MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగులో నేరుగా నాకు 13 హిట్లు ఉన్నాయి అంటూ కమల్ కామెంట్స్.. వర్షం చిత్రాన్ని గుర్తు చేసుకున్న త్రిష

తెలుగులో నేరుగా నాకు 13 హిట్లు ఉన్నాయి అంటూ కమల్ కామెంట్స్.. వర్షం చిత్రాన్ని గుర్తు చేసుకున్న త్రిష

థగ్ లైఫ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్, త్రిష చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

3 Min read
Author : Tirumala Dornala
Published : May 30 2025, 08:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Image Credit : Youtube/Sreshth Movies Official

థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

కొన్ని దశాబ్దాల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో మూవీ వస్తోంది. థగ్ లైఫ్ అనే చిత్రాన్ని మణిరత్నం కమల్ తో తెరకెక్కించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు, అభిరామి, నాజర్ కీలక పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ రిలీజ్ చేసింది. తాజాగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

26
తెలుగులో నాకు 13 హిట్లు ఇచ్చారు: కమల్ హాసన్
Image Credit : Youtube/Sreshth Movies Official

తెలుగులో నాకు 13 హిట్లు ఇచ్చారు: కమల్ హాసన్

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారాలు. వైజాగ్ ప్రజలు నన్ను ఎంతగానో దగ్గరకి తీసుకున్నారు. 21 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా మొహం కూడా ఎవరికి తెలీదు. షూటింగ్ చాలా సాఫీగా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్ ని 'మరో చరిత్ర' అనే చిత్రం ఇచ్చింది. తర్వాత ఏక్ తుజే కేలియే సినిమా చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులు మన కుర్రాడు హిందీకి వెళ్లి కొట్టాడురా అని అభినందించారు. అలాంటి వైజాగ్ లో  సాగర సంగమం, ఏక్ తుజే కేలియే, శుభసంకల్పం సినిమాలు చేశాను.  ఇది నాకు సొంత ఇల్లు లాంటిది. మంచి ఆర్ట్ ఎక్కడ కనిపించినా దానికి నేను సెల్యూట్ చేస్తాను. అలాగే నేర్చుకున్నాను. నేను కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ చేశాను. అయితే  నా బ్యాడ్ ఫిలిమ్స్ మరచిపోయి కేవలం మంచి సినిమాలనే గుర్తు పెట్టుకున్నారు. అందుకుగాను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 

మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత. నేను తెలుగులో నేరుగా 15 సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. అది విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. ఇది నిజం.  ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి   “థగ్ లైఫ్” సినిమా మీకు అందిస్తున్నాను. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించారు.  అభిరామి గారు అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్ గారితో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పెర్ఫార్మెన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్ లో కలుద్దాం' అని అన్నారు. 

Related Articles

Related image1
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
Related image2
Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..
36
పవన్ కళ్యాణ్ పై శింబు కామెంట్స్
Image Credit : Youtube/Sreshth Movies Official

పవన్ కళ్యాణ్ పై శింబు కామెంట్స్

హీరో శింబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు అభిమానులందరికీ ధన్యవాదాలు. జూన్ 5న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. జూన్ 5న మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఓజీలో ఒక పాట పాడాను. ఆ పాట త్వరలోనే రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఎప్పటినుంచో ఒక పాట పాడాలని ఉండేది. అది ఓజీ తో తీరింది. పవన్ కళ్యాణ్ గారి హరి హర వీరమల్లు సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్' అని అన్నారు. 

46
వర్షం మూవీని గుర్తు చేసుకున్న త్రిష
Image Credit : Youtube/Sreshth Movies Official

వర్షం మూవీని గుర్తు చేసుకున్న త్రిష

హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.  వర్షం సినిమా రిలీజ్ 22 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వైజాగ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కమల్ గా కమల్ హాసన్ గారితో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను.  తప్పకుండా ఆడియన్స్ కి గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. తప్పకుండా ఈ సినిమా మీరు చూడాలి. కచ్చితంగా మీకు నచ్చుతుంది' అన్నారు. 

56
తప్పకుండా చూడాల్సిన చిత్రం
Image Credit : Youtube/Sreshth Movies Official

తప్పకుండా చూడాల్సిన చిత్రం

నాజర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. థగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఫిల్మ్ అవుతుంది. వైజాగ్ లోనే కమలహాసన్ గారు చాలా రోజుల ముందు ఒక చరిత్ర రాశారు. అదే మరో చరిత్ర. ఇప్పుడు మరో చరిత్రగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా ఇండియాలో ద బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు, ద బెస్ట్ రెహమాన్ గారు , బెస్ట్ యాక్టర్ కమలహాసన్ గారు.. ఇలా ద బెస్ట్ టీం కలిసి చేస్తున్న సినిమా ఇది.  కమల్ హాసన్ గారు మణిరత్నం గారు 37 ఏళ్ల తర్వాత కలిసి ఒక యాగంలా ఈ సినిమా చేశారు. ఇది ఒక అద్భుతమైన జర్నీ.  ఈ సినిమా ఖచ్చితంగా మీరు చూడాలి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం' అని అన్నారు. 

66
'చెప్పవే చిరుగాలి' మూవీపై అభిరామి కామెంట్స్
Image Credit : Youtube/Sreshth Movies Official

'చెప్పవే చిరుగాలి' మూవీపై అభిరామి కామెంట్స్

అభిరామి మాట్లాడుతూ..  అందరికీ నమస్కారం చెప్పవే చిరుగాలి సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం. వైజాగ్ నాకు చాలా స్పెషల్. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చిన తెలుగు తెలుగు ప్రేక్షకులు దాన్ని ఘనవిజయం చేస్తారు. ఈ సినిమా నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, శింబు గారు ఇలాంటి లెజెండ్స్ తో వర్క్ చేయడం ఒక డ్రీమ్. జూన్ 5వ తేదీన అందరూ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు'. అని తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Recommended image2
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image3
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో అడ్డంగా దొరికిపోయిన విజయ్ దేవరకొండ.. ఫోటోలు లీక్‌.. ఎవరీ అమ్మాయి?
Related Stories
Recommended image1
చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?
Recommended image2
Bhairavam Twitter Review: ముగ్గురు హీరోలు కుమ్మేశారు, మంచు మనోజ్ కంబ్యాక్ ఇచ్చినట్లేనా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved