MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్ లో ప్రియా వారియర్ హంగామా.. గ్లామరస్ ఫోటోస్ వైరల్

బీచ్ లో ప్రియా వారియర్ హంగామా.. గ్లామరస్ ఫోటోస్ వైరల్

మలయాళీ యంగ్ హీరోయిన్ ప్రియా వారియర్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె షేర్ చేసిన బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 09 2025, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రియా వారియర్ బీచ్ ఫోటోలు వైరల్ 
Image Credit : Instagram/Priya Prakash Varrier

ప్రియా వారియర్ బీచ్ ఫోటోలు వైరల్ 

మలయాళీ నటి ప్రియా ప్రకాష్ వారియర్ తన తాజా బీచ్ ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ 25 ఏళ్ల యంగ్ బ్యూటీ ఇండోనేసియాలోని బాలీ దీవుల్లో వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ బీచ్‌ ఒడ్డున దిగిన గ్లామరస్ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలకు ప్రియా వారియర్ 'అలలని రొమాంటిక్ గా మార్చేస్తున్నా' అని క్యాప్షన్ ఇచ్చింది. 

25
ట్రెండీ అవుట్ ఫిట్ లో ప్రియా వారియర్ 
Image Credit : Instagram/Priya Prakash Varrier

ట్రెండీ అవుట్ ఫిట్ లో ప్రియా వారియర్ 

ప్రియా వారియర్ ఈ ఫొటోలో బికినీ తరహాలో ట్రెండీ టచ్ ఇస్తూ ఫ్లోరల్ టాప్, డెనిమ్ షార్ట్‌లను ధరించి స్టైలిష్‌గా మెరిసింది. బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ తీసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బాలీలో తన పర్యటనకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది.

Related Articles

Related image1
ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. శుభం నుంచి రానా నాయుడు 2 వరకు కంప్లీట్ లిస్ట్
Related image2
రవి మోహన్, కెనీషా రిలేషన్..ఆమె గర్భవతి అంటూ రూమర్స్ ? కర్మ వదిలిపెట్టదు, ఘాటు రియాక్షన్ వైరల్
35
గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్
Image Credit : Instagram/Priya Prakash Varrier

గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఏడాది ఇప్పటివరకు రెండు ముఖ్యమైన తమిళ చిత్రాల్లో నటించింది. అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో, ధనుష్ ప్రధాన పాత్రలో వచ్చిన నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడి కోబం (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా) చిత్రాల్లో కీలక పాత్రలో నటించింది.

45
ప్రియా వారియర్ చిత్రాలు
Image Credit : Instagram/Priya Prakash Varrier

ప్రియా వారియర్ చిత్రాలు

ప్రస్తుతం ఈ నటి రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై పని చేస్తోంది. ఒకటి అర్జున్ రాంపాల్ నటిస్తున్న 3 మంకీస్, మరొకటి లవ్ హాకర్స్ అనే థ్రిల్లర్. ఈ రెండు సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

55
కెరీర్ లో బిజీగా.. 
Image Credit : Instagram/Priya Prakash Varrier

కెరీర్ లో బిజీగా.. 

ఓవైపు వెకేషన్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమాలతో ప్రియా ప్రకాష్ వారియర్ తన కెరీర్‌లో బిజీగా మార్చుకుంది. ఆమె నటనతో పాటు గ్లామర్ ప్రెజెన్స్‌తో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ప్రియా వారియర్.. సిమ్రన్ పాటకి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image3
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Related Stories
Recommended image1
ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. శుభం నుంచి రానా నాయుడు 2 వరకు కంప్లీట్ లిస్ట్
Recommended image2
రవి మోహన్, కెనీషా రిలేషన్..ఆమె గర్భవతి అంటూ రూమర్స్ ? కర్మ వదిలిపెట్టదు, ఘాటు రియాక్షన్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved