- Home
- Entertainment
- Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?
Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?
చిరంజీవి తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు వెల్లడించాడు రాజశేఖర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ పక్కా.. అయితే మెగా మూవీలో విలన్ పాత్రలో కనిపిస్తాడట స్టార్ హీరో. ఈ కాంబినేషన్ కలిసేనా?

ఒకప్పటి టాలీవుడ్ యాంగ్రీ హీరో
ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ హీరోగా వెండి తెరను ఏలాడు రాజశేఖర్. పోలీస్ పాత్రలతో తెలుగు వారి అభిమాన హీరోగా మారాడు. మెగాస్టార్ చిరంజీవితో వివాదం వల్ల సంచలనంగా మారాడు రాజశేఖర్. హీరోగా సినిమాలు లేకపోవడంతో.. రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట గా మారాడు సీనియర్ స్టార్. రీసెంట్ గా బైకర్ సినిమాలో శర్వానంద్ తండ్రిగా నటించి మెప్పించాడు మాజీ యాంగ్రీ హీరో. బైకర్ సినిమాలో ఆయన నటనకు గాను ఘన సన్మానం జరిగింది.
రాజశేఖర్ కు ఘన సన్మానం..
హైదరాబాద్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మీట్ ది ప్రెస్’ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌తో పాటు ఆయన భార్య జీవిత రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. సన్మానం తరువాత మాట్లాడిన రాజశేఖర్ ‘బైకర్’ మూవీకి ఆడియన్స్ నుంచి నుంచి మంచి స్పందన రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. “విజయం చూసి చాలా రోజులైంది. ఈ విజయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇతర అవార్డులతో పోలిస్తే క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చే గౌరవం నాకు చాలా పెద్దది” అని ఎమోషనల్ కామెంట్ చేశారు రాజశేఖర్.
సీనియర్ హీరోకి సినిమా సెంటిమెంట్..
గతంలో వచ్చిన అంకుశం సినిమాకి ముందు ప్రమాదం జరిగింది.. ఆ సినిమా హిట్ అయ్యింది.. ఇప్పుడు ‘బైకర్’కు ముందు యాక్సిడెంట్ జరిగింది.. తర్వాత సినిమా విజయవంతం కావడం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. తన నెక్ట్స్ మూవీ కూడా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు రాజశేఖర్. మీడియా తమ కుటుంబానికి ఎప్పుడూ అండగా నిలిచిందన్నారు.
చిరంజీవితో రాజశేఖర్ మల్టీ స్టారర్ మూవీ.. ?
మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాజశేఖర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో చిరంజీవితో రాజశేఖర్ కు జరిగిన వివాదాల గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు అవేమి పట్టించుకోకుండా.. మంచి కథ వస్తే చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు రాజశేఖర్. తెలిపారు. నిజంగా వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ మూవీ వస్తే.. అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
తమిళ రాజకీయాల్లో ఎవరికి సపోర్ట్?
ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమా, ఐ.వి. శశి కుమారుడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు రాజశేఖర్. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ని ఆయన స్వాగతించారు. ప్రజాదరణలో ఎంజీఆర్ తర్వాత అంతటి స్పందన విజయ్‌కే దక్కుతోందని ప్రశంసించారు. రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవి, సమయం ఎక్కువగా అవసరం అవుతుందని, ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు.

