MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే

Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే

Top 5 OTT Movies and Series: ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్‌ `కూలీ`కి `మహావతార్‌ నరసింహ` షాకిచ్చింది. ఆ కథేంటో చూద్దాం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 30 2025, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Top 5 Most Watched Movies and Web Series on OTT
Image Credit : Google

Top 5 Most Watched Movies and Web Series on OTT

ఈ మధ్య ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది. థియేటర్ కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తుండటంతో దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో థియేటర్‌కి వచ్చి చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇంట్లో నుంచే ఏ భాషా చిత్రాన్నైనా చూసే సౌలభ్యం ఓటీటీ కల్పిస్తోంది. దీంతో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా  సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ఓటీటీలో ఎక్కువ వ్యూస్ పొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాని విడుదల చేసింది ఓర్మాక్స్ మీడియా. ఇది ప్రతి వారం ఈ డేటాని అందిస్తుంది. 

24
ఓటీటీలో టాప్‌ 4లో రజనీకాంత్‌ `కూలీ`
Image Credit : instagram

ఓటీటీలో టాప్‌ 4లో రజనీకాంత్‌ `కూలీ`

ఓటీటీలో అత్యధిక వ్యూస్ పొందిన చిత్రాల జాబితాలో బాలీవుడ్‌ మూవీ 'సన్ ఆఫ్ సర్దార్ 2' ఐదో స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 19 లక్షల వ్యూస్ వచ్చాయి. రజినీకాంత్ 'కూలీ' నాలుగో స్థానానికి పడిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి గత వారం 30 లక్షల వ్యూస్ వచ్చాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఊపేంద్ర, సత్యరాజ్‌, శృతి హాసన్‌, సౌబిన్‌ షాహిర్‌ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదలై థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఐదు వందల కోట్ల వసూళ్లని రాబట్టింది. అయినప్పటికీ హిట్‌ జాబితాలో చేరలేకపోయింది. 

Related Articles

Related image1
Naga Chaitanya: నాగార్జునని మించిన మన్మథుడు నాగచైతన్య.. ఆ రహస్యాలు బయటపెట్టిన జగపతిబాబు
Related image2
కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్నకి పోటీగా వచ్చి అడ్రస్‌ లేకుండా పోయిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా?
34
ఓటీటీలో నెంబర్‌ 1గా మహావతార్‌ నరసింహ
Image Credit : Social Media

ఓటీటీలో నెంబర్‌ 1గా మహావతార్‌ నరసింహ

ఈ జాబితాలో మోహన్‌లాల్ 'హృదయపూర్వం' మూడో స్థానంలో ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 34 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ థియేటర్లలోనూ సత్తా చాటింది. ఇప్పుడు దాన్ని మించి ఓటీటీలో మంచి వ్యూస్‌ సాధిస్తోంది. ఇక థియేటర్లో దుమారం రేపిన బాలీవుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ 'సైయారా' రెండో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 45 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతపాటు యానిమేషన్‌ మైథలాజికల్‌ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ' 57 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. థియేటర్లలోనూ ఈ మూవీ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం థియేటర్లలో ఏకంగా రూ.325కోట్లు రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్‌ కేవలం రూ.15కోట్లు మాత్రమే కావడం విశేషం. 

44
ఓటీటీలో టాప్‌లో `ది బ్యాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌` వెబ్‌ సిరీస్‌
Image Credit : Instagram

ఓటీటీలో టాప్‌లో `ది బ్యాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌` వెబ్‌ సిరీస్‌

అత్యధిక వ్యూస్ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాలో 'వెన్స్‌డే' సీజన్ 2 (.8 మిలియన్‌ వ్యూస్‌) ఐదో స్థానంలో ఉంది. తమన్నా నటించిన 'డూ యు వానా పార్టనర్' ( 1.3M)నాలుగో స్థానంలో ఉంది. 'సిక్సర్స్' సీజన్ 2(1.8M) మూడో స్థానంలో, 'ది ట్రయల్' సీజన్ 2(2.8M) రెండో స్థానంలో ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' 57 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్‌ సెలబ్రిటీల తెరవెనుక జీవితాలు, లవ్‌ స్టోరీస్‌, లస్ట్ వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్‌ మొత్తం గెస్ట్ లు మెరిశారు. అంతేకాదు తెలుగు నుంచి రాజమౌళి కూడా కాసేపు అలరించారు. దీంతో భారీ హైప్‌ నెలకొంది. దీనికితోడు తమన్నా స్పెషల్‌ సాంగ్‌ దుమ్ములేపింది. ఓటీటీలో ఈ సిరీస్‌ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. దీనికి 5.7 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Surekha Vani కి రెండో పెళ్లి, కూతురు సుప్రీత ప్లాన్‌.. ఆఫర్స్ లేవంటూ ఆవేదన
Recommended image2
ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి
Recommended image3
Sonam Kapoor Baby Shower: సోనమ్ కపూర్ సీమంతం వేడుక.. గెస్ట్ లు ఎవరెవరో తెలుసా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Naga Chaitanya: నాగార్జునని మించిన మన్మథుడు నాగచైతన్య.. ఆ రహస్యాలు బయటపెట్టిన జగపతిబాబు
Recommended image2
కృష్ణంరాజు బొబ్బిలి బ్రహ్మన్నకి పోటీగా వచ్చి అడ్రస్‌ లేకుండా పోయిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved