- Home
- Entertainment
- రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్, తిరిగి ఇవ్వకుండా పవర్ స్టార్ ఎలా తప్పించుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్, తిరిగి ఇవ్వకుండా పవర్ స్టార్ ఎలా తప్పించుకున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర అప్పు చేశారని మీకు తెలుసా? బాబాయికి చరణ్ ఎంత అప్పు ఇచ్చారు? ఎంత వడ్డీ వసూలు చేశారు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికార బాధ్యతలు, సినిమా కమిట్మెంట్లను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన నటించిన మూడు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇక పవన్ పొలిటికల్ పొజిషన్ చూస్తూ మెగా ఫ్యామిలీ గర్వంతో మురిసిపోతోంది.
ఏపీ ఎన్నికల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ప్రచారం చేయడంతో పాటు గెలిపించుకున్నారు. ఈక్రమంలో బాబాయ్ తో చరణ్ అనుబంధం గురించి మెగా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు. పవన్-చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హీరోలు కాకముందు బాబాయ్ అబ్బాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారట వీరు. ఇక వీరిద్దరి మధ్య గతంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వారు ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.
అదేంటంటే... పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకున్నాడు! ఇది నిజమే. కానీ ఈ సంఘటన చాలా రోజుల క్రింతం జరిగింది. అప్పటికి పవన్ సినిమాల్లోకి రాలేదు, రామ్ చరణ్ అయితే ఇంకా చిన్నవాడు. మెగా కుటుంబం చెన్నైలో ఒకే ఇంట్లో నివసిస్తుండగా, పవన్ ఖాళీగా ఉండేవారు, పాకెట్ మనీ కోసం చిరంజీవి మీద ఆధారపడేవారు. చిరంజీవి ఇచ్చిన డబ్బులు అయిపోతే, చరణ్‌కు ఇచ్చిన పాకెట్ మనీ నుంచి ఏదో ఒక కథ చెబుతూ డబ్బులు అడిగేవాడట.
వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పి చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడట పవన్. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చరణ్ కూడా ఇచ్చేసేవాడట. కాని ఆతరువాత డబ్బులు అడిగితే ఏదో ఒక మాయచేసేవారని వారు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఇది పవన్ స్వయంగా రామ్ చరణ్‌తో కలిసి పంచుకున్న జ్ఞాపకం. మా ఇంట్లో జరిగిన ఈ మధురమైన సంఘటనలు నేటికీ మనస్సులో నిలిచిపోయాంటున్నారు మెగా హీరోలు.
అంతే కాదు, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత , రామ్ చరణ్ మధ్య చిన్న చిన్న తగువులు కూడా పెట్టేవారట పవన్ . ఇద్దరికి ఒకరికి ఇంకొకరికి చాడీలు చెపుతూ గొడవలు పెట్టి నవ్వుకునేవాడట. అలా చిన్నతనంలో పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ విషయాలన్నీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పుడు వీరితో పాటు ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఆయన కూడా అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.
ఇక ఆరోజులు పోయాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏకంగా రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిడులు ఎదుర్కొని రాజకీయంగా విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కీలక శాఖల బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
ఇటు రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు లభించాయి. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు సాన డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు. ఆతరువాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్.