MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భార్య భర్తలపై దాడి, వ్యూహం నిర్మాత అరెస్ట్.. అసలేం జరిగింది, ఆయన ఎలాంటి సినిమాలు తీశారో తెలుసా ?

భార్య భర్తలపై దాడి, వ్యూహం నిర్మాత అరెస్ట్.. అసలేం జరిగింది, ఆయన ఎలాంటి సినిమాలు తీశారో తెలుసా ?

నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. దాసరి కిరణ్ ఎవరు ? ఆయన ఎలాంటి చిత్రాలు నిర్మించారు ? ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 20 2025, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ్యూహం నిర్మాత అరెస్ట్ 
Image Credit : Instagram/Dasari Kiran

వ్యూహం నిర్మాత అరెస్ట్ 

 ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. గత ఏడాది ఎన్నికలకి ముందు దాసరి కిరణ్ వ్యూహం చిత్రాన్ని నిర్మించి రిలీజ్ చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో పాత్రలు వైఎస్ జగన్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లని పోలినట్లుగా ఉంటాయి. జగన్ ని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. 

25
ఆర్థిక వ్యవహారంలో కేసు
Image Credit : Instagram/Dasari Kiran

ఆర్థిక వ్యవహారంలో కేసు

ఆ విధంగా దాసరి కిరణ్ కూడా వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా బుధవారం రోజు ఏపీ పోలీసులు దాసరి కిరణ్ ఒక ఒక ఆర్థిక వివాదం కేసులో అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది అనేది వివరాల్లో తెలుసుకుందాం. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ అనే వ్యక్తి ఉంటున్నారు. ఆయన హైదరాబాద్ లో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. 

Related Articles

Related image1
విజయశాంతి మూవీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన బాలయ్య చిత్రం.. అసలేం జరిగిందంటే
Related image2
వార్ 2 ఫ్లాప్ తర్వాత నాగవంశీ ఫస్ట్ రియాక్షన్, ట్రోలర్స్ పై సెటైర్లు.. వైఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం నిజమేనా
35
భార్య భర్తలపై దాడి
Image Credit : Instagram/Dasari Kiran

భార్య భర్తలపై దాడి

రెండేళ్ల క్రితం దాసరి కిరణ్.. గాజుల మహేష్ వద్ద 4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పు గడువు ముగిసింది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని మహేష్ ఎన్నిసార్లు అడిగినా దాసరి కిరణ్ స్పందించలేదు. దీనితో గాజుల మహేష్ కొన్నిరోజుల క్రితమే ఆగష్టు 18న తన భార్యతో కలిసి విజయవాడలోని దాసరి కిరణ్ కార్యాలయానికి వెళ్లారు. తమ డబ్బు తిరిగి చెల్లించాలని నిలదీశారు. కానీ దాసరి కిరణ్ అనుచరులు తిరిగి మహేష్, అతడి భార్యపై దాడి చేసినట్లు తెలుస్తోంది. 

45
దాసరి కిరణ్ ని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Image Credit : Instagram/Dasari Kiran

దాసరి కిరణ్ ని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

దీనితో మహేష్ దంపతులు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో దాసరి కిరణ్ పై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. దీనితో పోలీసులు బుధవారం రోజు దాసరి కిరణ్ ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీనితో దాసరి కిరణ్ గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యూహం మూవీ రిలీజ్ సమయంలో నెలకొన్న వివాదం గురించి దాసరి కిరణ్ స్పందిస్తూ.. 100 మంది లోకేష్ లు వచ్చినా ఈ చిత్రాన్ని అడ్డుకోలేరు అనే స్టేట్మెంట్ ఇచ్చారు.

55
దాసరి కిరణ్ నిర్మించిన చిత్రాలు
Image Credit : Instagram/Dasari Kiran

దాసరి కిరణ్ నిర్మించిన చిత్రాలు

రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కొన్ని చిత్రాలు నిర్మించారు. గతంలోనే వంగవీటి అనే పొలిటికల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత మొగలిరేకులు సాగర్ హీరోగా సిద్ధార్థ్ అనే చిత్రాన్ని దాసరి కిరణ్ నిర్మించారు. గత ఏడాది తెరకెక్కించిన వ్యూహం చిత్రం బాగా వార్తల్లో నిలిచింది. దాసరి కిరణ్ వైఎస్ జగన్ అనుచరుడు అంటూ ప్రచారం ఉంది. వైసీపీ హయాంలో దాసరి కిరణ్ టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా పనిచేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Related Stories
Recommended image1
విజయశాంతి మూవీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన బాలయ్య చిత్రం.. అసలేం జరిగిందంటే
Recommended image2
వార్ 2 ఫ్లాప్ తర్వాత నాగవంశీ ఫస్ట్ రియాక్షన్, ట్రోలర్స్ పై సెటైర్లు.. వైఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం నిజమేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved