MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓజీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే ? టార్గెట్ పెద్దదే.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం జుజుబీనే

ఓజీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే ? టార్గెట్ పెద్దదే.. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం జుజుబీనే

పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఒహకందని హైప్ తో సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓజీ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు రాబడితే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 22 2025, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓజీపై ఆకాశాన్ని తాకే హైప్ 
Image Credit : Youtube print shot/ Sony Music South

ఓజీపై ఆకాశాన్ని తాకే హైప్ 

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ విడుదల దగ్గరపడుతుండటంతో అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీపై ఇప్పటికే ఆకాశాన్ని తాకే హైప్ ఉంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు మాత్రమే కాక, ట్రేడ్ వర్గాలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

25
నిరాశపరిచిన ప్రమోషన్స్
Image Credit : Asianet News

నిరాశపరిచిన ప్రమోషన్స్

 అయితే సినిమా ప్రమోషన్స్ మాత్రం సరిగ్గా జరగడం లేదు. ట్రైలర్ ఇంతవరకు ఆన్లైన్ లో రిలీజ్ కాలేదు. ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్షార్పణం అన్నట్లుగా సాగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కొంత ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. వర్షం కారణంగా త్వరగా చుట్టేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో టికెట్ల కోసం ఎక్కడలేని డిమాండ్ నెలకొంది. సెప్టెంబర్ 24న తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పైడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కలెక్షన్స్ టార్గెట్‌పై కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.

Related Articles

Related image1
ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. పండగ చేసుకునే కంటెంట్ రెడీ, ఏ మూవీ ఎక్కడ చూడాలంటే
Related image2
బోరున వర్షంలో పాట పాడిన పవన్ కళ్యాణ్, ట్రైలర్ విషయంలో మొండిచేయి చూపిన చిత్ర యూనిట్
35
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే 
Image Credit : Asianet News

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే 

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఓజీ బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.300–310 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ.150 కోట్ల షేర్ రావాల్సి ఉంటుందని చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ అప్పియరెన్స్, థమన్ సంగీతం ఈ చిత్రంపై ఇంతటి హైప్  రావడానికి కారణం అయ్యాయి. 

45
పాజిటివ్ టాక్ వస్తే చాలు 
Image Credit : Asianet News

పాజిటివ్ టాక్ వస్తే చాలు 

ఇప్పటికే టీజర్లు, పోస్టర్లు, పాటలతో సినిమాపై క్రేజ్ పెరిగింది. ఈ స్థాయిలో హైప్ ఉన్న నేపథ్యంలో, పాజిటివ్ మౌత్ టాక్ వస్తే ఓజీ  తొలి వారం రోజుల్లోనే తన టార్గెట్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

55
ముంబై నేపథ్యంలో కథ 
Image Credit : Asianet News

ముంబై నేపథ్యంలో కథ 

DVV ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఎప్పుడూ హైప్ ఉంటుంది. కానీ ఓజీ విషయంలో మాత్రం ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు బ్రేక్‌ఈవెన్ టార్గెట్ కూడా బయటకు రావడంతో, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి. సాహో తర్వాత సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ముంబై నేపథ్యంలో జరిగే రెండు గ్రూపుల మాఫియా పోరాటంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
ఈవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. పండగ చేసుకునే కంటెంట్ రెడీ, ఏ మూవీ ఎక్కడ చూడాలంటే
Recommended image2
బోరున వర్షంలో పాట పాడిన పవన్ కళ్యాణ్, ట్రైలర్ విషయంలో మొండిచేయి చూపిన చిత్ర యూనిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved