MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 16 కోట్ల ఖర్చు పెడితే, 400 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా?

16 కోట్ల ఖర్చు పెడితే, 400 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా?

ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఓ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ 400 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 28 2025, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Social Media

మూడేళ్ల క్రితం అంటే 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.16 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త రికార్డు సాధించింది.

26
Image Credit : Instagram

మనిషికి ప్రకృతికి మధ్య జరుగుతున్న సంఘర్షణను ఆధారంగా రాసుకున్న కథతో రూపొందించబడింది ఈ సినిమా. కన్నడనాట మాత్రమే కాదు అన్ని భాషల్లో అద్భుతం చేసింది కాంతార. కర్ణాటకలోని గిరిజన సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన ఈసినిమా అందరిని ఆకర్శించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతారకు మౌత్-ఆఫ్-మౌత్ ప్రచారం ద్వారా భారీ రెస్పాన్స్ లభించింది.

Related Articles

Related image1
కాంతార చాప్టర్ 1 రిలీజ్ డేట్ పై రూమర్స్, క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి
Related image2
వివాదంలో కాంతార 2 , రిషబ్ శెట్టి ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేదు..
36
Image Credit : Social Media

‘కాంతార’ సినిమాకి కథ, దర్శకత్వం తో పాటు హీరో పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. ఆయన అద్భుతమైన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్, మానసి సుధీర్, అచ్యుత్ కుమార్, స్వరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. ముఖ్యంగా భూత కోల అనే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది.

46
Image Credit : our own

కన్నడ భాషలో తెరకెక్కిన కాంతార హిందీ, తెలుగు, తమిళం, మలయాళం లో విడుదలైన దేశవ్యాప్తంగా 310 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 408 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

56
Image Credit : Twitter

ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ పాట సోషల్ మీడియాలో సంచలనం రేపింది. కేరళ సంప్రదాయ ట్యూన్ ను కాపీ కొట్టారంటూ వివాదం చెలరేగింది. ఆతరువాత వివాదం కోర్డు ద్వారా పరిష్కారం అయ్యింది. ఇక ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

66
Image Credit : instagram

ఈ విజయంతో ‘కాంతార’ సెకండ్ పార్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాంతార ప్రీక్వెల్ ను రిషబ్ శెట్టి ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ లో కాంతార ఛాప్టర్ 1 ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు రిషబ్. ఇందుకోసం ప్రత్యేకంగా యుద్ధ విద్యలను కూడా నేర్చుకున్నాడు కన్నడ హీరో. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కాబోతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
Recommended image2
అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు
Related Stories
Recommended image1
కాంతార చాప్టర్ 1 రిలీజ్ డేట్ పై రూమర్స్, క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి
Recommended image2
వివాదంలో కాంతార 2 , రిషబ్ శెట్టి ఇలా చేస్తాడని ఎవరు ఊహించలేదు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved