- Home
- Entertainment
- 400 కోట్ల హీరోయిన్, అద్దె ఇంట్లో ఉంటూ అవకాశాల కోసం చూస్తున్న స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా?
400 కోట్ల హీరోయిన్, అద్దె ఇంట్లో ఉంటూ అవకాశాల కోసం చూస్తున్న స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా?
ఒక టైమ్ లో వరుస సినిమాలు చేసిన ఈ హీరోయిన్, ఆతరువాత జోరు తగ్గించింది. ప్రస్తుతం టాలీవుడ్ కు దూరం అయ్యి, బాలీవుడ్ కు దగ్గరయ్యింది. గతంలో స్టార్ హీరో ఉన్న అద్దె ఇంట్లో ఉంటూ, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా.. కాస్త అదృష్టం ఉంటేనే రాణించగలరు. చాలా మంది హీరోయిన్స్ ఒక ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల్లో క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఓవర్ నైట్‌లో స్టార్స్ గా మారుతున్నారు. కాని అందులో కొంత మంది అది నిలబెట్టుకోలేక తెరమరుగై పోతున్నారు.
ఇంతకొంత మంది మాత్రం ఆ కరేజ్ ను కాపాడుకోవడంకోసం తెగ ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా ప్రయత్నిస్తూ.. ఎదో ఒకసినిమాతో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. వెండితెరపై నేను ఉన్న అనిపించుకున్న ఈ బ్యూటీ.. సడెన్ గా బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టింది. ఆతరువాత మళ్లీ ఆమె కెరీర్ మొదటికొచ్చింది.
ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అదాశర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతరువాత సెకండ్ హీరోయిన్ పాత్రలవైపు మళ్లింది అదా శర్మ.
సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెపపించింది. కొన్నాళ్లతరువాత తెలుగు తెరకు దూరమయ్యి.. బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కేరళ స్టోరీ సినిమాతో అదాను లక్కు పలకరించింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు దాదాపు 400 కోట్లకుపైగ కలెక్షన్స్ ను సాధించింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ హీరోయిన్.
భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటుంది అదాశర్మ. ఇండస్ట్రీలో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న అదా శర్మకు ప్రస్తుతం టైమ్ కలిసిరావడంలేదు. ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది.
ప్రస్తుతం అడపా దడపా లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేస్తోంది అదా శర్మ. అయితే అదా శర్మ ఈ మధ్య దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అద్దెకు ఉన్న ఇంట్లోకి దిగింది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు ఉంటున్నట్టు తెలుస్తోంది.
నెలనెలా రెంట్ పే చేస్తూ.. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తుందట ఈ బ్యూటీ. అయితే సోసల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అదా శర్మ. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్, యాక్టివిటీస్ ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. మోడలింగ్ ఫోటోలు మాత్రమే కాదు, సినిమాల కోసం ఆమె చేసే ప్రయోగాలు, ప్రాక్టీస్ వీడియోలు, రిహార్సల్ వీడియోలను కూడా నెట్టింట్లో అప్ లోడ్ చేస్తుంది అదా శర్మ.
ఆమె ఇప్పటికే కేరళ సాంప్రదాయ డాన్స్ తో పాటు, కలరియపట్టు లాంటి విద్యలను కూడా నేర్చుకుంది. వాటికి సబంధించిన ప్రాక్టీస్ వీడియోస్ ను కూడా గతంలోనే ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇక తన ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేసిన మెమరీస్ ను కూడా ఆమె షేర్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తన భామ్మతో కలిసి అదా శర్మ చేసే వీడియోలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు.