MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 10 నిమిషాల పాత్రకోసం 20 కోట్లు వసూల్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

10 నిమిషాల పాత్రకోసం 20 కోట్లు వసూల్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో, కోట్ల మంది అభిమానులున్న మాస్ హీరో, వరుసగా  సినిమాలు చేస్తున్న ఈ హీరో రీసెంట్ గా ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 22 2025, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Balakrishna

తెలుగు పరిశ్రమలో మాస్ హీరో, కనుసైగతో ఫ్యాన్స్ ను కదిలించగల పవర్ ఫుల్ హీరో, సోలోగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ, హిట్ మీద హిట్ కొడుతున్న ఈ సీనియర్ హీరో ఓ భారీ ప్రాజెక్ట్ లో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. అయితే ఈ రోల్ కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడట. నిమిషానికి దాదాపు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు నట సింహం నందమూరి బాలయ్య బాబు.

25
Image Credit : instagram

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ జైలర్ 2 చిత్రంలో నటించనున్నారు. ఇది గతంలో విడుదలై ఘన విజయం సాధించిన జైలర్ సినిమాకు సీక్వెల్.

Related Articles

Related image1
మహేష్ బాబు తో ఐటమ్ సాంగ్ చేసి, తర్వాత తల్లిగా కూడా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా, ఎన్ని కోట్లు తీసుకుందంటే?
35
Image Credit : our own

జైలర్ 2 సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక హైయాక్షన్ మూవీగా రూపొందుతోంది. ఇందులో కొంత మంది స్టార్ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు. రజినీకాంత్ తో శివన్న కలిసి చేసే సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి.

45
Image Credit : our own

ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, మరో హై లెవెల్ అప్‌డేట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ప్రకారం, టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జైలర్ 2లో ఆయనకు కేవలం 10 నిమిషాల నిడివి ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి గాను బాలకృష్ణకు రూ.22 కోట్లు పారితోషికంగా చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ భారీ రెమ్యునరేషన్‌తో కేవలం అతిథి పాత్ర చేసినందుకే తీసుకుంటున్నారని తెలుస్తోంది.

55
Image Credit : our own

ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. చాలా ఏళ్ల తర్వాత రజినీకాంత్, బాలకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రాబట్టే విధంగా ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గతంలో వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ వంటి వరుస విజయాలు అందుకున్న బాలయ్య, జైలర్ 2లో నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Related Stories
Recommended image1
మహేష్ బాబు తో ఐటమ్ సాంగ్ చేసి, తర్వాత తల్లిగా కూడా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా, ఎన్ని కోట్లు తీసుకుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved