సినిమాని ఒక ఇంటర్వెల్ లాగా ఎండ్ చేయడం అనేది అప్పటికి చాలా కొత్త. దీనితో ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. దానివల్లే నెగిటివ్ టాక్ వచ్చింది అని అన్నారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ ఆరోజు నైట్ షోల నుంచి నెగిటివ్ టాక్ మొత్తం పోయి యునానిమస్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది అని అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రమ్య కృష్ణ
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు
Recommended image3
చిరంజీవి మనవడు, మనవరాలు పేర్లకు అర్ధం తెలుసా? మెగాస్టార్ వెల్లడించిన అసలు రహస్యం ఇదే
Related Stories
Recommended image1
నలుగురితో డేటింగ్ చేశా, నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. ప్రభాస్, మహేష్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసిన నటి వ్యాఖ్యలు
Recommended image2
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. అసలైన మజా అందించే సూపర్ హీరో మూవీ కోసమే అంతా వెయిటింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved