MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?

Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం బరి ఈ సినిమా షూటింగ్ లో వరుణ్ తేజ్ గాయపడిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ కు ఏమయ్యింది..? ఇప్పుడెలా ఉంది? ఈ విషయాలను నిర్మాత వెల్లడించారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 15 2026, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయం
Image Credit : Asianet News

వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయం

వరుణ్ తేజ్ నటుస్తున్న తాజా మూవీ బరి. ఈసినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై.. యదు వంశీ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. చిత్రీకరణలో భాగంగా వాలీబాల్ ఆటకు సంబంధించిన సన్నివేశాల కోసం.. వరుణ్ తేజ్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన మోకాలికి తీవ్ర గాయం జరిగినట్లు సమాచారం.

24
నిహారిక కొణిదెల ప్రకటన
Image Credit : our own

నిహారిక కొణిదెల ప్రకటన

ఈ గాయం తీవ్రంగా ఉండటంతో.. పరిశీలించిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. దాంతో రీసెంట్ గా వరుణ్ తేజ్‌కు మోకాలికి ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనట్లు వరున్ తేజ్ చెల్లెలు, మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ వరుణ్ అన్న ‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. డాక్టర్లు పరీక్షించి ఆయనకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ప్రస్తుతం ఆయన కంప్లీట్ గా రెస్ట్ లో ఉన్నాడు” అని అన్నారు.

Related Articles

Related image1
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Related image2
నాగార్జున, ఎన్టీఆర్ నుంచి సుమ శ్రీముఖి వరకూ.. భారీ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ యాంకర్స్ ఎవరో తెలుసా?
34
వరుణ్ అన్నత్వరలో కోలుకుంటాడు..
Image Credit : Asianet News

వరుణ్ అన్నత్వరలో కోలుకుంటాడు..

నిహారిక ప్రకటనలో.... “త్వరలోనే వరుణ్ అన్నయ్య పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మాకు  సపోర్ట్  గా నిలిచిన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని ఆమె తెలిపారు.ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

44
వరుణ్ తేజ్ స్పెషల్ ట్రైయినింగ్
Image Credit : our own

వరుణ్ తేజ్ స్పెషల్ ట్రైయినింగ్

‘బరి’ సినిమా కోసం స్పెషల్ ట్రైయినింగ్ తీసుకుంటున్నాడు వరుణ్ తేజ్.. ఇదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తో మూవీ షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. అయితే వరుణ్ పెద్ద గండం నుంచి బయటపడటం.. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే వరుణ్ పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సెలబ్రిటీ బాడీగార్డ్‌ల జీతం కోట్లలో ఉంటుందా? షారుఖ్ ఖాన్ మాజీ బాడీగార్డ్ చెప్పిన అసలు నిజం..
Recommended image2
Jr NTR Transformation: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం, కండలు తిరిగిన తారక్ బాడీ సీక్రెట్ ఇదే
Recommended image3
Rajasekhar: చిరంజీవి, రాజశేఖర్ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ, గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన హీరో, మెగాస్టార్ సంగతేంటి?
Related Stories
Recommended image1
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Recommended image2
నాగార్జున, ఎన్టీఆర్ నుంచి సుమ శ్రీముఖి వరకూ.. భారీ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ యాంకర్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved