MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాహుబలిలో నటించొద్దని తన కొడుక్కి చెప్పిన స్టార్ హీరోయిన్, ఆమె చెప్పిన కారణం ఏంటో తెలుసా ?

బాహుబలిలో నటించొద్దని తన కొడుక్కి చెప్పిన స్టార్ హీరోయిన్, ఆమె చెప్పిన కారణం ఏంటో తెలుసా ?

బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడు పాత్ర కోసం రాజమౌళి ఓ స్టార్ హీరోయిన్ కొడుకుని సంప్రదించారట. కానీ ఆ పాత్ర చివరికి రానా చేతికి ఎలా వచ్చింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 20 2025, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube/NTV

ఇండియన్ సినిమాకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన చిత్రం బాహుబలి. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో తెలుగు సినిమా మార్కెట్ స్వరూపమే మారిపోయింది. ఈ క్రెడిట్ అంతా రాజమౌళిదే. తన విజన్ తో రాజమౌళి బాహుబలి చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా డ్యూయెల్ రోల్ లో నటించారు. దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ నటించారు. 

25
Image Credit : Facebook/Jayasudha

ఇక విలన్ గా భల్లాల దేవుడు పాత్రలో రానా దగ్గుబాటి నట విశ్వరూపం ప్రదర్శించారు. అయితే భల్లాల దేవుడు పాత్ర కోసం రాజమౌళి చాలా మంది స్టార్ హీరోలని అడిగినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఎవరూ అంగీకరించలేదు. ఊహించని విధంగా ఆ ఆఫర్ ని రాజమౌళి జయసుధ కొడుకు నిహార్ కపూర్ కి ఇచ్చారట. భల్లాల దేవుడు పాత్ర కోసం నిహార్ కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. 

Related Articles

Related image1
రోజా అన్నయ్యలా భావించే హీరోతో రొమాంటిక్ సీన్, 27 టేకులు తీసుకున్నారట.. అసలేం జరిగిందో తెలుసా
Related image2
అల్లు అర్జున్ తో నటించి కనిపించకుండా పోయిన సూపర్ హిట్ హీరోయిన్లు.. ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా ఆరుగురు
35
Image Credit : Youtube/NTV

ఓ ఇంటర్వ్యూలో నిహార్ ఈ విషయం చెప్పారు. అయితే నిహార్ కంటే ముందే రాజమౌళి ఈ పాత్ర కోసం రానాని అడిగారట. ముందుగా రానా చేయనని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆలోచించుకుని చేస్తానని చెప్పాడు. అప్పటికే తాను ట్రైనింగ్ తీసుకుంటున్నానని నిహార్ తెలిపారు. రానా అంగీకారం తెలపడంతో రాజమౌళి అతడివైపే మొగ్గు చూపారు. నాకు కాలకేయుడి పాత్ర ఇస్తానని చెప్పారు. 

45
Image Credit : Instagram/Jayasudha

కాలకేయుడి పాత్రలో ఎక్కువగా ప్రోస్థటిక్ మేకప్ వేసుకోవాలని చెప్పారు. దాని వల్ల ముఖం సరిగ్గా కనిపించదు. నీ ఫస్ట్ మూవీలోనే ఆడియన్స్ కి నువ్వు సరిగ్గా కనిపించవు. కాబట్టి ఆ పాత్ర వద్దని అమ్మ చెప్పింది. దీనితో బాహుబలి టీమ్ కి తాను నో చెప్పినట్లు నిహార్ పేర్కొన్నారు. 

55
Image Credit : Instagram/Jayasudha

నిహార్ కపూర్ కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. కానీ సరైన గుర్తింపు లభించలేదు. ఒక వేళ నిహార్ కపూర్ భల్లాల దేవుడు పాత్ర చేసి ఉంటే ఇండియా మొత్తం గుర్తింపు దక్కేది. మొత్తానికి నిహార్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
త్రిష కు సూర్య తో ఉన్న 22 ఏళ్ల పవర్‌ఫుల్ సెంటిమెంట్ ఏంటో తెలుసా?
Recommended image2
ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Related Stories
Recommended image1
రోజా అన్నయ్యలా భావించే హీరోతో రొమాంటిక్ సీన్, 27 టేకులు తీసుకున్నారట.. అసలేం జరిగిందో తెలుసా
Recommended image2
అల్లు అర్జున్ తో నటించి కనిపించకుండా పోయిన సూపర్ హిట్ హీరోయిన్లు.. ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా ఆరుగురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved