MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెద్ది 'చికిరి' సాంగ్ రివ్యూ ..రాంచరణ్ బీడీ డ్యాన్స్, రెహమాన్ బీట్స్, జాన్వీ గ్లామర్ మూడూ పర్ఫెక్ట్ సింక్ లో

పెద్ది 'చికిరి' సాంగ్ రివ్యూ ..రాంచరణ్ బీడీ డ్యాన్స్, రెహమాన్ బీట్స్, జాన్వీ గ్లామర్ మూడూ పర్ఫెక్ట్ సింక్ లో

రాంచరణ్ పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్ రిలీజ్ అయింది. జస్ట్ ప్రోమోలోనే రాంచరణ్ తన డ్యాన్స్ తో ఇంటర్నెట్ ని ఊపేశారు. ఇప్పుడు కంప్లీట్ సాంగ్ వచ్చేసింది. మరి పాట ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 07 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ పెద్ది మూవీ
Image Credit : Asianet News

రాంచరణ్ పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్, మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 

25
చికిరి సాంగ్ వచ్చేసింది
Image Credit : Asianet News

చికిరి సాంగ్ వచ్చేసింది

పెద్ది మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఆడియన్స్ లో బాగా క్లిక్ అవుతోంది. ఫస్ట్ లుక్ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ లో రాంచరణ్ క్రికెట్ షాట్ కొట్టే విధానం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. రీసెంట్ గా ఈ చిత్రంలో చికిరి అనే ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. సాంగ్ ప్రోమోలో రాంచరణ్ బీడీ కాల్చుతూ వేసిన స్టెప్ కి ఫ్యాన్స్ ఊగిపోయారు. తాజాగా చికిరి కంప్లీట్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Related Articles

Related image1
మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ లో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ చూశారా..బాబోయ్, అవిటివాడే కానీ రాక్షసుడిలా
Related image2
మహేష్ బాబు 'ఒక్కడు' ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన ఒకే ఒక్క మూవీ.. ఎన్టీఆర్, రవితేజ సినిమాలు గల్లంతు
35
రెహమాన్ డిసప్పాయింట్ చేయలేదు
Image Credit : Asianet News

రెహమాన్ డిసప్పాయింట్ చేయలేదు

ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే భారీ అంచనాలు ఉంటాయి. పైగా రాంచరణ్ పాన్ ఇండియా మూవీకి రెహమాన్ సంగీతం అని తెలియగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. టీజర్ లో మస్సా మస్సా అంటూ ఆస్కార్ విన్నర్ ఇచ్చిన బీజీయం బాగా ఆకట్టుకుంది. దీనితో చికిరి సాంగ్ ఎలా ఉంటుందో అనే అంచనాలు ఫ్యాన్స్ లోఏర్పడ్డాయి. మొత్తానికి సాంగ్ వచ్చేసింది. ఊహించినట్లుగానే ఏఆర్ రెహమాన్ డిసప్పాయింట్ చేయలేదు. కిరాక్ అనిపించే బీట్ తో సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. 

45
రాంచరణ్ మాస్ డ్యాన్స్, జాన్వీ గ్లామర్ అదుర్స్
Image Credit : Asianet News

రాంచరణ్ మాస్ డ్యాన్స్, జాన్వీ గ్లామర్ అదుర్స్

బీడీ కాల్చుతూ, బ్యాట్ పట్టుకుని రాంచరణ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా చేస్తున్న డ్యాన్స్ అదిరిపోయింది. చరణ్ డ్యాన్స్ చేస్తుంటే ఏదో స్టెప్పులు వేస్తున్నట్లు లేదు.. నేచురల్ గా ఆ పాత్రలో ఒదిగిపోయినట్లు అనిపిస్తోంది. తన ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ తన స్నేహితులతో కలిసి పెద్ది ఈ పాటని పడుతున్నాడు. బుచ్చిబాబు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తూనే ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ ఫీలింగ్ మిస్ కాకుండా చూసుకున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. జాన్వీ కపూర్ తన గ్లామర్ తో ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ లో ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ అనే చెప్పాలి. 

55
మూడూ పర్ఫెక్ట్ సింక్ లో కుదిరాయి
Image Credit : Asianet News

మూడూ పర్ఫెక్ట్ సింక్ లో కుదిరాయి

ఈ సాంగ్ లో రాంచరణ్ పెర్ఫార్మెన్స్, జాన్వీ గ్లామర్, రెహమాన్ మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్ సింక్ లో కుదిరాయి. ఈ పాటని ప్రముఖ సింగర్ మోహిత్ చౌహాన్ అద్భుతంగా పాడారు. ప్రముఖ లిరిసిస్ట్ బాలాజీ సాహిత్యం అందించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
రామ్ చరణ్ కొణిదెల
జాన్వీ కపూర్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Recommended image2
Kadhalar Dhinam: భారతీయుడు సినిమాను మించిన బడ్జెట్, యువతకు పిచ్చెక్కించిన ఆ లవ్ స్టోరీ ఇదే!
Recommended image3
Silk Smitha: రజినీ, కమల్‌కే చుక్కలు చూపించింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఆమె టాప్ 5 సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ లో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ చూశారా..బాబోయ్, అవిటివాడే కానీ రాక్షసుడిలా
Recommended image2
మహేష్ బాబు 'ఒక్కడు' ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడిన ఒకే ఒక్క మూవీ.. ఎన్టీఆర్, రవితేజ సినిమాలు గల్లంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved