MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య కొడుకు గురించి మ్యాటర్ లీక్ చేసిన నారా రోహిత్, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్.. మోక్షజ్ఞ అలా చేస్తున్నాడా

బాలయ్య కొడుకు గురించి మ్యాటర్ లీక్ చేసిన నారా రోహిత్, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్.. మోక్షజ్ఞ అలా చేస్తున్నాడా

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యం అవుతూనే ఉంది. నారా రోహిత్ తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 20 2025, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ
Image Credit : X/NBKCult

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ తొలి చిత్రం అనౌన్స్ మెంట్స్ ఇంత వరకు జరగలేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ చిత్రం అటకెక్కినట్లు ఆ తర్వాత ప్రచారం జరిగింది. మళ్ళీ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. 

DID YOU
KNOW
?
ఆగిపోయిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మూవీ
నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం రద్దయినట్లు తెలుస్తోంది.
25
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ వైరల్
Image Credit : X/NBK Cult

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ వైరల్

ఇటీవల మోక్షజ్ఞ స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా కనిపించిన లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఫ్యామిలీ వెడ్డింగ్ లో మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ తో అదరగొట్టాడు. దీనితో మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది. నందమూరి వంశం అంటే పౌరాణిక, జానపద చిత్రాలకు పెట్టింది పేరు. స్వర్గీయ ఎన్టీఆర్, ఆ తర్వాత బాలయ్య అనేక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి చిత్రాలలో మాస్ లో చెరగని ముద్ర వేశారు. 

Related Articles

Related image1
భార్య భర్తలపై దాడి, వ్యూహం నిర్మాత అరెస్ట్.. అసలేం జరిగింది, ఆయన ఎలాంటి సినిమాలు తీశారో తెలుసా ?
Related image2
వార్ 2 ఫ్లాప్ తర్వాత నాగవంశీ ఫస్ట్ రియాక్షన్, ట్రోలర్స్ పై సెటైర్లు.. వైఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం నిజమేనా
35
మోక్షజ్ఞపై ఫ్యాన్స్ లో అంచనాలు
Image Credit : x/nandamuri fans

మోక్షజ్ఞపై ఫ్యాన్స్ లో అంచనాలు

మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే పౌరాణికం, జానపదం, లేదా మాస్ జోనర్లకు సంబంధించిన చిత్రం చేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆదిత్య 369 మూవీ సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా హీరో నారా రోహిత్ సుందరకాండ మూవీ ప్రమోషన్స్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు. 

45
మంచి లవ్ స్టోరీ కోసం మోక్షజ్ఞ వెయిటింగ్
Image Credit : Asianet News

మంచి లవ్ స్టోరీ కోసం మోక్షజ్ఞ వెయిటింగ్

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సినీ ఎంట్రీ కోసమే అని నారా రోహిత్ కంఫర్మ్ చేశారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎందుకు ఆలస్యం అవుతోంది అనే ప్రశ్నకు నారా రోహిత్ బదులిచ్చారు. మోక్షజ్ఞని రీసెంట్ గా నేను మీట్ అయ్యాను. అతడి బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. మోక్షజ్ఞ నాకు చెప్పిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం తాను కథలు వింటున్నానని, మంచి లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. 

55
నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
Image Credit : Youtube/ SriBalajiMovies

నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్

మోక్షజ్ఞకి లవ్ స్టోరీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలని కోరిక ఉంది. అందుకే వరుసగా ప్రేమ కథలు వింటున్నాడు. నచ్చిన కథ దొరికినప్పుడు సినిమా ప్రారంభం అవుతుంది అని నారా రోహిత్ తెలిపారు. నారా రోహిత్ లీక్ చేసిన మ్యాటర్ నందమూరి ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది. మోక్షజ్ఞ మాస్ లేదా ఫాంటసీ కథతో ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే లవ్ స్టోరీ కోసం ప్రయత్నిస్తున్నాడా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే
Recommended image2
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Recommended image3
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Related Stories
Recommended image1
భార్య భర్తలపై దాడి, వ్యూహం నిర్మాత అరెస్ట్.. అసలేం జరిగింది, ఆయన ఎలాంటి సినిమాలు తీశారో తెలుసా ?
Recommended image2
వార్ 2 ఫ్లాప్ తర్వాత నాగవంశీ ఫస్ట్ రియాక్షన్, ట్రోలర్స్ పై సెటైర్లు.. వైఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం నిజమేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved