MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ తో సినిమాను రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు

ప్రభాస్ తో సినిమాను రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అభిమానించని వారు ఉండరు. ఆయనతో సినిమా అంటే స్టార్ హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. కాని ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో సినిమాను రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2025, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : instagram / prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కల్కి 2898 ఎ.డి. సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్‌ ఇప్పుడు రాజాసాబ్‌, ఫౌజీ వంటి భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు స్పిరిట్‌ అనే ప్రాజెక్ట్‌ కూడా త్వరలో ప్రారంభంకానుండగా, మరిన్ని సినిమాల కోసం చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.

26
Image Credit : Social Media

ఇప్పటికే ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. బాహుబలి సిరీస్‌ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ ప్రతి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో 2019లో విడుదలైన సాహో మూవీపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకుల నిరీక్షణల మేరకు ప్రభావితం చేయలేకపోయింది.

Related Articles

Related image1
ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్, పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి, నిజమెంత?
Related image2
20 ఏళ్లైనా టిఆర్పి లో దుమ్మురేపుతున్న వెంకటేష్ సినిమా ఏదో తెలుసా?
36
Image Credit : Asianet News

ప్రభాస్ సినిమా అంటే హీరోయిన్లు ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఎవరు నో చెప్పరు. ప్రభాస్ ఫేయిల్యూర్స్ లో ఉన్నా కాని.. ఆయనతో సినిమాకు దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదీ ప్రభాస్ రేంజ్ . కానీ ప్రభాస్ సినిమాను కూడా రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఉందని మీకు తెలుసా? అది కూడా ఆయన పాన్ ఇండియా స్టార్ అయిన తరువాత ఆయన సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ గురించి మీకు తెలుసా?

46
Image Credit : instagram

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సమాచారం ప్రకారం, బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ కంటే ముందు స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను మేకర్స్ సంప్రదించారు. అయితే, ఆమె ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపకుండా తిరస్కరించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మేకర్స్‌ ఆమె కోసం దాదాపు 6 నెలలపాటు ఎదురు చూశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె స్థానంలో శ్రద్ధా కపూర్‌ను తీసుకుని సినిమా తెరకెక్కించారు.

56
Image Credit : our own

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 435 కోట్ల వసూళ్లు రాబట్టగా, భారత్‌లో మాత్రమే రూ.150 కోట్ల నికర కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమా బాలీవుడ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. కాని తెలుగు ఆడియన్స్ మాత్రం పెద్దగా ఆదరించలేకపోయారు. ఈ సినిమాకు శ్రద్ధా కపూర్ ప్లస్ అయ్యారు. ప్రభాస్‌తో ఆమె జోడీకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాహుబలి లాంటి హిట్ సినిమా తరువాత బాహుబలి 2 విడుదలకు ముందు సాహో ఆఫర్ వచ్చినప్పటికీ, కత్రినా ఎందుకు తిరస్కరించిందన్నది స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంలో నిజం ఎంతో కూడా తెలియాల్సి ఉంది.

66
Image Credit : netflix

ప్రస్తుతం ప్రభాస్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రాజాసాబ్‌’ లో నటిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈసినిమా తరువాత హనురాఘవపూడి డైరెక్షన్ లో యుద్ధ నేపథ్యంలో ‘ఫౌజీ’ మూవీని చేస్తున్నాడు ప్రభాస్. దీనితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2 , ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 సినిమాలు చేయాల్సి ఉంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Recommended image3
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related Stories
Recommended image1
ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్, పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి, నిజమెంత?
Recommended image2
20 ఏళ్లైనా టిఆర్పి లో దుమ్మురేపుతున్న వెంకటేష్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved