MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?

Kalyan Padala Remuneration : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కప్ ను కళ్యాణ్ పడాల సాధించాడు.. సామాన్యుడిగా హౌస్ లోకి అడుగు పెట్టి.. విజేతగా నిలిచాడు. విన్నర్ గా కళ్యాణ్ ప్రైజ్ మనీ ఎంత, రెమ్యునరేషన్ తో పాటు టైటిల్ విన్నర్ కు లభించే బెనిఫిట్స్ ఏంటి..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 21 2025, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల
Image Credit : youtube/@starmaa

బిగ్ బాస్ తెలగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ గా కళ్యాణ్ పడాల విజయం సాధించాడు. టైటిల్ విన్నర్ గా బిగ్ బాస్ కప్పును సామాన్యుడు గెలుపొందాడు. ఎంతో మంది సెలబ్రిటీల మధ్య.. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి.. తన ఆటతీరుతో, యాటీట్యూడ్ తో అందరికి ఆకట్టుకున్నాడు. అమ్మాయిల పిచ్చొడు అంటూ అపవాదు వచ్చినా.. తనను తాను నిరూపించుకుని.. తానేంటో చూపించాడు. బిగ్ బాస్ హౌస్ తో పాటు బయట ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కళ్యాణ్ విజేతగా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. అయితే కళ్యాణ్ కు తనూజ గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో తనూజ విన్నర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ కళ్యాణ్ పడాల అభమానులు మాత్రం కళ్యాణ్ కప్పు గెలవడంపై కాన్ఫిడెట్ గా ఉన్నారు. ఈక్రమంలో విన్నర్ గా పవన్ కళ్యాణ్ పడాలకు అందే బెనిఫిట్స్, రెమ్యునరేషన్ సంగతి ఏంటి?

25
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు దక్కే బెనిఫిట్స్ ఏంటి?
Image Credit : starmaa

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు దక్కే బెనిఫిట్స్ ఏంటి?

సాధారణంగా బిగ్ బాస్ తెలుగు విన్నర్ కు ప్రైజ్ మనీతో పాటు అన్నిరోజులు హౌస్ లో ఉన్నందుకు రెమ్యునరేషన్, స్పాన్స్ ర్స్ నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దాంట్లో టాక్స్ లు కట్ అవుతాయని సమాచారం. ఈసారి కూడా బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలు , విన్నర్ కళ్యాణ్ కు ఒక కారు కూడా దక్కబోతోంది. అయితే అంతకంటే ముందు డీమాన్ పవన్ 15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చేశాడు. ఆ 15 లక్షల మనీ.. విన్నర్ ప్రైజ్ లోంచి కట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో విన్నర్ ప్రైజ్ మనీ 35 లక్షలకు తగ్గిపోయింది.

Related Articles

Related image1
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Related image2
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
35
కళ్యాణ్ పడాల రెమ్యునరేషన్, స్పెషల్ గిఫ్ట్
Image Credit : Jio Starmaa

కళ్యాణ్ పడాల రెమ్యునరేషన్, స్పెషల్ గిఫ్ట్

కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు వారానికి 2 లక్షల వరకూ రెమ్యునరేషన్ ను అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన్న 15 వారాలకు కళ్యాణ్ 30 లక్షల పారితోషికం లభించబోతోంది. ప్రైజ్ మనీ 35 లక్షలు, రెమ్యునరేషన్ 30 లక్షలు కలిపి 65 లక్షల వరకూ కళ్యాణ్ పడాల అందుకోబోతున్నట్టు సమాచారం. అయితే డీమాన్ పవన్ తీసుకెళ్లిన 15 లక్షలు లెక్కలోకి తీసుకోకపోతే మాత్రం.. పవన్ కళ్యాణ్ పడాలకు 80 లక్షల పైనే అందుతాయి. వాటితో పాటు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు ఒక కారు బహుమతిగా ప్రకటించారు. వీటితో పాటు స్పాన్సర్స్ నుంచి కొన్ని బెనిఫిట్స్ కూడా కళ్యాణ్ పడాలకు దక్కబోతున్నట్టు సమాచారం. అంతే కాదు మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ లో అవకాశం ఇస్తూ.. స్పెషల్ బాండ్ కూడా రాయబోతున్నట్టు తెలుస్తోంది.

45
కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి, టైటిల్ విన్నర్ గా..
Image Credit : starmaa

కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి, టైటిల్ విన్నర్ గా..

ఆంధ్రప్రదేశ్‌ విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాల.. కష్టపడి ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా చేరాడు. మూడేళ్లుగా సరిహద్దుల్లో దేశ సేవ చేస్తున్నాడు. కామనర్ గా బిగ్ బాస్ లో అడుగు పెట్టి.. సెలబ్రిటీలకు చెమటలు పట్టించాడు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కూడా దడదడలాడించి.. ఫిజికల్ గేమ్స్‌తో పాటు మైండ్ గేమ్‌లోనూ సత్తా చాటాడు. తనదైన గేమ్ తో, యాటీట్యూడ్ తో ఆకట్టుకున్న కళ్యాణ్ పడాల దృష్టిని ఆకర్శించాడు.సామన్యుల కోటాలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ గా కప్పును సాధించాడు.

55
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సూపర్ సక్సెస్..
Image Credit : Jiohotstar

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సూపర్ సక్సెస్..

తెలగు బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. కొన్ని సీజన్లు బోర్ కొట్టించినా.. కొన్ని సీజన్లు మాత్రం బాగా ఎంటర్టైన్ చేశాయి. గత మూడు సీజన్లు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. మంచి టీఆర్పీలను సాధించింది. సెప్టెంబర్ 10 న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విజయవంతంగా పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే కు చేరుకుంది. ఈ సీజన్ లో అంత పెద్ద స్టార్ సెలబ్రిటీలు లేకపోయినా.. సామాన్యులే సత్తా చాటి.. సీజన్ కు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. సామాన్యుల కోటాలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ పడాల టైటిల్ ను గెలిచాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Related Stories
Recommended image1
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Recommended image2
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved