MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 20 కోట్ల బంగారం, 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా బిందాస్ గా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

20 కోట్ల బంగారం, 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా బిందాస్ గా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

మోడల్ గా కెరీర్ న్ స్టార్ట్ చేసి, స్టార్ హీరోయిన్ గా ఎదిగి, ప్రస్తుతం హాలీవుడ్ ను కూడా హడలెత్తిస్తోంది స్టార్ హీరోయిన్. వందల కోట్ల ఆస్తులతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 26 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image Credit : our own

ప్రపంచ సుందరిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్‌ ను మించి హాలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటుతోంది. సినిమాలు తగ్గించినా... ఆమె లైఫ్ మాత్రం అదే స్టార్డమ్‌తో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక చోప్రా ఆస్తుల విలువ దాదాపు 700 కోట్లు పైనే ఉన్నట్టు తెలుస్తోంది.

27
Image Credit : instagram

2000లో మిస్ వరల్డ్‌గా విజయం సాధించిన ప్రియాంక, 2002లో తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2003లో ‘ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'ఫ్యాషన్', 'డాన్', 'బర్ఫీ', ' మేరీ కోమ్' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Related Articles

Related image1
త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో ఎఫైర్ సంగతేంటి?
Related image2
100 కోట్లు ఇచ్చినా ఆ హీరో వద్దు, ఆ సినిమా చేయను, నయనతార రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
37
Image Credit : instagram

ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈమూవీ తెరకెక్కుతోంది. ఇక త‌న భ‌ర్త నిక్ జోనాస్, కూతురు మాల్టి మేరీ తో కలిసి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఓ లగ్జరీ హౌస్‌లో ఉంటోంది ప్రియాంక.

47
Image Credit : Social Media

ప్రియాంక ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంది. 2016లో ఆస్కార్ వేడుకలో ప్రియాంక ధరించిన వజ్రాల చెవి దిద్దులు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. వాటి విలువ దాదాపు 21.75 కోట్లు ఉంటాయని అంచనా. అంతే కాదు ఆమె దగ్గర 72 కోట్లు విలువ చేసే ఓ అందమైన గౌన్ కూడా ఉంది. అంతేనా 2018లో నిక్ జోనాస్‌తో ఎంగేజ్మెంట్ సమయంలో ప్రియాంక వేలుకి ధరించిన డైమండ్ రింగ్ ఖరీదు 2.1 కోట్లు.

57
Image Credit : instagram

ఇలా కాస్ట్లీ లైఫ్ ను లీడ్ చేస్తోన్న ప్రియాంక ఖరీదైన బట్టలు, కార్లు, మేకప్ బ్రాండ్లు మాత్రమే ఉపయోగిస్తుంది. ఆమె ఎన్నో ఫ్యాషన్ ఈవెంట్స్‌లో పాల్గొంది, ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు మోడల్ గా, హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది.

67
Image Credit : instagram

సినిమాలు తగ్గించినా, ఆమె ఆదాయం తగ్గలేదు. సినిమాలతో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాలతో కలిసి ఆమె సంపద రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తున్న ప్రియాంక ది వైట్ టైగర్ అనే సినిమా ద్వారా చివరిసారిగా బాలీవుడ్ తెరపై కనిపించింది

77
Image Credit : Social Media

ఆమధ్య సినిమాలకు దాదాపు నాలుగేదేళ్లు బ్రేక్ ఇచ్చింది ప్రియాంక. అయినా సరే ఆమె కెరీర్ డౌన్ అవ్వలేదు. స్టార్ డమ్ తో పాటు లగ్జరీ లైఫ్ లో కూడా ఏమాత్రం తేడా రాలేదు. ఇండియాన్ హీరోయిన్ అయినా ప్రియాంక ప్రస్తుతం గ్లోబల్ ఐకాన్‌గా కొనసాగుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో ఎఫైర్ సంగతేంటి?
Recommended image2
100 కోట్లు ఇచ్చినా ఆ హీరో వద్దు, ఆ సినిమా చేయను, నయనతార రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved