MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 14 ఏళ్లు షూటింగ్ జరుపుకున్న ఏకైక సినిమా, రిలీజ్ చేస్తే రిజల్ట్ ఏమయ్యిందో తెలుసా?

14 ఏళ్లు షూటింగ్ జరుపుకున్న ఏకైక సినిమా, రిలీజ్ చేస్తే రిజల్ట్ ఏమయ్యిందో తెలుసా?

ఒక సినిమాను పూర్తి చేయడానికి మహా అయితే ఏడాది.. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలయితే రెండు మూడేళ్లు పడుతంది. ఇంతకంటే ఎక్కువ టైమ్ తీసుకున్న సినిమాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కాని ఓ సినిమా మాత్రం షూటింగ్ పూర్తి చేయడానికి ఏకంగా 14 ఏళ్లు పట్టిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి? రిలీజ్ అయ్యిందా లేదా..? రిలీజ్ అయితే ఫలితం ఏంటి? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2025, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సినిమా అనగానే దానికోసం కష్టపడిన ఎందరో కనిపిస్తారు.  నటీనటుల కృషి, దర్శకుల దృక్పథం, ఎన్నో సాంకేతిక విశేషాలు గుర్తుకొస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం తాలూకు స్థాయిని మించి, ఓ చిరస్మరణీయ గుర్తుగా నిలుస్తాయి. అలాంటి సినిమాల్లో బాలీవుడ్‌కు చెందిన మొఘల్-ఏ-ఆజం ఒకటి. ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దాదాపు 14 ఏళ్లు పట్టింది, కానీ అది విడుదలైన తర్వాత మాత్రం భారతీయ సినిమా చరిత్రను పూర్తిగా మార్చేసింది.
 

25
mughal e azam

mughal e azam

మొఘల్-ఏ-ఆజం సినిమా 1944లో మొదలై 1960లో పూర్తయింది. దర్శకుడు కె. అసీఫ్ తన దృష్టిలో ఉన్న కళాపరమైన నాణ్యతతో సినిమా తీర్చిదిద్దేందుకు సంవత్సరాల తరబడి కష్టపడ్డారు. మొదట ఈ సినిమాకు చాంద్‌నీ బేగం అనే టైటిల్ పెట్టినప్పటికీ, తరువాత మొఘల్-ఏ-ఆజంగా మార్చారు.
 

Related Articles

Related image1
సమంత నుంచి ఆలియా భట్ వరకూ టాప్ హీరోయిన్లకు 10Th class లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
Related image2
క్వీన్ ఎలిజబెత్ II తర్వాత రామ్ చరణ్ కి ఆ అవకాశం, మేడమ్ టుస్సాడ్స్ మెగా హీరోకు ప్రత్యేక గౌరవం
35
mughal e azam

mughal e azam

ఈ సినిమాలో హీరోగా దిలీప్ కుమార్ నటించగా  ఆయనను మొదట  ఒప్పించడానికి దర్శకుడు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెబుతారు. సినిమా బడ్జెట్ కూడా అప్పట్లోనే అత్యధికంగా రూ. 1.5 కోట్లు కాగా, ప్రముఖ గీతం "ప్యార్ కియా తో డర్నా క్యా" కోసం మాత్రమే రూ. 10 లక్షలు ఖర్చు చేశారు. ఈ పాట ఇప్పుడు కూడా బాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా గుర్తించబడుతుంది.
 

45
mughal e azam

mughal e azam

1960 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి అద్భుత స్పందనను పొందింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే రూ. 11 కోట్లు వసూలు చేయడమేకాక, అనేక దేశాల్లో విడుదలై ఇండియన్ సినిమాను ప్రపంచం ముందుకు తీసుకెళ్లిన సినిమాగా నిలిచింది.
 

55
mughal e azam

mughal e azam

మొఘల్-ఏ-ఆజం అత్యధికంగా కష్టపడి తీర్చిదిద్దిన సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బాహుబలి వంటి చిత్రాలు ఐదేళ్లకు పైగా పట్టినా, మొఘల్-ఏ-ఆజం మాత్రం తొలితరం క్లాసిక్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దృశ్యకావ్యం లాంటి ఈ సినిమా ఇప్పటికీ బాలీవుడ్ లోగిలిలో నిలిచిపోయింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Recommended image2
దళపతి విజయ్ కీలక నిర్ణయం, జన నాయగన్ టీమ్ బ్యాక్ స్టెప్, సెన్సార్ బోర్డ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Recommended image3
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Related Stories
Recommended image1
సమంత నుంచి ఆలియా భట్ వరకూ టాప్ హీరోయిన్లకు 10Th class లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
Recommended image2
క్వీన్ ఎలిజబెత్ II తర్వాత రామ్ చరణ్ కి ఆ అవకాశం, మేడమ్ టుస్సాడ్స్ మెగా హీరోకు ప్రత్యేక గౌరవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved