MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కంటే ముందంజలో.. తాండవమాడేస్తున్న బాలయ్య, అఖండ 2 కనుక హిట్టయితే ?

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కంటే ముందంజలో.. తాండవమాడేస్తున్న బాలయ్య, అఖండ 2 కనుక హిట్టయితే ?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య ఇతర సీనియర్ల కంటే ముందంజలో ఉన్నారు. అది ఎలాగో ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 03 2025, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నందమూరి బాలకృష్ణ అఖండ 2
Image Credit : Youtube/14reels plus, X/UV Creations

నందమూరి బాలకృష్ణ అఖండ 2

నందమూరి బాలకృష్ణ లేటు వయసులో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. అఖండ 2 చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంతో బాలయ్య పాన్ ఇండియా మార్కెట్ పై కూడా కన్నేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్లంతా వెనుకబడి ఉన్నారు. బాలయ్య మాత్రం హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. 

25
అఖండ 2 హిట్టయితే..
Image Credit : youtube/@shreyasgroup

అఖండ 2 హిట్టయితే..

బాలకృష్ణ నటించిన చివరి నాలుగు చిత్రాలు విజయాలే. ఇంత కన్సిస్టెంట్ గా బాలయ్య కెరీర్ ఎప్పుడూ లేదు. అఖండ 2 కనుక విజయం సాధిస్తే బాలయ్య మార్కెట్ నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోవడం ఖాయం. యువ హీరోల ప్రభావం పెరిగినప్పుడు సీనియర్ల జోరు తగ్గడం సహజమే. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ల జోరు కాస్త తగ్గింది. వేళ్ళు అప్పుడప్పుడూ హిట్లు కొడుతున్నారు కానీ కన్సిస్టెన్సీ మైంటైన్ చేయడం లేదు. 

Related Articles

Related image1
రాజమౌళి అవసరం లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్..సమంత కెరీర్ టాప్ 8 మూవీస్ ఇవే
Related image2
సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ అంత మాట అనేశారు ఏంటి ? కృష్ణ, చిరంజీవికి సాధ్యమైంది వాళ్ళ వల్ల కాదు
35
ఆ ముగ్గురి కంటే ముందంజలో బాలయ్య
Image Credit : 14 Reels Plus/ Youtube

ఆ ముగ్గురి కంటే ముందంజలో బాలయ్య

కానీ వీరి ముగ్గురు కంటే బాలయ్య ముందంజలో ఉన్నారు. గతంలో బాలయ్య రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కంటే బాలయ్య ఎలా వరుస హిట్లు అందుకుంటున్నారు అనే చర్చ మొదలైంది. 

45
నో రీమేక్స్
Image Credit : Instagram/@chiranjeevikonidela

నో రీమేక్స్

బాలయ్య ఇప్పుడు కూడా చేస్తున్నది మాస్ సినిమాలే. ఈ చిత్రాల్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటున్నాయి. కానీ వాటిని పక్కాగా ఉండేలా, అభిమానులకు నచ్చేలా బాలయ్య చూసుకుంటున్నారు. బాలయ్యకు ప్రధాన బలం ఏంటంటే.. రీమేక్ ల జోలికి వెళ్లడం లేదు. చిరంజీవి చివరి నాలుగు చిత్రాల్లో 2 రీమేక్ లు ఉన్నాయి. గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండు చిత్రాలు రీమేక్ లే. అవి పూర్తిగా నిరాశ పరిచాయి. 

55
తడబడుతున్న సీనియర్లు
Image Credit : X/@iamnagarjuna

తడబడుతున్న సీనియర్లు

వెంకటేష్ చివరగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. అంతకు ముందు తన ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాని సైంధవ్‌ మూవీతో భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నారు. నాగార్జున అయితే హీరోగా కనిపించి చాలా కాలం అవుతోంది. ఇటీవల నాగార్జునకి సరైన హిట్ లేదు. సీనియర్లు తడబడుతున్న సమయంలో బాలయ్య ఒక్కడే దూసుకుపోతున్నాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
నందమూరి బాలకృష్ణ
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
రాజమౌళి అవసరం లేకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్..సమంత కెరీర్ టాప్ 8 మూవీస్ ఇవే
Recommended image2
సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ అంత మాట అనేశారు ఏంటి ? కృష్ణ, చిరంజీవికి సాధ్యమైంది వాళ్ళ వల్ల కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved