MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నలుగురితో డేటింగ్ చేశా, నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. ప్రభాస్, మహేష్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసిన నటి వ్యాఖ్యలు

నలుగురితో డేటింగ్ చేశా, నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. ప్రభాస్, మహేష్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసిన నటి వ్యాఖ్యలు

తెలుగు, తమిళ చిత్రాలలో నటించి, ఐటెం సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ముమైత్ ఖాన్, నలుగురితో డేటింగ్ చేసినట్లు చెప్పి షాక్ ఇచ్చింది. నలుగురితో బ్రేకప్ అయిందట. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉంటున్నానని ముమైత్ ఖాన్ తెలిపింది.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 26 2025, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ముమైత్ ఖాన్:
Image Credit : our own

ముమైత్ ఖాన్:

నటి ముమైత్ ఖాన్ ఒక గ్లామర్ నటిగా పేరు పొందింది. ఆమె పూర్తి పేరు ముమైత్ అబ్దుల్ రషీద్ ఖాన్ అయినా, సినిమా కోసం తన పేరును కుదించుకుంది. ముంబైకి చెందిన ఈమె, నటిగానే కాకుండా మోడల్, డ్యాన్సర్‌గా కూడా ప్రసిద్ధి చెందింది.

24
హీరోయిన్‌గా నటించిన ముమైత్ ఖాన్:
Image Credit : our own

హీరోయిన్‌గా నటించిన ముమైత్ ఖాన్:

ఇటీవల 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ముమైత్ ఖాన్, ఎక్కువగా తెలుగు, హిందీ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యింది. మహేష్ బాబు పోకిరి చిత్రంలో ముమైత్ ఖాన్ చేసిన ఐటెం సాంగ్ యువతని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో కూడా నటించింది. 

Related Articles

Related image1
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ హిట్టా ఫ్లాపా ? అసలు నిజం బయటపెట్టిన నాగ వంశీ
Related image2
స్టార్ హీరో ముందు ఇరికించాలని చూసిన డైరెక్టర్, నమ్రత గురించి చెప్పి నోరు మూయించిన మహేష్
34
బిగ్ బాస్ తెలుగు:
Image Credit : our own

బిగ్ బాస్ తెలుగు:

సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొంది. ఆమె బాగా ఆడినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాల్లో నటించకుండా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది.

44
ఒకేసారి నలుగురితో డేటింగ్:
Image Credit : our own

ఒకేసారి నలుగురితో డేటింగ్:

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, తాను నలుగురితో డేటింగ్ చేసినట్లు చెప్పి షాక్ ఇచ్చింది. దీని గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ, 'నాకు ఇటీవల ఒక ప్రమాదం జరిగింది. దాని నుంచి కోలుకుని పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ ప్రమాదానికి ముందు నలుగురితో డేటింగ్ చేశాను.నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను డేటింగ్ చేసిన వారెవరితోనూ టచ్‌లో లేను. ఒంటరిగా హాయిగా జీవిస్తున్నాను. నాకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తాను' అని చెప్పింది. బ్రేకప్ జరిగింది కదా అని ఇక అబ్బాయిలే నా లైఫ్ లో వద్దు అని చెప్పను. నచ్చిన వ్యక్తి దొరికితే మళ్ళీ ప్రేమలో పడతానేమో అని ముమైత్ ఖాన్ తెలిపింది.  ముమైత్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
Recommended image2
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
Recommended image3
అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ హిట్టా ఫ్లాపా ? అసలు నిజం బయటపెట్టిన నాగ వంశీ
Recommended image2
స్టార్ హీరో ముందు ఇరికించాలని చూసిన డైరెక్టర్, నమ్రత గురించి చెప్పి నోరు మూయించిన మహేష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved