- Home
- Entertainment
- మగధీరతో నేషనల్ అవార్డు, ఆ కొరియోగ్రాఫర్ వల్లే సిల్క్ స్మిత కెరీర్ పడిపోయిందా.. బాలయ్య మూవీ షూటింగ్ లో రచ్చ
మగధీరతో నేషనల్ అవార్డు, ఆ కొరియోగ్రాఫర్ వల్లే సిల్క్ స్మిత కెరీర్ పడిపోయిందా.. బాలయ్య మూవీ షూటింగ్ లో రచ్చ
ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత పై ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో శివశంకర్ మాస్టర్, సిల్క్ స్మిత మధ్య పెద్ద వివాదమే చెలరేగింది.

సిల్క్ స్మితపై శివశంకర్ మాస్టర్ కామెంట్స్
సినీ ప్రియలకు సిల్క్ స్మిత గురించి పరిచయం అవసరం లేదు. అప్పట్లో ఆమె గ్లామరస్ పాత్రలకు బ్రాండ్. గ్లామర్ రోల్స్ చేయాలన్నా, స్పెషల్ సాంగ్స్ చేయాలన్నా దర్శకులకు సిల్క్ స్మిత మొదటి ఆప్షన్ గా ఉండేవారు. నటన, డ్యాన్స్ లో ఎంతో ప్రతిభ చూపించిన సిల్క్ స్మిత కెరీర్ విషాదంగా ముగిసింది. స్టార్ హీరోలు, దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు అప్పుడప్పుడు సిల్క్ స్మితని గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత పై ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో గొప్ప డాన్స్ కొరియోగ్రాఫర్లలో శివ శంకర్ మాస్టర్ కూడా ఒకరు. ఆయన మగధీర చిత్రంలో ధీర ధీర అనే సాంగ్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. సిల్క్ స్మిత తో కలిసి పనిచేసిన అనుభవాన్ని శివశంకర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
ఆయన వల్లే సిల్క్ స్మిత కెరీర్ పడిపోయిందా ?
అప్పట్లో శివశంకర్ మాస్టర్, సిల్క్ స్మిత మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. శివ శంకర్ మాస్టర్ కారణంగానే సిల్క్ స్మితకి అవకాశాలు తగ్గి కెరీర్ పడిపోయింది అనే ప్రచారం అప్పట్లో జరిగింది. దీనిని శివ శంకర్ మాస్టర్ ఖండించారు. అది అవాస్తవం.. కానీ సిల్క్ స్మిత తో గొడవ జరిగిన మాట వాస్తవమే అని శివశంకర్ మాస్టర్ అన్నారు. ఆమె చాలా అందమైన నటి. సిల్క్ స్మిత అంత అందంగా కాస్ట్యూమ్స్ ధరించే ఆర్టిస్టులు ఇంకెవరూ లేరు. సిల్క్ స్మిత తర్వాత బాలీవుడ్ లో రేఖ మాత్రమే అంత అందంగా కాస్ట్యూమ్స్ ధరించేవారు.
గర్వం పెరిగింది
5000 రూపాయలు చీర ఆమెకు ఇచ్చి ధరించమని అడిగితే.. దానిని ఆమె తన సొంత ఖర్చులతో 20,000 చీరగా మార్చేసి అందంగా రెడీ అయ్యేవారు. కాకపోతే సిల్క్ స్మిత కి బాగా పేరు ప్రఖ్యాతలు వచ్చాక కాస్త గర్వం పెరిగింది. ఆమె సొంతంగా కొందరు డాన్స్ మాస్టర్లని పెట్టుకుంది. వారిలో పులి సరోజ ఒకరు. మిగిలిన డాన్స్ మాస్టర్ లతో వర్క్ చేయాలంటే అసలు ఒప్పుకునేది కాదు.
పులి సరోజ బిజీగా ఉన్నప్పుడు మాలాంటి కొరియోగ్రాఫర్లు సిల్క్ స్మిత తో వర్క్ చేయాల్సి వచ్చేది. కానీ మాతో ఆమె సరిగ్గా వర్క్ చేయదు. సరిగ్గా డ్యాన్స్ చేయకపోవడం, లిప్ సింక్ ఇవ్వకపోవడం లాంటివి చేసేది. ఫేస్ కి కెమెరా క్లోజప్ లో పెట్టినప్పుడు సాంగ్ కి లిప్ సింక్ కరెక్ట్ గా ఇవ్వాలి. అలాంటి సందర్భంలో సిల్క్ స్మిత సరిగ్గా చేసేది కాదు. లిప్ సింగ్ సరిగ్గా రాలేదు అని అసిస్టెంట్ డైరెక్టర్లు చెబితే లేదు నేను బాగానే చేశాను అని వాదిస్తుంది. నేను వెళ్లి లేదు లిప్ సింక్ సరిగ్గా రాలేదు అని చెప్తే వెంటనే అలిగేస్తుంది.
బాలయ్య మూవీ షూటింగ్ లో సంఘటన
ఆమె చెప్పిన కొరియోగ్రాఫర్లని పెట్టకపోతే ఇలాగే చేసేది. బాలకృష్ణ భలే తమ్ముడు మూవీ షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రంలో నాలుగు పాటలకు నేనే డాన్స్ కొరియోగ్రఫీ చేశాను. ఐదవ సాంగ్ కి కూడా నేనే కొరియోగ్రఫీ చేయాలి. కానీ ఆమెకి నా కొరియోగ్రఫీలో నటించడం ఇష్టం లేదు. షూటింగ్ కి ముందు రోజు నిర్మాత నుంచి నాకు ఫోన్ వచ్చింది. మాస్టర్.. మీకు సిల్క్ స్మిత కి ఏంటి గొడవ అని అడిగారు? ఆమెతో నాకు ఎలాంటి గొడవ లేదు.
చెక్కు వెనక్కి ఇచ్చేసి షూటింగ్ నుంచి వెళ్లిపోయిన సిల్క్ స్మిత
నేను ఆమెతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశాను. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయ్యాను. తనకు అసిస్టెంట్ గా పనిచేసిన వ్యక్తితో వర్క్ చేయాలా అని అనుకుందేమో అని తెలిపారు. నిర్మాతకి నా తప్పేమీ లేదని అర్థమైంది. దీంతో ఆయన డైరెక్టర్ కి చెప్పారు. శివ శంకర్ మాస్టర్ తప్పేమీ లేదు. సిల్క్ స్మిత కి రెండు రోజులు టైం ఇచ్చి శివ శంకర్ మాస్టర్ తో ఈ సాంగ్ చేస్తుందా లేదా అని అడగండి. ఆమె చేయను అని చెప్తే ఆమె స్థానంలో మరొక ఆర్టిస్ట్ ని తీసుకోండి అని చెప్పారు.
ఈ విషయం సిల్క్ స్మితతో చెప్పారు. ఆమె వెంటనే పారితోషికంగా తీసుకున్న చెక్కును వెనక్కి ఇచ్చేసి షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది. సిల్క్ స్మిత అలా చేయడం తనకి చాలా బాధగా అనిపించిందని శివశంకర్ మాస్టర్ తెలిపారు. ఆ తర్వాత సిల్క్ స్మిత స్థానంలో ఆ సాంగ్ కి జయమాలినిని తీసుకున్నట్లు శివ శంకర్ మాస్టర్ తెలిపారు. అప్పటి నుంచి సిల్క్ స్మిత కెరీర్ డౌన్ ఫాల్ మొదలైనట్లు అందరూ చెబుతుంటారు.