MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇక సర్దుకుపోలేం, అది అడిగినందుకే రచ్చ.. స్పిరిట్, కల్కి 2 నుంచి తప్పుకోవడంపై దీపికా పదుకొణె

ఇక సర్దుకుపోలేం, అది అడిగినందుకే రచ్చ.. స్పిరిట్, కల్కి 2 నుంచి తప్పుకోవడంపై దీపికా పదుకొణె

Deepika Padukone: స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి తప్పుకోవడంపై ఎట్టకేలకు దీపికా పదుకొణె స్పందించింది. 8 గంటల వర్క్ విషయంలోనే విభేదాలు వచ్చినట్లు పేర్కొంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 10 2025, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కల్కి 2, స్పిరిట్ వివాదంపై దీపికా కామెంట్స్ 
Image Credit : Social Media

కల్కి 2, స్పిరిట్ వివాదంపై దీపికా కామెంట్స్ 

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొణె ఇటీవల స్పిరిట్, కల్కి 2 లాంటి భారీ పాన్‌ ఇండియా చిత్రాల నుంచి తప్పుకోవడంతో వార్తల్లో నిలిచింది. ఈ రెండు ప్రాజెక్టులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్నవే. దీపికా పదుకొణె అధిక పారితోషికం, వర్క్ అవర్స్‌పై ఆంక్షలు, తన కుమార్తెను చూసుకోవడానికి సమయం కేటాయించాలనే కారణాల వల్ల ఈ సినిమాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీపికా, సందీప్ రెడ్డి వంగా మధ్య వివాదం అన్నట్లుగా వ్యవహారం వెళ్ళింది. 

25
క్రూరమైన వర్క్ కండిషన్స్ 
Image Credit : Social Media

క్రూరమైన వర్క్ కండిషన్స్ 

స్పిరిట్ తర్వాత కల్కి 2 చిత్ర యూనిట్ కూడా దీపికా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో మరోసారి దీపికా వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని దీపికా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారిగా ఈ అంశంపై మాట్లాడింది. ఆమె భారత సినీ పరిశ్రమలో ఉన్న వర్క్ కండిషన్స్‌ క్రూరమైనవి అనిఅభివర్ణించారు. మన పరిశ్రమలో సర్దుకుపోయే ధోరణిని మార్చాల్సిన సమయం వచ్చేసింది అని దీపికా వ్యాఖ్యానించింది.

Related Articles

Related image1
బాషా రేంజ్ లో ఊహించుకున్నారు, పవన్ కళ్యాణ్ మూవీ ఫ్లాప్ కావడంతో జాగ్రత్త పడిన చిరంజీవి.. ఏం చేశారో తెలుసా
Related image2
కృష్ణ, శోభన్ బాబు మధ్యలోనే వదిలేయడంతో ఆస్తి మొత్తం కోల్పోయిన హీరో.. కట్ చేస్తే వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
35
పురుష సూపర్ స్టార్లకు మాత్రం సపరేట్ రూల్స్ 
Image Credit : Instagram

పురుష సూపర్ స్టార్లకు మాత్రం సపరేట్ రూల్స్ 

దీపికా మాట్లాడుతూ, “భారత సినీ పరిశ్రమ ఒక స్ట్రక్చర్డ్ వర్క్‌ప్లేస్ లా ఇప్పటివరకు సరిగ్గా పనిచేయలేదు. కానీ నేను నెమ్మదిగా, స్థిరంగా ఈ వ్యవస్థను మార్చే దిశగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు పనిచేస్తున్న విధానం చాలా క్రూరంగా ఉంటోంది అని దీపికా పేర్కొంది. అలాగే, ఆమె లింగ వివక్ష సమస్యను కూడా ప్రస్తావించింది. “చాలా మంది పురుష సూపర్‌స్టార్లు సంవత్సరాల తరబడి రోజుకు ఎనిమిది గంటలకంటే ఎక్కువ పనిచేయరు. కొంతమంది పురుష స్టార్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసి వీకెండ్ లో హాలిడే తీసుకుంటారు. కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాదు. మహిళలు మాత్రం అదే చేయాలంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది,” అని దీపికా తెలిపింది.

45
అది అడగడం వల్లే తప్పించారు 
Image Credit : Asianet News

అది అడగడం వల్లే తప్పించారు 

సినీ పరిశ్రమలో మహిళలకు మరింత గౌరవం, సమతుల్య వర్క్ కండిషన్స్ అవసరమని ఆమె స్పష్టం చేసింది. “ప్రతీ ఒక్కరూ ఒక సురక్షితమైన, ప్రొఫెషనల్‌ వాతావరణంలో పనిచేయాలి. సినిమా పరిశ్రమ కూడా ఒక సుస్థిరమైన కార్పొరేట్ వర్క్ కల్చర్‌లా మారాలి,” అని ఆమె పేర్కొంది. 8 గంటలు వర్క్ చేస్తానని చెప్పడం వల్లే తనని ఇటీవల కొన్ని చిత్రాల నుంచి తప్పించినట్లు దీపికా పేర్కొంది. గత కొంతకాలంగా దీపికా పదుకొణె పలు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినా, తాను పాల్గొనలేకపోవడం వెనుక ఉన్న కారణాలను ఈ ఇంటర్వ్యూలో ఆమె స్పష్టంచేసినట్టయింది. “నాకు సినిమాతో పాటు నా కుటుంబం, నా వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. సమతుల్యతను కాపాడుకోవడమే నా ప్రాధాన్యత,” అని ఆమె తెలిపింది.

55
మరి ఆ డిమాండ్ల సంగతి ఏంటి ?
Image Credit : social media

మరి ఆ డిమాండ్ల సంగతి ఏంటి ?

దీపికా పదుకొణె ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతోంది. అయితే కేవలం వర్కింగ్ అవర్స్ గురించి మాత్రమే కాదు.. ఆమె గతంలో కల్కి చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 50 శాతం ఎక్కువ డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయ.  అదే విధంగా తనకి ఉన్న 25 మంది సిబ్బంది ప్రయాణ ఖర్చులు, వసతి లాంటివి నిర్మాతలే భరించాలని డిమాండ్ చేసిందట. ఈ డిమాండ్లకు బెదిరిపోయిన నిర్మాతలు ఆమెని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీపికా తెలివిగా వీటి గురించి మాత్రం స్పందించలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి ముహూర్తం ఫిక్స్ ? ఈసారి హోస్ట్ గా నాగార్జున ఉంటాడా.. లేదా?
Recommended image2
Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్
Recommended image3
Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌
Related Stories
Recommended image1
బాషా రేంజ్ లో ఊహించుకున్నారు, పవన్ కళ్యాణ్ మూవీ ఫ్లాప్ కావడంతో జాగ్రత్త పడిన చిరంజీవి.. ఏం చేశారో తెలుసా
Recommended image2
కృష్ణ, శోభన్ బాబు మధ్యలోనే వదిలేయడంతో ఆస్తి మొత్తం కోల్పోయిన హీరో.. కట్ చేస్తే వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved