MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వరుసగా నంది అవార్డులు ఆ నటుడికే, టాలీవుడ్ ని అవమానించేలా డైరెక్టర్ కామెంట్స్.. కోపంతో కోట చేశారో తెలుసా

వరుసగా నంది అవార్డులు ఆ నటుడికే, టాలీవుడ్ ని అవమానించేలా డైరెక్టర్ కామెంట్స్.. కోపంతో కోట చేశారో తెలుసా

టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు నటులకే అవకాశాలు ఇవ్వాలని చాలా కాలం పాటు కోటా శ్రీనివాసరావు బలంగా తన గళం వినిపించారు. ఈ క్రమంలో కోటా శ్రీనివాసరావు కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 13 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Kota Srinivasa Rao / Facebook

తన నటనతో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం రోజు తుది శ్వాస విడిచారు. కోట మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు కోట పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. కోట శ్రీనివాసరావు ప్రాణం ఖరీదు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బ్యాంకు ఉద్యోగిగా ఉన్న ఆయన నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చారు.

25
Image Credit : Kota Srinivasa / Facebook

నటుడిగా గుర్తింపు వచ్చాక బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశారు. 1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంతో కోట శ్రీనివాసరావు కెరీర్ మారిపోయింది. ఒక్కసారిగా ఆయన స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత అహ నా పెళ్ళంట చిత్రం ఆయనలోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి వ్యతిరేకంగా తెరకెక్కించిన మండలాదీశుడు చిత్రంలో కోటా శ్రీనివాసరావు నటించిన సంచలనం సృష్టించారు.

Related Articles

Related image1
కోట మరణం కలచివేసింది, స్టార్ నటుడికి టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Related image2
కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన ఇద్దరు దర్శకులు..అతడిని ముగ్గురు లెజెండ్స్ తో పోల్చుతూ కామెంట్స్
35
Image Credit : Kota Srinivasa Rao / Facebook

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా కోటా శ్రీనివాసరావు పాపులర్ అయ్యారు. టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు నటులకే అవకాశాలు ఇవ్వాలని చాలా కాలం పాటు కోటా శ్రీనివాసరావు బలంగా తన గళం వినిపించారు. ఈ క్రమంలో కోటా శ్రీనివాసరావు కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు.

ఒక సందర్భంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి వరుసగా మూడు నంది అవార్డులు వచ్చాయి. 2002 లో ఖడ్గం చిత్రానికి ప్రకాష్ రాజ్ ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. ఆ మరుసటి ఏడాది గంగోత్రి చిత్రానికి ఉత్తమ విలన్ గా, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రకాష్ రాజ్ నంది అవార్డులు అందుకున్నారు.

45
Image Credit : facebook

దీంతో ప్రకాష్ రాజ్ ని అభినందించే క్రమంలో డైరెక్టర్ కృష్ణ వంశీ తెలుగు నటులను అవమానించేలా కామెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ కి వరుసగా నంది అవార్డులు వస్తున్నాయి అంటే దాని అర్థం.. అలాంటి గొప్ప నటులు తెలుగులో లేరు అని అంటూ కృష్ణవంశీ కామెంట్ చేశారు. కృష్ణవంశీ వ్యాఖ్యలతో కోటా శ్రీనివాసరావు బాగా హర్ట్ అయ్యారు. కృష్ణవంశీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోట కౌంటర్ ఇచ్చారు.

55
Image Credit : Kota Srinivasa Rao / facebook

దీంతో వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కృష్ణవంశీ కోటా శ్రీనివాసరావు గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడం మరింత వివాదానికి దారి తీసింది. కోట మద్యం సేవించి షూటింగ్ కి వస్తారని, ఇబ్బంది పెడతారని కృష్ణవంశీ ఓ సందర్భంలో అన్నారు. ఆ విధంగా వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Recommended image2
Kadhalar Dhinam: భారతీయుడు సినిమాను మించిన బడ్జెట్, యువతకు పిచ్చెక్కించిన ఆ లవ్ స్టోరీ ఇదే!
Recommended image3
Silk Smitha: రజినీ, కమల్‌కే చుక్కలు చూపించింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఆమె టాప్ 5 సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
కోట మరణం కలచివేసింది, స్టార్ నటుడికి టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Recommended image2
కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన ఇద్దరు దర్శకులు..అతడిని ముగ్గురు లెజెండ్స్ తో పోల్చుతూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved