MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్క సీన్ కోసం 57 రోజులు, వీరమల్లులో హైలైట్ అదే..నిధి అగర్వాల్ కష్టపడుతుంటే సిగ్గేసింది, పవన్ కామెంట్స్

ఒక్క సీన్ కోసం 57 రోజులు, వీరమల్లులో హైలైట్ అదే..నిధి అగర్వాల్ కష్టపడుతుంటే సిగ్గేసింది, పవన్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న రిలీజ్ అవుతోంది. సాధారణంగా సినిమా ప్రచారానికి పవన్ దూరంగా ఉంటారు. అలాంటిది తాజాగా హరిహర వీరమల్లు కోసం పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 21 2025, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హరిహర వీరమల్లు మీడియా సమావేశం
Image Credit : Youtube/ Mythri Movie Makers

హరిహర వీరమల్లు మీడియా సమావేశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. ఐదేళ్ల పాటు అనేక ఒడిదుడుకులతో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో కీరవాణి సంగీత దర్శకుడిగా ఈ చిత్రం రూపొందింది. గురువారం రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా హరిహర వీరమల్లు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు.

25
ఏఎం రత్నం గారి కోసమే ప్రెస్ మీట్ పెట్టా: పవన్ కళ్యాణ్
Image Credit : Youtube/ Mythri Movie Makers

ఏఎం రత్నం గారి కోసమే ప్రెస్ మీట్ పెట్టా: పవన్ కళ్యాణ్

మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు షూటింగ్ లో ఎదురైన ఒడిదుడుకులు, చిత్ర యూనిట్ లో ఒక్కొక్కరి కష్టం ఇలా అన్ని విషయాలని ప్రస్తావించారు. రాజకీయ సమావేశాల్లో మాట్లాడతాను కానీ ఇలా సినిమా సమావేశాల్లో మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిర్మాత ఏఎం రత్నం గారి కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఈ చిత్రం కోసం ఏఎం రత్నం చాలా కష్టాలు పడ్డారు. అప్పట్లోనే పాన్ ఇండియా చిత్రాలు తీసిన నిర్మాత ఆయన. 

Related Articles

Related image1
లిప్ లాక్ సీన్స్ పై నిధి అగర్వాల్ కామెంట్స్.. నా తల్లిదండ్రులతో కూర్చుని చూడలేని సన్నివేశాల్లో నటించను
Related image2
డ్యాన్సుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, కృష్ణలా చేయలేను అని బ్రతిమాలిన చిరు..సూపర్ స్టార్ చెప్పిన ఒక్క మాటతో
35
క్లైమాక్స్ సీన్ కోసం 57 రోజులు షూటింగ్
Image Credit : Youtube/ Mythri Movie Makers

క్లైమాక్స్ సీన్ కోసం 57 రోజులు షూటింగ్

నాకు ప్రస్తుతం సినిమాలకు టైం కేటాయించడమే పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కేవలం ఈ మూవీ క్లైమాక్స్ కోసమే 57 రోజులు కేటాయించాను. అంత కష్టంతో కూడుకున్న సన్నివేశం అది. డైరెక్టర్ క్రిష్ గారు నా దగ్గరకి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చారు. ఈ సందర్భంగా క్రిష్ కి ధన్యవాదాలు చెబుతున్నా. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

45
ఒక దశలో ఈ చిత్రం ఆగిపోతుందా అనే అనుమానం కలిగింది
Image Credit : Youtube/ Mythri Movie Makers

ఒక దశలో ఈ చిత్రం ఆగిపోతుందా అనే అనుమానం కలిగింది

కోవిడ్ ప్రభావం ఈ చిత్రంపై ఎక్కువగా పడింది. ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఒక దశలో ఈ చిత్రం ముందుకు వెళుతుందా? ఆగిపోతుందా అనే సందేహం నాకు కలిగింది. అలాంటి టైంలో కీరవాణి గారు ఈ చిత్రానికి ప్రాణవాయువులా నిలిచారు. క్రిష్ గారు ఈ చిత్రం నుంచి తప్పు కున్న తర్వాత జ్యోతి కృష్ణ గారు ఎంటర్ అయ్యారు. ఆయన చాలా సత్తా ఉన్న దర్శకుడు.  ప్రతి సీన్ కి ఆయన ప్రీ విజువలైజేషన్ చేశారు. మనోజ్ పరమహంస గారితో కలిసి అద్భుతం చేశారు. 

55
నిధి అగర్వాల్ ఒక్కరే ప్రమోషన్స్ చేస్తుంటే సిగ్గనిపించింది 
Image Credit : Youtube/ Mythri Movie Makers

నిధి అగర్వాల్ ఒక్కరే ప్రమోషన్స్ చేస్తుంటే సిగ్గనిపించింది 

డైరెక్టర్ జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం ఇలా చిత్ర యూనిట్ మొత్తం ఇప్పటికీ సరైన నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. నిధి అగర్వాల్ ఒక్కరే ప్రమోషన్స్ తన భుజాల మీదికి వేసుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిధి అగర్వాల్ ఒక్కరే కష్టపడుతుంటే నాకే సిగ్గనిపించింది. సినిమాని అనాథలా వదిలేశానా అనే ఫీలింగ్ కలిగింది. ఈ చిత్రాన్ని అనాథలా వదల్లేదు అని చెప్పేందుకే ఈ మీడియా సమావేశం నిర్వహించా అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image3
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
లిప్ లాక్ సీన్స్ పై నిధి అగర్వాల్ కామెంట్స్.. నా తల్లిదండ్రులతో కూర్చుని చూడలేని సన్నివేశాల్లో నటించను
Recommended image2
డ్యాన్సుల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్, కృష్ణలా చేయలేను అని బ్రతిమాలిన చిరు..సూపర్ స్టార్ చెప్పిన ఒక్క మాటతో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved