MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క, కీర్తిసురేష్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన యంగ్ హీరోయిన్‌.. టాప్‌ 5 సౌత్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌

అనుష్క, కీర్తిసురేష్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన యంగ్ హీరోయిన్‌.. టాప్‌ 5 సౌత్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌

యంగ్‌ హీరోయిన్‌ మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. ఇది అనుష్క, కీర్తిసురేష్‌ మూవీల రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. ఆ మూవీ ఏంటి? ఆ కథేంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 06 2025, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాప్‌ 5 లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ (సౌత్‌)
Image Credit : JFW

టాప్‌ 5 లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ (సౌత్‌)

గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు విజయశాంతి సినిమాలు బాగా ఆడేవి. హీరోలకు దీటుగా కలెక్షన్లని రాబట్టేవి. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో అనుష్క వచ్చింది. ఆమె నటించిన సినిమాలు కూడా బాగానే వసూళ్లని రాబడుతున్నాయి. అయితే సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ పరంగా అత్యధిక వసూళ్లని రాబట్టిన రికార్డు మాత్రం కీర్తిసురేష్‌, అనుష్క పేరుతోనే ఉంది. కీర్తిసురేష్‌ `మహానటి`తో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే `అరుంధతి`, `భాగమతి`, `రుద్రమదేవి` చిత్రాలతోనూ అనుష్క కూడా టాప్‌లో ఉన్నారు. సమంత కూడా ప్రయత్నించింది. కానీ కమర్షియల్‌ గా వర్కౌట్‌ కాలేదు. అయితే ఇప్పుడు కీర్తిసురేష్‌, అనుష్క సినిమాల రికార్డులను కూడా బ్రేక్‌ చేసింది యంగ్‌ హీరోయిన్‌ కళ్యాణి ప్రియదర్శన్‌. ఆమె నటించిన `కొత్తలోక`(లోకః ఛాప్టర్‌ 1) కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. నెంబర్‌ వన్‌గా నిలిచింది.

26
రూ.135కోట్లు వసూలు చేసిన `కొత్త లోక`
Image Credit : X

రూ.135కోట్లు వసూలు చేసిన `కొత్త లోక`

కళ్యాణి ప్రియదర్శన్‌ నటించిన లేటెస్ట్ మూవీ `కొత్త లోక`(లోక చాప్టర్‌1ఃచంద్ర) ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లు వసూలు చేసింది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం రూ.135కోట్లు రాబట్టింది. ఇంకా విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌తోపాటు నస్లెన్‌ కె గపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మహిళా సూపర్‌ హీరో మూవీగా ఇది తెరకెక్కింది. డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ విడుదల చేశారు. సినిమా బాక్సాఫీసు వద్ద ఇంకా వసూళ్ల జోరు చూపిస్తోంది. మున్ముందు ఇది రెండు వందల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. దీంతో సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్‌ కథతో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా `కొత్త లోక` నిలిచింది.

Related Articles

Related image1
Bigg Boss Telugu 9 Final List: అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కంటెస్టెంట్లు వీరే.. బిగ్‌ బాస్‌ బజ్‌ హోస్ట్ ఎవరంటే?
Related image2
ఎన్టీఆర్‌ చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇంకా హీరోనే కాలేదు, కానీ మైండ్‌ బ్లాక్‌ చేసే క్రేజ్‌
36
రూ.84 కోట్లతో కీర్తిసురేష్‌ `మహానటి` రెండో స్థానం
Image Credit : our own

రూ.84 కోట్లతో కీర్తిసురేష్‌ `మహానటి` రెండో స్థానం

అంతకు ముందు కీర్తిసురేష్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. కీర్తిసురేష్‌ `మహానటి` చిత్రంలో నటించింది. సావిత్రి జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వినీదత్‌ నిర్మించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం రూ.84కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది.

46
మూడో స్థానంలో అనుష్క `రుద్రమదేవి`
Image Credit : stockPhoto

మూడో స్థానంలో అనుష్క `రుద్రమదేవి`

ఆ తర్వాత వరుసగా అనుష్క సినిమాలున్నాయి. అనుష్క నటించిన `రుద్రమదేవి` రూ.82కోట్లు వసూలు చేసింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, రానా కీలక పాత్రలు పోషించారు. కాకతీయ సామ్రాజ్య యువరాణి రుద్రమదేవి కథతో, హిస్టారికల్‌ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. 2015లో ఇది విడుదలైంది.

56
నాల్గో స్థానంలో అనుష్క `అరుంధతి`
Image Credit : mallemala entertainment

నాల్గో స్థానంలో అనుష్క `అరుంధతి`

ఆ తర్వాత అనుష్క నటించిన మరో మూవీ `అరుంధతి` ఉంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. 2009లో హర్రర్‌ ఫాంటసీగా వచ్చిన ఈ మూవీ సుమారు రూ.70కోట్లు రాబట్టింది. అప్పట్లో ఇది సంచలన విజయంగా చెప్పొచ్చు. స్టార్‌ హీరోల మూవీస్‌కి మించిన కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీతోనే అనుష్క లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది.

66
ఐదో స్థానంలో అనుష్క `భాగమతి`
Image Credit : prime video

ఐదో స్థానంలో అనుష్క `భాగమతి`

అనుష్క జాబితాలోనే మరో మూవీ `భాగమతి` ఉంది. 2018లో విడుదలైన ఈ మూవీకి జి అశోక్‌ దర్శకత్వం వహించారు. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ.67కోట్లు వసూలు చేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఇలా సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్‌ టాప్‌ 5 చిత్రాల్లో మూడు అనుష్కవే కావడం విశేషం. ఇప్పుడు ఆమె `ఘాటి`తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఓపెనింగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. వీకెండ్స్ లో బాగానే వసూలు చేసే అవకాశం ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనుష్క శెట్టి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 9 Final List: అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కంటెస్టెంట్లు వీరే.. బిగ్‌ బాస్‌ బజ్‌ హోస్ట్ ఎవరంటే?
Recommended image2
ఎన్టీఆర్‌ చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇంకా హీరోనే కాలేదు, కానీ మైండ్‌ బ్లాక్‌ చేసే క్రేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved