MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాళ్లిద్దరూ చేసింది నచ్చక షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ.ఎన్టీఆర్, భరించలేని అవమానం.. నాగ్ కూడా హ్యాండిచ్చారు

వాళ్లిద్దరూ చేసింది నచ్చక షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ.ఎన్టీఆర్, భరించలేని అవమానం.. నాగ్ కూడా హ్యాండిచ్చారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి మూవీ షూటింగ్ సమయంలో ఇద్దరు సోదరులకు అవమానం జరిగింది. ఎన్టీఆర్ షూటింగ్ లొకేషన్ నుంచే వెళ్లిపోయారట. ఇంతకీ ఏంటా సంఘటన, ఆ ఇద్దరు సోదరులు ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 25 2025, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ జర్నీ
Image Credit : Asianet News

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ జర్నీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మూవీ సెట్ లో తమకి అవమానం జరిగింది అని ఇద్దరు క్రేజీ ఫైట్ మాస్టర్లు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. కానీ ఆ అవమానాలు, కష్టాలు అధికమించడం వల్లే తాము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని ఆ ఫైట్ మాస్టర్స్ తెలిపారు. టాలీవుడ్ లో చాలా కాలంగా రాణిస్తున్న ఆ ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ రామ్, లక్ష్మణ్ లు. 

25
టాలీవుడ్ లో అదరగొడుతున్న కవల సోదరులు
Image Credit : youtube/sreyas media

టాలీవుడ్ లో అదరగొడుతున్న కవల సోదరులు

ఈ ఇద్దరు కవల సోదరులు మాస్ యాక్షన్ ఫైట్స్ కి పెట్టింది పేరు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారంటే ఆ సినిమాతో మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ బావగారు బాగున్నారా మూవీ టైం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తమకి కెరీర్ లో ఎదురైన అవమానాల గురించి రామ్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

Related Articles

Related image1
రవితేజ, త్రివిక్రమ్ తనయులకు గొప్ప అవకాశం.. ఇక అంతా ప్రభాస్ చేతిలోనే..
Related image2
వెంకటేష్, నాగార్జున, చిరంజీవితో మల్టీస్టారర్ చేయాలంటే నా కండీషన్స్ ఇవే.. బాలయ్య కామెంట్స్
35
షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ. ఎన్టీఆర్
Image Credit : Asianet News

షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జూ. ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రంలో ఒక చిన్న సీక్వెన్స్ కి ఫైట్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. సినిమా మొత్తం మరో ఫైట్ మాస్టర్ చేస్తున్నారు. ఆ చిన్న సీక్వెన్స్ కి మాత్రమే మమ్మల్ని తీసుకున్నారు. కానీ మేము చేసింది తారక్ బాబుకి నచ్చలేదు. వెంటనే షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అన్నారు. ఆ క్షణం జరిగిన అవమాననానికి కళ్ళలో నీళ్లు వచ్చాయి అని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎమోషనల్ అయ్యారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి చిత్రం ఫ్లాప్ అయింది. 

45
నాగార్జున సినిమాలో ఛాన్స్
Image Credit : Asianet News

నాగార్జున సినిమాలో ఛాన్స్

డైరెక్టర్ విఎన్ ఆదిత్య, నాగార్జున కాంబినేషన్ లో నేనున్నాను, బాస్ లాంటి చిత్రాలు వచ్చాయి. అయితే రామ్ లక్ష్మణ్ మాస్టర్ సినిమా పేరు చెప్పలేదు కానీ.. వీరి కాంబోలో వచ్చిన ఒక చిత్రానికి తామే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా ఎంపిక అయ్యాం అని తెలిపారు. మా వర్కింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. 

55
గొప్ప మనసు చాటుకున్న నాగార్జున
Image Credit : Asianet News

గొప్ప మనసు చాటుకున్న నాగార్జున

రోప్స్ ఎక్కువగా వాడాలని చెప్పాం. దీనితో నాగార్జున గారు ఇబ్బంది పడతారని మమ్మల్ని ఆ మూవీ నుంచి తొలగించారు. కానీ నాగార్జున మాత్రం గొప్ప మనసు చాటుకున్నారు. మమ్మల్ని ఆల్రెడీ ఎంపిక చేశారు కాబట్టి ఫుల్ పేమెంట్ ఇచ్చి పంపించినట్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Recommended image2
Kadhalar Dhinam: భారతీయుడు సినిమాను మించిన బడ్జెట్, యువతకు పిచ్చెక్కించిన ఆ లవ్ స్టోరీ ఇదే!
Recommended image3
Silk Smitha: రజినీ, కమల్‌కే చుక్కలు చూపించింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఆమె టాప్ 5 సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
రవితేజ, త్రివిక్రమ్ తనయులకు గొప్ప అవకాశం.. ఇక అంతా ప్రభాస్ చేతిలోనే..
Recommended image2
వెంకటేష్, నాగార్జున, చిరంజీవితో మల్టీస్టారర్ చేయాలంటే నా కండీషన్స్ ఇవే.. బాలయ్య కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved