- Home
- Entertainment
- Rajinikanth Remuneration: కమల్ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్.. ఇండియాలోనే టాప్
Rajinikanth Remuneration: కమల్ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్.. ఇండియాలోనే టాప్
Rajinikanth Remuneration: సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి రజనీకి రికార్డు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.

రజనీకాంత్, కమల్ హాసన్ కాంబోలో మూవీ
రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం నెల్సన్ ..రజనీతో `జైలర్ 2` చేస్తున్నారు. కమల్ బ్యానర్లో మూవీ తర్వాత రజనీకాంత్, కమల్ కాంబోలో మూవీ స్టార్ట్ కానుంది. తాత్కాలికంగా 'తలైవర్ 174 X KH 238' అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరు హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా కోసం వేచి చూస్తున్నారు.
కమల్ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డుస్థాయిలో రెమ్యూనరేషన్
ఈ సినిమాలో రజినీకాంత్ రెమ్యూనరేషన్ గురించిన ఓ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.225 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. ఇది ఇండియాలోనే హైయ్యెస్ట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కి డైరెక్ట్ పారితోషికం ఇవ్వడం లేదు. ఆయనకు లాభాల్లో వాట ఇస్తున్నారు. రెమ్యూనరేషన్ పరంగా మాత్రం ఇప్పుడు రజనీదే టాప్ అని చెప్పొచ్చు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ ప్రోమో షూట్ కూడా పూర్తి చేశారని టాక్. ఈ ప్రోమోలో ఇద్దరూ 80ల నాటి వింటేజ్ స్టైల్లో కనిపించారట. స్నేహం నేపథ్యంలో, డార్క్ కామెడీ జానర్లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నారు.

