MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ ప్రేయసి గా, రామ్ చరణ్ అక్క గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ ప్రేయసి గా, రామ్ చరణ్ అక్క గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Pawan Kalyan:  ఫిల్మ్ ఇండస్ట్రీలో హిరోయిన్లు హీరోల జంటగా మాత్రమే కాదు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించారు. తండ్రీ కొడుకులు ఇద్దరికి జంటగా నటించిన హీరోయిన్లు  ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్  కు ప్రేయసిగా, చరణ్ కు అక్కగా నటించిన హీరోయిన్ మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 11 2025, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ ప్రేయసిగా, రామ్ చరణ్ అక్కగా
Image Credit : Asianet News

పవన్ ప్రేయసిగా, రామ్ చరణ్ అక్కగా

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జోడీలుగా మాత్రమే కాదు రకరకాల పాత్రల్లో నటించి మెప్పించిన వారు ఉన్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు, అన్నా తమ్ముడిగా ఉన్న హీరోలతో ఆడి పాడిన హీరోయిన్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి మెగా హీరోల సరసన నటించి హీరోయిన్లు ఉన్నారు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ కు ప్రేయసిగా నటించిన ఓ హీరోయిన్, రామ్ చరణ్ కు అక్కగా నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరా బ్యూటీ.

25
కృతి కర్బందా టాలీవుడ్ ఎంట్రీ
Image Credit : our own

కృతి కర్బందా టాలీవుడ్ ఎంట్రీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వచ్చి పోతూ ఉంటారు. కానీ కొందరే మాత్రమే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి కృతి కర్బందా (Kriti Kharbanda) ఒకరు. ఈ అందాల తార తెలుగులో కొద్ది సినిమాలు చేసినా, రెండు మెగా హీరోలతో చేసిన పాత్రల వల్ల ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.కృతి కర్బందా 2009లో "బోణి" అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత "అలా మొదలైంది" సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. కానీ ఆమెకు అసలు గుర్తింపు వచ్చిందే పవన్ కల్యాణ్ సినిమా వల్ల.

Related Articles

Related image1
స్విమ్ సూట్ వేసుకోమని బలవంతం చేశారు, బాలయ్య హీరోయిన్ సంచలన కామెంట్స్
Related image2
అల్లు అర్జున్ జాతకం, శని ఆరో గదిలో ఉండటం వల్ల నష్టం జరిగిందా ? రాబోయే 10 ఏళ్లు బన్నీ కెరీర్ ఎలా ఉండబోతోంది?
35
తీన్ మార్ లో కృతి
Image Credit : Asianet News

తీన్ మార్ లో కృతి

2011లో విడుదలైన "తీన్ మార్" (Teen Maar) సినిమాలో కృతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రేయసిగా నటించింది. ఇందులో ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అదే సమయంలో, కృతి నటనపై పరిశ్రమలో మంచి ఆదరణ ఏర్పడింది.

45
రామ్ చరణ్ కు అక్కగా
Image Credit : Asianet News

రామ్ చరణ్ కు అక్కగా

ఆ తర్వాత 2015లో విడుదలైన "బ్రూస్ లీ: ది ఫైటర్" (Bruce Lee: The Fighter) సినిమాలో రామ్ చరణ్‌కు అక్కగా నటించింది కృతి. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా, కథను మలుపుతిప్పే పాత్రలో ఆమె కనిపించింది. ఇలా ఒకే నటి మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలతో వివిధ పాత్రల్లో కనిపించడం విశేషం.

55
కృతి నటించిన తెలుగు సినిమాలు
Image Credit : Kriti Kharbanda instagram

కృతి నటించిన తెలుగు సినిమాలు

ఇంకా కృతి కర్బందా హీరో రామ్ కు జంటగా ఒంగోలు గిత్త సినిమాలో మెరిసింది, అంతే కాదు కళ్యాణ్ రామ్ జోడీగా ఒం 3Dలో కూడా నటించింది ఇక ఇక ఇవి కాకుండా గాళ్ల్ ఫ్రెండ్" వంటి సినిమాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉంటోంది. కృతి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. పులకిత్ సామ్రాట్ (Pulkit Samrat) అనే బాలీవుడ్ నటుడితో గతంలో ప్రేమలో ఉన్న కృతి, 2024లో అతనితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ జంట కొన్నేళ్లు డేటింగ్‌ చేసి. ఆతరువాత పెళ్లి చేసుకున్నారు. తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ ప్రేయసిగా, రామ్ చరణ్ అక్కగా నటించిన పాత్రలతో కృతి కర్బందా టాలీవుడ్ ఆడియన్స్ కు గుర్తుండిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ సినిమాలలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Recommended image2
దళపతి విజయ్ కీలక నిర్ణయం, జన నాయగన్ టీమ్ బ్యాక్ స్టెప్, సెన్సార్ బోర్డ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Recommended image3
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Related Stories
Recommended image1
స్విమ్ సూట్ వేసుకోమని బలవంతం చేశారు, బాలయ్య హీరోయిన్ సంచలన కామెంట్స్
Recommended image2
అల్లు అర్జున్ జాతకం, శని ఆరో గదిలో ఉండటం వల్ల నష్టం జరిగిందా ? రాబోయే 10 ఏళ్లు బన్నీ కెరీర్ ఎలా ఉండబోతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved