- Home
- Entertainment
- 2000 కోట్ల ఆస్తికి వారసుడు, చేసిన 2 సినిమాలు డిజాస్టర్స్, ఇండస్ట్రీకి దూరమైన హీరో ఎవరో తెలుసా?
2000 కోట్ల ఆస్తికి వారసుడు, చేసిన 2 సినిమాలు డిజాస్టర్స్, ఇండస్ట్రీకి దూరమైన హీరో ఎవరో తెలుసా?
ఒక యంగ్ హీరో.. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి, కాని 2000 కోట్లకు పైగా ఆస్తికి అతను వారసుడు. సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో తన టార్గెట్ ను టర్న్ చేశాడు. ప్రస్తుతం కోట్లు గడిస్తున్నఆ యంగ్ హీరో ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతీ ఒక్కరు స్టార్ హీరోలు కాకపోవచ్చు కాని కొన్ని సినిమలతో తమకంటూ గుర్తింపు సంపాదిస్తారు. అయితే కొంత మంది మాత్రం రెండు మూడు సినిమాలు చేసి, అవి వర్కౌట్ అవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోతారు. కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలు ఏ వ్యాపారాలో చేసుకుని బ్రతుకుతారు. అదే వేల కోట్ల ఆస్తులు ఉంటే ప్లాప్ సినిమాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటుంది చెప్పండి. అలాంటి ఓ యంగ్ హీరో గురించి చూద్దాం.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో ఆ కోవలేకే వస్తాడు. ఆ హీరో పేరు గిరీష్ కుమార్. రెండు సినిమాల్లో హీరోగా గట్టి ప్రయత్నం చేశాడు. కాని వర్కౌట్ అవ్వకపోవడంతో ప్రస్తుతం వ్యాపార ప్రపంచంలో బాగా ఎదిగాడు. అతని ఆస్తి విలువ ఇప్పుడు 2,146 కోట్లను దాటింది.
గిరీష్ కుమార్ బాలీవుడ్‌లో 2013లో విడుదలైన ‘రామయ్య వస్తావయ్యా (Ramayya Vastavaiyya) సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో గిరీష్ కు జోడీగా సౌత్ స్టార్ హీరోయిన్ , కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటించింది. దాదాపు 38 కోట్లు బడ్జెత్ తో నిర్మించిన ఈసినిమా 38 కోట్లకు అటు ఇటుగా వసూలు చేసింది. పెట్టుబడి తిరిగొచ్చినప్పటికీ, ఏ లాభంలేదన్నమాట. అయినప్పటికీ గిరీష్ తన నటనతో అందరిని ఆకర్షించాడు. ‘బెస్ట్ డెబ్యూ’హీరోగా ఫిల్మ్ ఫేర్ కు కూడా నామినేట్ అయ్యాడు.
ఇక గిరీష్ సెకండ్ సినిమా ‘లవ్‌షుదా’ (LoveShuddha). 2016లో ఈసినిమా విడుదలైంది. ఇది కూడా ఫ్లాప్ అయింది. క్రిటిక్స్, ట్రేడ్ అనాలిస్ట్‌లను ఏమాత్రం ఆకర్షించలేదు ఈసినిమా. దాంతో సినిమాలు తనకు కలిసిరావు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు గిరీష్. అప్పటికే తన తండ్రికి వేల కోట్ల ఆస్తి ఉండటంతో, సినిమాల నుంచి వెళ్లిపోయి బిజినెస్ చేసుకుంటూ బిజీ అయిపోయాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయినా, గిరీష్ కుమార్ ఇప్పుడు భారీ బిజినెస్ లు చేస్తూ.. వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యాడు. అతడి కుటుంబ నేపథ్యం పెద్దది. తండ్రి వ్యాపారవేత్త, నిర్మాత కూడా. ఆయన టిప్స్ ఇండస్ట్రీస్ (Tips Industries)కు వ్యవస్థాపకుడు కాగా, ప్రస్తుతం గిరీష్ కుమార్ ఆ కంపెనీకి COOగా (Chief Operating Officer) బాధ్యతలు చేపట్టాడు. సంస్థను లాభాల్లో నడిపిస్తూ.. కోట్లు గడిస్తున్నాడు గిరీష్ కుమార్.
టిప్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ మీడియా, వినోద రంగంలో రాణిస్తోంది. మ్యూజిక్ వీడియోస్ తో పాటు సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ లో కూడా సక్సెస్ సాధించింది.
గిరీష్ కుమార్ సినిమా రంగంలో ఫ్లాప అయినా, బిజినెస్ లో మాత్రం సక్సెస్ అయ్యారు. తన కుటుంబ సంపదను కాపాడుతున్నాడు. తండ్రి కుమార్ ఎస్. తౌరానీ పెట్టుబడులు, రమేష్ ఎస్. తౌరానీ మేనల్లుడిగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాడు.
చాలా మంది సినీ హీరోలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. వ్యాపార నైపుణ్యం లేకుండా ఎంటర్ అయితే మాత్రం వారికి ఫెయిల్యూర్స్ తప్పవు. గిరీష్ మాత్రం హీరోగా ఫెయిల్ అయినా.. వ్యాపారం విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి, టిప్స్ సంస్థలో కీలక వ్యక్తిగా ఎదిగాడు. ఇక గిరీష్ కుమార్ తిరిగి సినిమాలకు మళ్లీ వస్తారా? లేక బిజినెస్ ను ఇంకా పెంచుకుంటూ వెళ్తారా అనేది చూడాలి.