MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో వద్దు, ఆ సినిమా చేయను, నయనతార రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?

100 కోట్లు ఇచ్చినా ఆ హీరో వద్దు, ఆ సినిమా చేయను, నయనతార రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నటి నయనతార. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నయన్.. 100 కోట్లు ఇచ్చినా కూడా ఓ హీరో పక్కన నటించనని స్పష్టంగా చెప్పేసిందట. ఇంతకీ ఎవరా హీరో? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 26 2025, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : our own

నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన ‘జవాన్’ సినిమా 1000 కోట్లకుపైగా వసూలు సాధించగా, నయనతారకు ఆ సినిమాలో రూ. 12 కోట్లు పారితోషికంగా అందినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె KGF హీరో యష్ తో కలిసి ‘టాక్సిక్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో యష్ కు అక్కగా ఆమె నటిస్తున్నట్టు సమాచారం.

25
Image Credit : our own

అయితే 2022లో విడుదలైన ‘ది లెజెండ్’ సినిమాలో నయనతార నటించాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించిన శరవణన్ తన సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆమె ఇంటికి పలుమార్లు వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించిన శరవణన్, రెమ్యూనరేషన్ కింద డబుల్‌ చెల్లిస్తానని కూడా చెప్పారట.

Related Articles

Related image1
త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో ఎఫైర్ సంగతేంటి?
Related image2
నయనతార డబుల్ రోల్, ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన లేడీ సూపర్ స్టార్
35
Image Credit : Nayanthara

కానీ నయనతార మాత్రం “100 కోట్లు ఇచ్చినా అతనితో పనిచేయను” అంటూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళ జర్నలిస్ట్ బాలు గతంలో మీడియాకు వెల్లడించారు. నయనతార ఇంటి ముందు ఒక సమయంలో రోల్స్ రాయిస్ కారు కనిపించేది. అది శరవణన్ కారు అని తర్వాత తెలిసిందని ఆయన అన్నారు. నయన్ ను ఒప్పించేందుకు చాలా సార్లు ఆయన నయన్ ఇంటికి వచ్చేవారని బాలు అన్నారు.

45
Image Credit : our own

ఇక నయనతార రిజెక్ట్ చేయడంతో ‘ది లెజెండ్’ సినిమాకు నయనతార స్థానంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఈ రకంగా ప్లాప్ మూవీ నుంచి ఆమె తప్పించుకుందనే చెప్పాలి.

55
Image Credit : our own

ఇదిలా ఉండగా, నయనతార ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపారాల్లో కూడా ఎంతో చురుకుగా ఉంటోంది. ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా ఈ ప్రయాణంలో ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. సినిమా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాలు ఇలా అన్ని వైపుల నుంచి కోట్లలో సంపాదిస్తోంది నయనతార. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న హీరోయిన్లలో ముందు వరుసలో నయన్ ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో ఎఫైర్ సంగతేంటి?
Recommended image2
నయనతార డబుల్ రోల్, ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన లేడీ సూపర్ స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved