MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టబు, రమ్యకృష్ణ.. నాగార్జునకి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు? సౌందర్య విషయంలో ఇరకాటంలో పడ్డ జగపతిబాబు

టబు, రమ్యకృష్ణ.. నాగార్జునకి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు? సౌందర్య విషయంలో ఇరకాటంలో పడ్డ జగపతిబాబు

జగపతిబాబు హోస్ట్ గా మారి `జయమ్ము నిశ్చయమ్ము రా` టాక్‌ షో చేస్తున్నారు. ఇందులో నాగార్జున గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ప్రోమో విడుదలై రచ్చ చేస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 11 2025, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జగపతిబాబు, నాగార్జున మధ్య హీరోయిన్ల గోల
Image Credit : Youtube print Shot/Zee Telugu

జగపతిబాబు, నాగార్జున మధ్య హీరోయిన్ల గోల

కింగ్‌ నాగార్జునకి సంబంధించి హీరోయిన్ల విషయంలో పలు రూమర్లు ఉన్నాయి. టబు విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు పెళ్లి వరకు వెళ్లారనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో జగపతిబాబు విషయంలోనూ ఇలాంటివే ఉన్నాయి. సౌందర్య విషయంలో ఆయన కూడా ఇలాంటి రూమర్స్ ని ఫేస్‌ చేశారు. అయితే ఈ ఇద్దరు ఆయా రిలేషన్లపై ఓపెన్‌ గానే స్పందించారు. మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మరోసారి నాగార్జునని ఇబ్బంది పెట్టాడు జగపతిబాబు. మన్మథుడు సైతం తక్కువేం కాదు, జగపతిబాబుని సౌందర్య విషయంలో ఇరకాటంలో పెట్టాడు. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే..

DID YOU
KNOW
?
జగపతిబాబు ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా
జగపతిబాబు ఇప్పటి వరకు ఎప్పుడూ హోస్ట్ గా చేయలేదు. ఇప్పుడు మొదటిసారి వ్యాఖ్యాతగా మారారు. `జయమ్ము నిశ్చయమ్మురా` షోకి హోస్ట్ గా చేస్తున్నారు.
26
`జయమ్ము నిశ్చయమ్ము రా` షో చేస్తున్న జగపతిబాబు
Image Credit : Youtube Print Shot/Zee Telugu

`జయమ్ము నిశ్చయమ్ము రా` షో చేస్తున్న జగపతిబాబు

జగపతిబాబు మ్యాన్లీ హీరోగా రాణించారు. ఫ్యామిలీ కథలతో ఎక్కువగా సినిమాలు చేసి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హీరోగా క్రేజ్‌ తగ్గిన నేపథ్యంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాడు. విలన్‌గా మారి రచ్చ చేశారు. ఇప్పుడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సెకండ్‌ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు, ఇటు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. పాజిటివ్‌, నెగటివ్‌ రోల్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త మలుపు  తీసుకున్నారు. హోస్ట్ గా మారారు. జీ తెలుగు కోసం ఓ ప్రత్యేకమైన షో చేస్తున్నారు. `జయమ్ము నిశ్చయమ్ము రా` పేరుతో కొత్త టాక్‌షోని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Related Articles

Related image1
రవితేజ `మాస్‌ జాతర` టీజర్‌ రివ్యూ.. టీజర్‌ బాలేదంటూ నెటిజన్‌ కామెంట్‌.. రాజేంద్రప్రసాద్‌ ఏం చేశాడంటే?
Related image2
చిరంజీవి `ముగ్గురు మొనగాళ్లు`ని చావు దెబ్బ కొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. నాగబాబు జీర్ణించుకోలేని సందర్భం
36
షూటింగ్‌కి కాకుండా గోవాలో డేట్‌కి
Image Credit : Youtube Print Shot/Zee Telugu

షూటింగ్‌కి కాకుండా గోవాలో డేట్‌కి

ఇందులో `జయమ్ము నిశ్చయమ్ము రా` అవ్వాలంటే ఒక స్నేహితుడు కావాలి. నా స్నేహితుడు అక్కినేని నాగార్జున అంటూ జగపతిబాబు ఈ షోని స్టార్ట్ చేశారు. సిగ్గు లేకుండా మాట్లాడుకునే షో ఇది అని జగపతిబాబు తనదైన స్టయిల్‌లో ఓపెన్‌గా చెప్పగా, ఓకే అలానే కానివ్వు అని నాగ్‌ రియాక్ట్ కావడం విశేషం. `షూటింగ్‌కి వెళ్లి ఉండడు, గోవాలో వేరే డేట్‌కి వెళ్లి ఉంటాడని చెప్పావంటా` అని జగపతిబాబు అడగ్గా, `గుర్తు పెట్టుకో నువ్వే దొరుకుతావ్‌` అని నాగ్‌ చెప్పడం విశేషం. 

46
టబు విషయంలో నాగ్‌, సౌందర్య విషయంలో జగపతిబాబు ఇరకాటం
Image Credit : Youtube Print Shot/Zee Telugu

టబు విషయంలో నాగ్‌, సౌందర్య విషయంలో జగపతిబాబు ఇరకాటం

ఇంతలోనే నాగ్‌ బ్రదర్‌ వెంకట్‌, సిస్టర్‌ నాగసుశీల కూడా ఈ షోకి వచ్చారు. `నాగ్‌లో మొదటిసారి మన్మథుడు ఎప్పుడు కనిపించారు` అని జగపతిబాబు అడగ్గా, `నీకంటే తర్వాతే మన్మథుడు` అని వెంకట్‌ చెప్పడంతో `అది వేరే` అని తప్పించుకున్నారు జగపతిబాబు. ఇంతలో కత్తిలాంటి బాణం విసిరారు జగపతిబాబు. `రమ్యకృష్ణ, టబులో బెస్ట్ హీరోయిన్‌ ఎవరు` అని నాగార్జునని అడగ్గా, `కొన్ని చెప్పకూడదు, చెప్పను` అని సమాధానం దాటవేశారు నాగ్‌. అంతేకాదు రివర్స్ లో జగపతిబాబుకి ప్రశ్న వేశారు. `మీకు రమ్యకృష్ణ, సౌందర్యలో ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరు అని ఆయన్ని ఇరకాటంలో పెట్టగా, ఇది నా ఇంటర్వ్యూ కాదు, దీనికి నేను సమాధానం చెప్పను అని తప్పించుకున్నారు జగ్గుభాయ్‌.

56
`కూలీ` డైలాగ్‌తో రచ్చ చేసిన నాగార్జున
Image Credit : Youtube Print Shot/Zee Telugu

`కూలీ` డైలాగ్‌తో రచ్చ చేసిన నాగార్జున

అనంతరం `నేనేదో చిన్నా చితకా క్యారెక్టర్స్ చేసుకుంటూ బతికేస్తుంటే, నువ్వు మధ్యలో విలన్‌గా చేయడమేంటి? అదేంటో చెప్పు అసలు` అని జగపతిబాబు అడగ్గా, `ఒకడు పుట్టగానే ఎవడి చేతిలో పోతాడు అనేది వాడి తలమీద రాసిపెట్టి ఉంటుంది` అని `కూలీ` సినిమాలోని డైలాగ్‌ చెప్పి వాహ్‌ అనిపించారు నాగ్‌. ఇలా నాగ్‌ `జయమ్ము నిశ్చయమ్మురా` షో ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. చాలా ఆసక్తికరంగానూ అనిపించింది. ఈ టాక్‌ షో పూర్తి ఎపిసోడ్‌ ఆగస్ట్ 17(ఆదివారం) రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతుంది.

66
`కూలీ`లో విలన్‌గా నటించిన నాగార్జున
Image Credit : Youtube Print Shot/Zee Telugu

`కూలీ`లో విలన్‌గా నటించిన నాగార్జున

నాగార్జున ప్రస్తుతం `కూలీ` చిత్రంలో నటించారు. రజనీకాంత్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో నాగ్‌తోపాటు అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శృతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో నాగ్‌ నెగటివ్‌ రోల్‌ చేయడం విశేషం. తన కెరీర్‌లోనే మొదటిసారి ఆయన విలన్‌ పాత్రని పోషించారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందో మరో మూడు రోజుల్లో తేలనుంది. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image2
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Recommended image3
50 రూపాయల కూలీతో మొదలై.. 50 కోట్ల ఆస్తులు సంపాదించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
రవితేజ `మాస్‌ జాతర` టీజర్‌ రివ్యూ.. టీజర్‌ బాలేదంటూ నెటిజన్‌ కామెంట్‌.. రాజేంద్రప్రసాద్‌ ఏం చేశాడంటే?
Recommended image2
చిరంజీవి `ముగ్గురు మొనగాళ్లు`ని చావు దెబ్బ కొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. నాగబాబు జీర్ణించుకోలేని సందర్భం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved