MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరోయిన్ పై నానికి క్రష్, సెట్ లోనే గుంజీళ్లు తీయించింది.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలు ఇవే

ఆ హీరోయిన్ పై నానికి క్రష్, సెట్ లోనే గుంజీళ్లు తీయించింది.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలు ఇవే

నేచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చిత్రాలు, ఆ టైంలో హీరోయిన్ పై క్రష్ లాంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 04 2025, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ లోకి రాగానే నాని హీరో అయిపోలేదు. ఎన్నో కెరీర్ బిగినింగ్ లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2005 నుంచి 2007 వరకు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నాని మొత్తం 4 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 

25
Image Credit : Instagram/ Sneha

బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాధా గోపాళం చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని కెరీర్ ప్రారంభం అయింది. ఈ మూవీలో శ్రీకాంత్, స్నేహ జంటగా నటించారు. రాధాగోపాళం చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత నితిన్ నటించిన అల్లరి బుల్లోడు చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకుడు. నితిన్, త్రిష జంటగా ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

Related Articles

Related image1
అందరి ముందు అమ్మాయిని ఆ మాట అడిగేసిన లాయర్, గర్భవతిగా అదరగొట్టిన అనుమప.. వకీల్ సాబ్ ని గుర్తు చేసేలా
Related image2
షర్ట్ లేకుండా 18 ఏళ్ళ క్రితం ఒకే చోట రాంచరణ్, అల్లు అర్జున్.. ఈ రేర్ ఫోటో వెనుక కథేంటో తెలుసా
35
Image Credit : Asianet News

ఆ తర్వాత మంచు విష్ణు అస్త్రం, ఢీ చిత్రాలకు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. వీటిలో అస్త్రం డిజాస్టర్ కాగా, ఢీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాధా గోపాళం చిత్రానికి వర్క్ చేసే సమయంలో నానికి.. హీరోయిన్ స్నేహపై క్రష్ ఏర్పడిందట. వయసులో స్నేహ నాని కంటే 2 ఏళ్ళు పెద్దవారు. అయినప్పటికీ ఆమెపై తనకి క్రష్ ఏర్పడిందని నాని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

45
Image Credit : Asianet News

వీరిద్దరూ రాధాగోపాళం సెట్స్ లో సరదాగా ఉన్న ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. స్నేహ సరదాగా నాని చేత గుంజీళ్లు తీయిస్తున్న దృశ్యాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. 2008లో నానికి హీరోగా అష్టాచమ్మా చిత్రంతో అవకాశం వచ్చింది. తొలి చిత్రం నుంచే నానికి హిట్స్ మొదలయ్యాయి. అలా మొదలైంది చిత్రం నాని కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత నాని వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు. 

55
Image Credit : Asianet News

నాని చివరగా సరిపోదా శనివారం, హిట్ ది థర్డ్ కేస్ చిత్రాల్లో నటించారు. ఆ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
అందరి ముందు అమ్మాయిని ఆ మాట అడిగేసిన లాయర్, గర్భవతిగా అదరగొట్టిన అనుమప.. వకీల్ సాబ్ ని గుర్తు చేసేలా
Recommended image2
షర్ట్ లేకుండా 18 ఏళ్ళ క్రితం ఒకే చోట రాంచరణ్, అల్లు అర్జున్.. ఈ రేర్ ఫోటో వెనుక కథేంటో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved