MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు, రాజమౌళి మూవీ టైటిల్ ఇదేనా.. నిజమైతే ఇంతకన్నా పెద్ద షాక్ ఇంకొకటి ఉండదు

మహేష్ బాబు, రాజమౌళి మూవీ టైటిల్ ఇదేనా.. నిజమైతే ఇంతకన్నా పెద్ద షాక్ ఇంకొకటి ఉండదు

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టైటిల్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 08 2025, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 29
Image Credit : Instagram/Rajamouli

మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 29

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఇదే తొలి చిత్రం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మహేష్ మూవీతో గ్లోబల్ రిలీజ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో 1000 కోట్లతో తెరకెక్కుతోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. 

25
నవంబర్ లో అప్డేట్
Image Credit : X/SSMBTrendsTeam

నవంబర్ లో అప్డేట్

రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబ్ ట్రాట్టర్ అని అభివర్ణిస్తున్నారు. ఇటీవలే కెన్యాలో కీలకమైన షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. నవంబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఉంటుందని రాజమౌళి ఇటీవల అనౌన్స్ చేశారు. అయితే ఆ అప్డేట్ ఏంటనేది ఇంకా బయటపెట్టలేదు. అందుతున్న సమాచారం మేరకు టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటివి ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ టైటిల్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ చిత్రానికి రాజమౌళి అండ్ టీం 'వారణాసి' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Related Articles

Related image1
విజయ్ దేవరకొండ లగ్జరీ హౌస్ లోపలి ఫోటోలు చూశారా, రౌడీ హీరోకి ప్రాణంగా మారిపోయిన మరో ఫ్యామిలీ మెంబర్
Related image2
చిరంజీవి చేయకుండా ఉండాల్సిన 7 సినిమాలు ఏవో తెలుసా, కెరీర్ కి మచ్చగా మిగిలినవి ఇవే
35
మూవీ టైటిల్ ఇదేనా
Image Credit : Instagram/Namrata Shirodkar

మూవీ టైటిల్ ఇదేనా

ఇదే కనుక నిజమైతే రాజమౌళి తీసుకున్న నిర్ణయం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కావాలంటే టైటిల్ యూనిక్ గా ఉండాలి. గ్లోబల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. కానీ వారణాసి అనేది ఇండియన్ ఆడియన్స్ కి అప్పీలింగ్ గా ఉండొచ్చు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైన టైటిల్. అలాంటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు అనే ప్రశ్న తలెత్తుతోంది.

45
హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు
Image Credit : our own

హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు

ఈ మూవీలో హిందూ పురాణాలకి సంబంధించిన అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయని ముందు నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీలుక్ లో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. మహేష్ బాబు మెడలో నంది, త్రిశూలం, డమరుకం కనిపించాయి. 

55
ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ
Image Credit : our own

ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఒక జానపద పాటని కూడా కంపోజ్ చేశారట. ఈ సాంగ్ అత్యంత భారీగా, సినిమాలో ఆకట్టుకునే అంశాల్లో ఒకటిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగా భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలని గ్లోబల్ స్థాయిలో తెరకెక్కించే ఫారెస్ట్ అడ్వెంచర్ కథలో రాజమౌళి ఎలా ఇన్వాల్వ్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ పెళ్లి కార్డు ఎవరికి ఇచ్చారు? నిజమెంత?
Recommended image2
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Recommended image3
విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండ లగ్జరీ హౌస్ లోపలి ఫోటోలు చూశారా, రౌడీ హీరోకి ప్రాణంగా మారిపోయిన మరో ఫ్యామిలీ మెంబర్
Recommended image2
చిరంజీవి చేయకుండా ఉండాల్సిన 7 సినిమాలు ఏవో తెలుసా, కెరీర్ కి మచ్చగా మిగిలినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved