- Home
- Entertainment
- బాలకృష్ణ మూవీలో ఆ పాత్రలో నటించమన్నందుకు ఏడ్చేసిన హీరోయిన్.. అలా అడిగేసరికి ఫీలయ్యా అంటూ..
బాలకృష్ణ మూవీలో ఆ పాత్రలో నటించమన్నందుకు ఏడ్చేసిన హీరోయిన్.. అలా అడిగేసరికి ఫీలయ్యా అంటూ..
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు.

చెన్నకేశవ రెడ్డి మూవీ
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం చెన్నకేశవరెడ్డి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య మాస్ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఏడ్చేసిన హీరోయిన్ లయ
ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ చెన్నకేశవరెడ్డి చిత్రంలో బాలకృష్ణ చెల్లెలు పాత్ర కోసం హీరోయిన్ లయని అడిగాం. బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించాలి అనే చెప్పేసరికి ఆమె ఏడ్చేసింది. ఎంత తెలుగు హీరోయిన్ అయితే మాత్రం చెల్లెలి పాత్రకి అడుగుతారా అని ఫీల్ అయిందట. దీంతో తాము మరో నటిని ఆ పాత్రలో ఎంపిక చేసుకున్నట్లు వివి వినాయక్ తెలిపారు.
లయ రియాక్షన్ ఇదే
వివి వినాయక్ కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ స్పందించింది. వివి వినాయక్ చెప్పినట్లు నేను ఏడవలేదు కానీ ఫీలయిన మాట వాస్తవం. అప్పుడేం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదు. నాకు గుర్తున్నంతవరకు చెల్లెలి పాత్రకి అడిగినందుకు బాధపడ్డాను. ఎందుకంటే ఆ టైంలో ఒక హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటిస్తే కెరీర్ ముగిసిపోతుంది. హీరోయిన్ గా ఎవరూ తీసుకోరు. అందువల్లే తాను బాధపడినట్లు లయ పేర్కొంది.
తమ్ముడు మూవీలో నితిన్ కి అక్క పాత్రలో..
చాలా ఏళ్ల తర్వాత లయ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న తమ్ముడు చిత్రంలో లయ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో ఆమె నితిన్ కి అక్క పాత్రలో నటిస్తుండడం విశేషం. అక్క ఇచ్చిన మాటని నిలబెట్టే తమ్ముడి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. చాలా ఏళ్ల క్రితం చెన్నకేశవరెడ్డి చిత్రంలో సోదరి పాత్రని రిజెక్ట్ చేసిన లయ ఇప్పుడు అదే తరహా పాత్రతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ చిత్రంలో తాను అక్క పాత్రలో నటిస్తున్నప్పటికీ చాలా వైవిధ్యంగా ఉంటుందని లయ పేర్కొంది.
తమ్ముడు ట్రైలర్ కి క్రేజీ రెస్పాన్స్
ఇటీవల విడుదలైన తమ్ముడు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా లయ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసింది. జూలై 4న తమ్ముడు చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అంజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
లయ రీఎంట్రి ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ఒకవైపు ఉంటే మరోవైపు హీరో నితిన్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే నితిన్ గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. నితిన్ నటించిన ఎక్స్ట్రా, రాబిన్ హుడ్ చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.