MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: రూ. 500 కోట్ల బడ్జెట్.. ఐఎండీబీలో టాప్ రేటింగ్.. 9 ఏళ్లుగా ఓటీటీ ఆడియన్స్‌ను భయపెడుతోన్న వెబ్‌సిరీస్

OTT: రూ. 500 కోట్ల బడ్జెట్.. ఐఎండీబీలో టాప్ రేటింగ్.. 9 ఏళ్లుగా ఓటీటీ ఆడియన్స్‌ను భయపెడుతోన్న వెబ్‌సిరీస్

OTT: నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత కాస్ట్లీ వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికే నాలుగు సీజన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు ఐదో సీజన్‌పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ సిరీస్ ఏంటి.? బడ్జెట్ ఎంత.? ఇప్పుడు చూసేద్దాం. 

2 Min read
Author : Pavithra D
Published : Oct 12 2025, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అత్యంత కాస్ట్లీ వెబ్ సిరీస్
Image Credit : Stranger Things Insta

అత్యంత కాస్ట్లీ వెబ్ సిరీస్

క్రైమ్ నుంచి హారర్ వరకు.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్‌కు నెట్‌ఫ్లిక్స్ నిలయం. ఇది ఒక ప్రత్యేకమైన వెబ్ సిరీస్. ఇప్పటికే నాలుగు సీజన్లు విడుదలయ్యాయి. అవన్నీ కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక ఐదో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సిరీస్ మరేదో కాదు స్ట్రేంజర్ థింగ్స్. దాదాపుగా ఈ వెబ్ సిరీస్‌ను రూ. 450-500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

25
సీజన్-5 ఆన్ కార్డ్స్
Image Credit : Stranger Things Insta

సీజన్-5 ఆన్ కార్డ్స్

2016లో ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్.. ఇప్పటికీ 9 ఏళ్లు పూర్తైన ట్రెండింగ్‌లోనే ఉంది. నెట్ ఫ్లిక్స్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ సీజన్-5 రూపొందుతోంది. ఈ సీజన్ ప్రతీ ఎపిసోడ్ రూ. 4.5-5.5 కోట్లు ఖర్చు అవుతోందని సమాచారం. అంటే.. టీవీ షోల కంటే.. ఈ బడ్జెట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ధీటైనది. ఈ సిరీస్ ప్రధానంగా విజువల్స్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంది. 1980 నాటి సెట్స్, అలాగే సిరీస్‌లో వెంటాడే అప్‌సైడ్ డౌన్ విలన్‌కు ఖర్చు ఎక్కువే అవుతుంది. స్ట్రేంజర్ థింగ్స్- సీజన్ 5లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి.

Related Articles

Related image1
Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే
Related image2
War 2 OTT Release : వార్ 2 ఇక్కడైనా హిట్ అవుతుందా ? ఓటీటీ రిలీజ్ డేట్ డీటెయిల్స్
35
భారీ బడ్జెట్.. భారీ రన్ టైం
Image Credit : Stranger Things Insta

భారీ బడ్జెట్.. భారీ రన్ టైం

ప్రతి ఎపిసోడ్ 90 నుంచి 120 నిమిషాల మధ్య ఉంటుంది. అంటే ఐదవ సీజన్ మొత్తం 11 గంటలకు పైగా రన్‌టైమ్ కలిగి ఉంటుందన్న మాట. ఈ సిరీస్‌లో మొదటి నాలుగు ఎపిసోడ్‌లు నవంబర్ 26న విడుదల కాగా.. తదుపరి మూడు ఎపిసోడ్‌లు డిసెంబర్ 25న ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వస్తాయి.

45
క్లైమాక్స్ ఎపిసోడ్ డిసెంబర్ 31న..
Image Credit : Stranger Things Insta

క్లైమాక్స్ ఎపిసోడ్ డిసెంబర్ 31న..

ఇక చివరి క్లైమాక్స్ ఎపిసోడ్ డిసెంబర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు.. స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు పెద్ద సినిమాటిక్ ట్రీట్ అని చెప్పొచ్చు. ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ ఐదో సీజన్ కూడా సూపర్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

55
మిల్లీ బాబీ బ్రౌన్ ప్రధాన పాత్రలో..
Image Credit : Stranger Things Insta

మిల్లీ బాబీ బ్రౌన్ ప్రధాన పాత్రలో..

ఇక తారాగణం విషయానికొస్తే.. చివరి సీజన్‌లో మిల్లీ బాబీ బ్రౌన్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, గేటెన్ మాతరాజో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, నోహ్ ష్నాప్, వినోనా రైడర్, డేవిడ్ హార్బర్, సాడీ సింక్, జామీ కాంప్‌బెల్ బోవర్, నటాలియా డయ్యర్, చార్లీ హీటన్, జో కీరీ, మాయా హాక్ వంటి వారు ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image2
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Recommended image3
Sonam Kapoor Baby Shower: సోనమ్ కపూర్ సీమంతం వేడుక.. గెస్ట్ లు ఎవరెవరో తెలుసా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే
Recommended image2
War 2 OTT Release : వార్ 2 ఇక్కడైనా హిట్ అవుతుందా ? ఓటీటీ రిలీజ్ డేట్ డీటెయిల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved