- Home
- Entertainment
- కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన ఇద్దరు దర్శకులు..అతడిని ముగ్గురు లెజెండ్స్ తో పోల్చుతూ కామెంట్స్
కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన ఇద్దరు దర్శకులు..అతడిని ముగ్గురు లెజెండ్స్ తో పోల్చుతూ కామెంట్స్
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఫిలిం నగర్ లోని తన నివాసంలో కోట మరణించారు. కోట శ్రీనివాసరావు తన విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చారు.

కోట శ్రీనివాసరావు మృతి
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఫిలిం నగర్ లోని తన నివాసంలో కోట మరణించారు. కోట శ్రీనివాసరావు తన విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చారు. ఇతర భాషల్లో కూడా ఆయన నటించారు. కోట శ్రీనివాసరావు తన కెరీర్ లో ఏకంగా 9 నంది అవార్డులు అందుకున్నారంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో అర్థం అవుతుంది.
కోట శ్రీనివాసరావు విలక్షణ నటన
కోట శ్రీనివాసరావు విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటన అందించారు. అహ నా పెళ్ళంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, లీడర్, బొమ్మరిల్లు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అతడు, గణేష్ ఇలా ఎన్నో చిత్రాలు కోట విలక్షణ నటనకి నిదర్శనంగా నిలిచాయి.
ప్రముఖ దర్శకుల గురించి కోట కామెంట్స్
కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో తాను కలిసి పనిచేసిన దర్శకుల గురించి మాట్లాడారు. రాఘవేంద్ర రావు, దాసరి, కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి ఇలాంటి దర్శకులతో చాలా చిత్రాలు చేశాను. బాపు గారి దర్శకత్వంలో కూడా 2 చిత్రాల్లో నటించాను. బాపు గారి దర్శకత్వంలో నటిస్తే విభిన్నమైన అనుభూతి కలుగుతుంది. ఇతర దర్శకులతో పనిచేసేటప్పుడు మన సొంత శైలి ఉంటుంది. కానీ బాపు చిత్రాల్లో మాత్రం ఆయన ఎలా చెబితే అలా నటించి వచ్చేయాలి అని కోట అన్నారు.
కోటకి ఇష్టమైన ఈ జనరేషన్ దర్శకులు
ఇక ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో దాదాపు 35 చిత్రాల్లో నటించాను. ఇక ఈ జనరేషన్ విషయానికి వస్తే నాకు గొప్ప దర్శకులుగా అనిపించేది రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్. రాజమౌళి ఈ జనరేషన్ లో నెంబర్ 1 దర్శకుడు అందులో సందేహం లేదు.
త్రివిక్రమ్ ని ఆ ముగ్గురితో పోల్చిన కోట
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కంటే గొప్ప రచయిత అని చెప్పాలి. జంధ్యాల, ఆత్రేయ, శ్రీశ్రీ ఈ ముగ్గురూ కలిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో కోట శ్రీనివాస రావు స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఛత్రపతి లాంటి చిత్రాల్లో నటించారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, అత్తారింటికి దారేది, జులాయి లాంటి చిత్రాల్లో కోట నటించారు.