MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే

శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే

భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ప్రసంగం హైలైట్ గా నిలిచింది. మంచు మనోజ్ ఎప్పటిలాగే అగ్రెసివ్ గా, ఎమోషనల్ గా మాట్లాడారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 19 2025, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భైరవం మూవీ ట్రైలర్ లాంచ్
Image Credit : Asianet News

భైరవం మూవీ ట్రైలర్ లాంచ్

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధా మోహన్ నిర్మించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ప్రసంగం హైలైట్ గా నిలిచింది. మంచు మనోజ్ ఎప్పటిలాగే అగ్రెసివ్ గా, ఎమోషనల్ గా మాట్లాడారు.

25
మంచు మనోజ్ స్పీచ్
Image Credit : Asianet News

మంచు మనోజ్ స్పీచ్

ఇటీవల తన కుటుంబంలో జరిగిన వివాదాలు ప్రస్తావిస్తూ మంచు మనోజ్ జ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో మంచు విష్ణు పై చేసిన సెటైరికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చినియాంశంగా మారాయి. ఇంతకీ మంచు మనోజ్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నేను ఇలా స్టేజి ఎక్కి సినిమా ఈవెంట్ లో మాట్లాడి తొమ్మిదేళ్లు అవుతుంది. ఈ గ్యాప్ లో చాలామంది అభిమానులు అన్నా ఒక్క సినిమా చేయి అంటూ రిక్వెస్ట్ చేశారు. మధ్యలో కరోనా పరిస్థితులు, ఇతర కారణాలవల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

Related Articles

Related image1
Anasuya: స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వాడుకోవాలని ట్రై చేశారు..అసలైన క్యారెక్టర్ బయట పడింది, దటీజ్ అనసూయ
Related image2
Miss World 2025: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన మిస్ వరల్డ్ అందగత్తెలు 
35
బెదిరించినా భయపడలేదు
Image Credit : Asianet News

బెదిరించినా భయపడలేదు

ప్రస్తుతం పెయిడ్ మీడియా ప్రమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ నేను ఒక్క రూపాయి ఇవ్వకపోయినప్పటికీ మీడియా నాకు కష్టమైన పరిస్థితుల్లో సపోర్ట్ చేసింది. అందుకు వారికి ధన్యవాదాలు. సోషల్ మీడియాలో అభిమానులంతా సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేసిన వారి ఖాతాలకు స్ట్రైక్ లు పడ్డాయి. కొందరికి బెదిరింపు ఈ మెయిల్స్ పంపించారు అంటూ పరోక్షంగా మంచు విష్ణు గురించి ప్రస్తావించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడిన అభిమానులు డోంట్ కేర్ అంటూ నా వైపు నిలబడ్డారు.. అది చాలు ఈ జన్మకు అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యారు.

45
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు విష్ణుపై సెటైర్
Image Credit : Asianet News

శివయ్యా అని పిలిస్తే రారు, మంచు విష్ణుపై సెటైర్

శివుడిని శివయ్యా అని పిలిస్తే రారు అంటూ కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు డైలాగ్ పై మనోజ్ సెటైర్లు వేశారు. శివుడిని మనసారా తలుచుకుంటేనే వస్తారు. దర్శకులు, నిర్మాతలు, అభిమానుల రూపంలోనే శివుడు వస్తాడు అని మనోజ్ తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్ నాకు తమ్ముడు లాంటివాడు. ఒక అన్నయ్యగా శ్రీనివాస్ కి జీవితాంతం తోడుంటా. నారా రోహిత్ గురించి ఏం చెప్పాలి.. అతడు నా ప్రాణ మిత్రుడు. నేను చివరగా నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది అతడే. ఇప్పుడు అతనితో నటించిన చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నా అని మనోజ్ గుర్తు చేసుకున్నారు.

55
ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
Image Credit : google

ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే

ఈ మధ్యన ఎన్నో ఇబ్బందులకు గురయ్యా. కట్టుబట్టలతో నన్ను బయట నిలబెట్టారు. నా కార్లు కూడా లాగేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎవరి మీద కోపం రావట్లేదు. కానీ బాధగా ఉంది. ఏం జరిగినా ఎన్ని జన్మలైనా నేను మోహన్ బాబు కొడుకునే అది ఎవరూ మార్చలేరు అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
మంచు మనోజ్
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Recommended image2
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image3
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Related Stories
Recommended image1
Anasuya: స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వాడుకోవాలని ట్రై చేశారు..అసలైన క్యారెక్టర్ బయట పడింది, దటీజ్ అనసూయ
Recommended image2
Miss World 2025: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన మిస్ వరల్డ్ అందగత్తెలు 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved