MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్, లక్షలు పలికిన తారక్ బొమ్మ, ఎవరు కొన్నారంటే?

జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్, లక్షలు పలికిన తారక్ బొమ్మ, ఎవరు కొన్నారంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఓ అభిమాని స్వయంగా గీసిన పెన్సిల్ స్కెచ్ ను రీసెంట్ గా వేలం వేశారు. మరి ఆ బొమ్మ ఎన్ని లక్షలు పలికిందో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2025, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : instagram

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలతో తన మార్క్‌ను చూపిస్తున్నారు. రీసెంట్ గా తారక్ బాలీవుడ్ నుంచి వార్ 2 మూవీతో ఆడియన్స్ ను అలరించాడు. హుతిక్ రోషన్ తో కలిసి ఆయన నటించిన "వార్ 2" సినిమా, భారీ అంచనాల నడుమ విడుదలైన అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎమోషనల్ డ్రామా “డ్రాగన్” లో నటిస్తున్నారు.

25
Image Credit : Film

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈసినిమా తరువాత ఆయన దేవర2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈసారి కారణం సినిమా కాదు, ఒక అద్భుతమైన పెన్సిల్ స్కెచ్. ఎన్టీఆర్ కు మహిళా వీరాభిమాని, తన స్వహస్తాలతో ఆయన పెన్సిన్ స్కెచ్ ను అద్భుతంగా గీశారు.

Related Articles

Related image1
500 కోట్లు వసూలు చేసిన సినిమా బడ్జెట్ కేవలం 14 కోట్లు, 3 ఏళ్లుగా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తోన్న మూవీ
Related image2
విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో ముచ్చటగా మూడో సినిమా, రౌడీ ఫ్యాన్స్ కు పండగే
35
Image Credit : X / NTR Fans

తెలుగు అమ్మాయి బ్యులా రూబీ పెన్సిల్ ఆర్ట్‌ల ద్వారా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందుతోంది. సినిమా ప్రముఖుల స్కెచ్‌లు గీయడంలో ఆమెకు ప్రత్యేకత ఉంది. ఆమె గీసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ స్కెచ్‌ను చూసిన ఓ ఎన్టీఆర్ అభిమాని అమెరికా నుండి బ్యులా రూబీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సందేశం పంపించాడు. తనకు ఆ ఆర్ట్ చాలా నచ్చిందని, దాన్ని కొనుగోలు చేయాలని మనసు ఉందని తెలిపాడు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Buela Burugupally 🧚‍♀️✨ (@buelah_ruby)

45
Image Credit : Asianet News

ఆ అభిమాని, బ్యులా రూబీ గీసిన ఎన్టీఆర్ స్కెచ్‌ను 1650 డాలర్లకు కొనుగోలు చేశాడు. ఇది భారతీయ కరెన్సీలో సుమారుగా రూ. 1.45 లక్షలుగా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని బ్యులా రూబీ స్వయంగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా పంచుకుంది. “ఇది నేను గీసిన తెలుగు హీరోల పెన్సిల్ స్కెచ్‌లలో అత్యధిక ధరకు అమ్ముడైనది. ఈ స్థాయిలో నా ఆర్ట్‌కు స్పందన వస్తుందని ఊహించలేదు. ఎంతో సంతోషంగా ఉంది,” అని ఆమె వెల్లడించారు.

55
Image Credit : Youtube/Sithara Entertainments

ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో బ్యులా రూబీ టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. “స్కెచ్ అద్భుతంగా ఉంది”, “రియలిస్టిక్ ఆర్ట్”, “ఇది కళ కాదు, కళాఖండం” వంటి కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కెచ్‌తోపాటు బ్యులా రూబీ పేరు కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇకపోతే, ఎన్టీఆర్ ప్రస్తుతం "డ్రాగన్" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
దళపతి విజయ్ కీలక నిర్ణయం, జన నాయగన్ టీమ్ బ్యాక్ స్టెప్, సెన్సార్ బోర్డ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Recommended image2
రామ్ చరణ్ కోసం మలయాళ హీరోయిన్ ను సెట్ చేస్తోన్న సుకుమార్, నిజమెంత..?
Recommended image3
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Related Stories
Recommended image1
500 కోట్లు వసూలు చేసిన సినిమా బడ్జెట్ కేవలం 14 కోట్లు, 3 ఏళ్లుగా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తోన్న మూవీ
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో ముచ్చటగా మూడో సినిమా, రౌడీ ఫ్యాన్స్ కు పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved