MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పాలిటిక్స్ వల్ల ఆ స్టార్ తో మూవీ చేయలేకపోయా, ఎన్టీఆర్ తో కూడా మిస్ అయింది.. గోపీచంద్ మలినేని కామెంట్స్

పాలిటిక్స్ వల్ల ఆ స్టార్ తో మూవీ చేయలేకపోయా, ఎన్టీఆర్ తో కూడా మిస్ అయింది.. గోపీచంద్ మలినేని కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సీనియర్ హీరో సన్నీ డియోల్ తో జాట్  అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 30 2025, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Gopichand Malineni , Jr NTR

Gopichand Malineni , Jr NTR

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సీనియర్ హీరో సన్నీ డియోల్ తో జాట్  అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత సన్నీ లియోన్ మాస్ గా కనిపించిన చిత్రం ఇదే. బాలీవుడ్ లో జాట్ మూవీ మంచి విజయమే సాధించింది.

25
Director Gopichand Malineni

Director Gopichand Malineni

రీసెంట్ గా ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. వీర సింహారెడ్డి తర్వాత తాను మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నేను ఆ మూవీ తర్వాత తమిళ స్టార్ దళపతి విజయ్ తో సినిమా చేయాలని ప్రయత్నించాను. దిల్ రాజు సమక్షంలో విజయ్ కి కథ కూడా చెప్పడం జరిగింది. స్టోరీ వినగానే విజయ్ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు.

Related Articles

Related image1
శోభిత, నాగ చైతన్య తల్లిదండ్రులు కాబోతున్నారా..అక్కినేని ఫ్యామిలీకి త్వరలో వారసుడు, నిజమెంత ?
Related image2
పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన యువతిపై మెగా కోడలు ఆగ్రహం.. క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది..
35
Gopichand malineni, vijay

Gopichand malineni, vijay

కానీ అదే సమయంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి రెడీ అవుతున్నారు. చివరి చిత్రానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆ టైంలో తెలుగు డైరెక్టర్ తో మూవీ వద్దని విజయ్ కి ఆయన సన్నిహితులు చెప్పారట. ఆ విధంగా విజయ్ తో మూవీ మిస్ అయిందని గోపీచంద్ తెలిపారు.

45

అంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఒక చిత్రం మిస్ అయిందని గోపీచంద్ పేర్కొన్నారు. పండగ చేస్కో తర్వాత ఎన్టీఆర్ కి మోస్ట్ వైలెంట్ గా ఉండే ఒక కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. కానీ నీ నుంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఆశిస్తున్నాను గోపి అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో ఎన్టీఆర్ కోసం వినోదం ఉండే కథని ప్రిపేర్ చేయాలనుకున్నా. కానీ కుదరలేదని గోపీచంద్ తెలిపారు. ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో. ఆయనతో సినిమా చేయాలంటే భారీ యాక్షన్ కథతోనే చేస్తాను అని గోపీచంద్ తెలిపారు.

55
Jr NTR

Jr NTR

మరొక ఆసక్తికర విషయం ఏంటంటే.. బాలయ్యతో ముందుగా అనుకున్నది వీర సింహారెడ్డి కథ కాదు. ఇప్పుడు నేను బాలీవుడ్లో తెరకెక్కించిన జాట్ చిత్రాన్ని బాలయ్యతో చేయాలనుకున్నా. కానీ బాలయ్య.. గోపి అఖండ తర్వాత అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని మ్యాచ్ చేయాలంటే ఒక మంచి ఫ్యాక్షన్ కదా చేయాల్సిందే అని అన్నారు. దీంతో జాట్ కథని పక్కన పెట్టి వీర సింహారెడ్డి స్టోరీ రెడీ చేసినట్లు గోపీచంద్ తెలిపారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
శోభిత, నాగ చైతన్య తల్లిదండ్రులు కాబోతున్నారా..అక్కినేని ఫ్యామిలీకి త్వరలో వారసుడు, నిజమెంత ?
Recommended image2
పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన యువతిపై మెగా కోడలు ఆగ్రహం.. క్లీన్ చేయాల్సిన టైం వచ్చింది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved