MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బృందావనం నుంచి వకీల్ సాబ్ వరకు అలాగే జరిగింది.. ఎన్టీఆర్, పవన్, మహేష్ రెమ్యునరేషన్స్ పై దిల్ రాజు కామెంట్స్

బృందావనం నుంచి వకీల్ సాబ్ వరకు అలాగే జరిగింది.. ఎన్టీఆర్, పవన్, మహేష్ రెమ్యునరేషన్స్ పై దిల్ రాజు కామెంట్స్

తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతకి బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సహకరించాలని కోరారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 11 2025, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమ్ముడు ట్రైలర్ లాంచ్
Image Credit : Youtube

తమ్ముడు ట్రైలర్ లాంచ్

యంగ్ హీరో నితిన్, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం తమ్ముడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నితిన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో సీనియర్ నటి లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ్ముడు ట్రైలర్ లాంచ్ చేశారు.

25
 తమ్ముడు బడ్జెట్ పై కామెంట్స్
Image Credit : Youtube

తమ్ముడు బడ్జెట్ పై కామెంట్స్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతకి బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సహకరించాలని కోరారు. తమ్ముడు మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు బడ్జెట్ అంతకంతకూ పెరిగింది. ఒకరోజు వేణు శ్రీ రాముని పిలిచి బడ్జెట్ గురించి అడిగాను. వేణు శ్రీరామ్ నాతో.. సార్ ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని నేను ముందే చెప్పాను కదా అని తెలిపాడు. నిజమే ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు దాన్ని వెనక్కి తీసుకురావడం కూడా అవసరమే కదా.. అది ఎలా అని అడిగాను. దీంతో వేణు శ్రీరామ్ వెంటనే తన రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధపడ్డాడు.

Related Articles

Related image1
నీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి
Related image2
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదం.. నా కెరీర్ ని నాశనం చేయకండి, బిగ్ బాస్ దివి వివరణ
35
రెమ్యునరేషన్ తగ్గించుకున్న నితిన్
Image Credit : Asianet News

రెమ్యునరేషన్ తగ్గించుకున్న నితిన్

నితిన్ కి కూడా బడ్జెట్ గురించి చెప్పినప్పుడు.. అంకుల్ మీరు ఎంత పంపిస్తారో అంతే ఇవ్వండి.. నేను రెమ్యునరేషన్ గురించి అడగను అని ముందుకు వచ్చినట్లు దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. దిల్ రాజు రెమ్యునరేషన్ ప్రస్తావన తీసుకురావడంతో మీడియా ప్రతినిధులు వెంటనే ప్రశ్నల వర్షం కురిపించారు. రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోలని కూడా ఒప్పించగలరా, ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. నాకు ఆ ధైర్యం ఉంది అంటూ దిల్ రాజు సమాధానం ఇచ్చారు.

45
సహకరించిన ఎన్టీఆర్, మహేష్, పవన్
Image Credit : our own

సహకరించిన ఎన్టీఆర్, మహేష్, పవన్

హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వాళ్లు సహకరిస్తారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. బృందావనం చిత్రం సమయంలో ఎన్టీఆర్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ కోసం ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం మహేష్ బాబు, వకీల్ సాబ్ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని దిల్ రాజు తెలిపారు.

55
ఇది పోటీ ప్రపంచం
Image Credit : instagram

ఇది పోటీ ప్రపంచం

స్టార్ హీరోలు దొరకరు అనే ఉద్దేశంతో నిర్మాతలు తొందరపడి రెమ్యునరేషన్ ఎక్కువ ఆఫర్ చేస్తుంటారు. ఇది పోటీ ప్రపంచం అలాంటివి తప్పవు. కానీ సందర్భం వచ్చినప్పుడు రెమ్యునరేషన్ విషయంలో సహకరించే హీరోలు కూడా ఇక్కడ ఉన్నారు అని దిల్ రాజు పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
దిల్ రాజు
మహేష్ బాబు ఘట్టమనేని
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image2
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Recommended image3
Funky First Review: `ఫంకీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లో నవ్వుల సునామీ.. కానీ మైనస్‌ ఏంటంటే?
Related Stories
Recommended image1
నీ అంత గొప్ప డ్యాన్సర్ ని కాదు నేను, కొంచెం తగ్గు అంటూ స్టార్ హీరోయిన్ కి చురకలంటించిన చిరంజీవి
Recommended image2
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదం.. నా కెరీర్ ని నాశనం చేయకండి, బిగ్ బాస్ దివి వివరణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved