MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది

జపాన్ లో భూకంపం సంభవించింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్ టూర్ లో ఉన్నారు. దీనితో ప్రభాస్ యోగ క్షేమాలపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆందోళన తొలగించేలా డైరెక్టర్ గుడ్ న్యూస్ చెప్పారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 09 2025, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జపాన్ లో బాహుబలి ది ఎపిక్
Image Credit : X/Baahubali

జపాన్ లో బాహుబలి ది ఎపిక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభాస్ కి పెద్ద గండం తప్పింది. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో జపాన్ లో బిజీగా ఉన్నారు. బాహుబలి చిత్రానికి బాగా ఆదరణ లభించిన దేశాల్లో జపాన్ కూడా ఒకటి. దీనితో బాహుబలి ది ఎపిక్ చిత్రాన్ని డిసెంబర్ 12 రిలీజ్ చేస్తున్నారు. 

25
జపాన్ లో భూకంపం
Image Credit : X

జపాన్ లో భూకంపం

ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉండగా అభిమానులకు ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. జపాన్ లో సోమవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది. జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం ఎక్కువగా  నమోదు కాగా దాని ప్రభావం టోక్యో లాంటి నగరాలపై కూడా పడింది. 

Related Articles

Related image1
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Related image2
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
35
ప్రభాస్ ఎక్కడ ఉన్నారు ?
Image Credit : prabhas instagram

ప్రభాస్ ఎక్కడ ఉన్నారు ?

దీనితో ప్రభాస్ అభిమానులు కంగారు పడ్డారు. తమ హీరో ఎలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం ప్రారంభించారు. ప్రభాస్ అభిమానుల ఫ్యాన్ పేజీ నుంచి ఓ పోస్ట్ వైరల్ అయింది. జపాన్ లో భూకంపం, సునామీ వార్నింగ్ కూడా ఇచ్చారు. హీరో ఎక్కడ ఉన్నారు ? ఈ రోజు రిటర్న్ అవుతారా ? అంటూ పోస్ట్ వైరల్ అవుతోంది. 

45
ప్రభాస్ సేఫ్, క్లారిటీ ఇచ్చిన మారుతి
Image Credit : youtube/bahubali movie

ప్రభాస్ సేఫ్, క్లారిటీ ఇచ్చిన మారుతి

అభిమాని పోస్ట్ కి రాజా సాబ్ డైరెక్టర్ మారుతి స్పందించారు. డార్లింగ్ ప్రభాస్ తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ప్రభాస్ లేరు. సేఫ్ గా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని మారుతి క్లారిటీ ఇచ్చారు. దీనితో ప్రభాస్ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. 

55
సంక్రాంతికి రాజాసాబ్
Image Credit : instagram

సంక్రాంతికి రాజాసాబ్

ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. హారర్ కామెడీ చిత్రంగా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 11: అమూల్యను పెళ్లిచేసుకోలేదని వల్లికి చెప్పేసిన విశ్వక్, నర్మద ప్రేమలకు షాకిచ్చిన భాగ్యం
Related Stories
Recommended image1
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Recommended image2
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved