MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందరూ ఫ్లాప్ అనుకున్నారు, వరుసగా 3 షోలు చూసిన నాగార్జున చెల్లెలు.. కట్ చేస్తే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్

అందరూ ఫ్లాప్ అనుకున్నారు, వరుసగా 3 షోలు చూసిన నాగార్జున చెల్లెలు.. కట్ చేస్తే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఒక చిత్రాన్ని ముందుగా అందరూ ఫ్లాప్ అని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మూవీ ఏంటి, ఎంత పెద్ద విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2025, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జున నటిస్తున్న చిత్రాలు
Image Credit : Asianet News

నాగార్జున నటిస్తున్న చిత్రాలు

అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో మాస్ అండ్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ నాగార్జున యంగ్ గానే కనిపిస్తూ కుర్రాళ్ళకి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో రూపొందుతున్న కుబేర చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా రజినీకాంత్ కూలీ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25
నిన్నే పెళ్లాడతా ఫ్లాప్ మూవీ అనుకున్నారా ?
Image Credit : google

నిన్నే పెళ్లాడతా ఫ్లాప్ మూవీ అనుకున్నారా ?

కృష్ణవంశీ నాగార్జునకి నిన్నే పెళ్ళాడతా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం ఇచ్చారు. 1996లో నాగార్జున, టబు జంటగా నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఘనవిజయం సాధించింది. అప్పటికి ఈ చిత్రం నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ టైం లో తన అనుభవాల్ని కృష్ణవంశీ పంచుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ ఫ్లాప్ అవుతుంది అనుకున్నారని.. ఏఎన్నార్ మాత్రమే సూపర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలిసింది.. ఇది నిజమేనా అని యాంకర్ కృష్ణవంశీని ప్రశ్నించారు.

Related Articles

Related image1
మళ్ళీ వణుకు పుట్టిస్తున్న కరోనా.. రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ కి కోవిడ్ పాజిటివ్
Related image2
రూ.33,000 కోట్ల ఆస్తి ఉన్న సౌత్ రిచెస్ట్ ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా చిత్రం
35
అందుకే టెన్షన్
Image Credit : Twitter

అందుకే టెన్షన్

కృష్ణవంశీ సమాధానం ఇస్తూ.. అలా ఏం లేదు.. అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ మూవీ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను, నా టీం మాత్రమే రిలీజ్ కి ముందు కాస్త టెన్షన్ పడ్డాం. నా ప్రతి చిత్రానికి రిలీజ్ కి ముందు టెన్షన్ పడతాను. ఎందుకంటే ఫైనల్ కాపీ రెడీ అయ్యాక ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇక మార్చడం కుదరదు. అందుకే టెన్షన్ ఉంటుంది.

45
వరుసగా 3 షోలు చూసిన నాగ సుశీల
Image Credit : our own

వరుసగా 3 షోలు చూసిన నాగ సుశీల

నిన్నే పెళ్ళాడుతా మూవీ సూపర్ హిట్ అవుతుందని నాగేశ్వరరావు తో పాటు.. నాగార్జున, అమల కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాగార్జున చెల్లెలు నాగ సుశీల అయితే రిలీజ్ కి ముందే ఈ చిత్రాన్ని స్పెషల్ గా చూశారు. ఆమె వరుసగా మూడు షోలు అదే చిత్రాన్ని చూడడం విశేషం. ఆమెకి అంత బాగా నిన్నే పెళ్ళాడతా చిత్రం నచ్చింది అని కృష్ణవంశీ తెలిపారు.

55
నాగార్జున, టబు కెమిస్ట్రీ
Image Credit : Asianet News

నాగార్జున, టబు కెమిస్ట్రీ

ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగార్జున, టబు మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. నిన్నే పెళ్ళాడతా తర్వాత మరోసారి నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్ లో చంద్రలేఖ అనే చిత్రం రూపొందింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Related Stories
Recommended image1
మళ్ళీ వణుకు పుట్టిస్తున్న కరోనా.. రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ కి కోవిడ్ పాజిటివ్
Recommended image2
రూ.33,000 కోట్ల ఆస్తి ఉన్న సౌత్ రిచెస్ట్ ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా చిత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved