MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Srihari: హీరో భార్యకి అస్సలు ఇష్టంలేని ఇండస్ట్రీ హిట్ మూవీ.. మొదట చేయొద్దు అని చెప్పింది, కానీ కట్ చేస్తే

Srihari: హీరో భార్యకి అస్సలు ఇష్టంలేని ఇండస్ట్రీ హిట్ మూవీ.. మొదట చేయొద్దు అని చెప్పింది, కానీ కట్ చేస్తే

శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఓ మూవీలో నటించవద్దని శ్రీహరికి చెప్పారట. కానీ ఆ సినిమానే ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఆ మూవీ ఏంటి ? డిస్కో శాంతి ఎందుకు వద్దన్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 17 2026, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Disco Shanti
Image Credit : Asianet News

Disco Shanti

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు శ్రీహరికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీహరి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. వెండి తెరపై తొలి సిక్స్ ప్యాక్ హీరోగా శ్రీహరికి మంచి గుర్తింపు ఉంది. శ్రీహరి ఎన్నో మెమొరబుల్ సినిమాల్లో నటించారు. అనారోగ్యం కారణంగా శ్రీహారి 2013లో మరణించారు.

25
శ్రీహారి, నటి డిస్కో శాంతిని వివాహం
Image Credit : IMDB

శ్రీహారి, నటి డిస్కో శాంతిని వివాహం

శ్రీహారి, నటి డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. శ్రీహరి తన కెరీర్ లో బావగారు బావున్నారా, పవిత్రబంధం, భద్రాచలం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, మగధీర లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరి సినిమాల్లో తనకి ఇష్టమైన చిత్రాలని రివీల్ చేశారు.

Related Articles

Related image1
OTT Movies: అడవిలో భయంకరమైన ఫారెన్ లేడీ, టైం లూప్ కాన్సెప్ట్ తో కట్టి పడేస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ
Related image2
Rajamouli: రాజమౌళి కి ఫస్ట్ ఫ్లాప్ ఎప్పుడు పడుతుందో తెలుసా ? అప్పటి నుంచే డేంజర్ బెల్స్
35
మగధీర సినిమాలో నటించవద్దు
Image Credit : Asianet News

మగధీర సినిమాలో నటించవద్దు

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, భద్రాచలం లాంటి సినిమాలు బాగా ఇష్టం అని డిస్కో శాంతి తెలిపారు. మగధీర మూవీ గురించి అడగగా.. ఆమె నవ్వేశారు. ఎందుకంటే ముందుగా డిస్కోశాంతి ఆ సినిమాలో నటించవద్దు అని శ్రీహరికి చెప్పారట. ఆమె మాట్లాడుతూ.. ఆ టైంలో శ్రీహరి బాగా క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటించడమే నాకు ఎక్కువ ఇష్టం. అయినా కూడా క్యారెక్టర్ రోల్స్ వస్తున్నాయి.

45
కథ నచ్చలేదు
Image Credit : Asianet News

కథ నచ్చలేదు

మగధీరలో నటించమని చెప్పడానికి రాజమౌళి మా ఇంటికి వచ్చారు. కథ చెప్పి వెళ్లారు. బావ రాజమౌళి కి ఓకె చెప్పేశారు. మగధీరతో ఒక క్యారెక్టర్ చేస్తున్నా. సెకండ్ హాఫ్ లో ఉంటుంది. కథ చాలా బావుంది అని బావ అన్నారు. కానీ ఆయన క్యారెక్టర్ రోల్స్ చేయడం నాకు ఇష్టం లేదు. వద్దు బావ అని చెప్పేశా. లేదు కథ విను ముందు అని.. కథ చెప్పారు. అయినా కూడా నాకు అంతగా కథ నచ్చలేదు.

55
నా జడ్జిమెంట్ రాంగ్
Image Credit : our own

నా జడ్జిమెంట్ రాంగ్

కానీ శ్రీహరి బావ నచ్చి ఆ సినిమా చేశారు. సినిమా చూశాక నా జడ్జిమెంట్ రాంగ్ అని అర్థమైంది. మగధీర రిలీజ్ అయ్యాక కొన్ని వందల సార్లు ఆ సినిమా చూశా. డైలాగ్స్ కూడా బాగా గుర్తున్నాయి. శ్రీహరి లేకుంటే ఆ సినిమా లేదని చాలా మంది అన్నారు అంటూ డిస్కోశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మగధీర చిత్రాన్ని రిజెక్ట్ చేసిఉంటే శ్రీహరి ఇండస్ట్రీ హిట్ మూవీ మిస్సయ్యేవారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: అడవిలో భయంకరమైన ఫారెన్ లేడీ, టైం లూప్ కాన్సెప్ట్ తో కట్టి పడేస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ
Recommended image2
Toxic Preview Talk: టాక్సిక్ ప్రివ్యూ టాక్‌.. వాళ్లకు మాత్రం అదిరిపోయే ట్రీట్‌.. అసలు టార్గెట్‌ ఇదే
Recommended image3
Heroines Without Make up: మేకప్‌ లేకుండా సమంత, రష్మిక, నయన, త్రిష, మీనాక్షి, శ్రీలీల నయా లుక్‌.. చూస్తే ఇక అంతే
Related Stories
Recommended image1
OTT Movies: అడవిలో భయంకరమైన ఫారెన్ లేడీ, టైం లూప్ కాన్సెప్ట్ తో కట్టి పడేస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ
Recommended image2
Rajamouli: రాజమౌళి కి ఫస్ట్ ఫ్లాప్ ఎప్పుడు పడుతుందో తెలుసా ? అప్పటి నుంచే డేంజర్ బెల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved