MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను స్టార్ అయింది ఆయన వల్ల కాదు, మర్యాద తెలియదా.. సురేష్ బాబుపై విరుచుకుపడ్డ కమెడియన్

నేను స్టార్ అయింది ఆయన వల్ల కాదు, మర్యాద తెలియదా.. సురేష్ బాబుపై విరుచుకుపడ్డ కమెడియన్

సీనియర్ నటుడు, కమెడియన్ బాబు మోహన్ బహిరంగంగా సురేష్ బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు తనని అవమానించినట్లుగా బాబు మోహన్ తెలిపారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 26 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామానాయుడు స్టూడియోలో ఈవెంట్
Image Credit : our own

రామానాయుడు స్టూడియోలో ఈవెంట్

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్న కమెడియన్లలో బాబు మోహన్ ఒకరు. ఎన్నో చిత్రాల్లో ఆయన అద్భుతమైన కామెడీ పండించారు. రీసెంట్ గా రామానాయుడు స్టూడియోలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాబు మోహన్ ని అతిథిగా ఆహ్వానించారు. ఈ ఈవెంట్ లో చింతామణి నాటక ప్రదర్శన జరిగింది.

25
పెత్తనం అంతా సురేష్ బాబుదే
Image Credit : our own

పెత్తనం అంతా సురేష్ బాబుదే

ఈ కార్యక్రమంలో తనకి తగిన గౌరవం దక్కలేదని బాబు మోహన్ బహిరంగంగా స్టీజీ పైనే తీవ్ర విమర్శలు చేశారు. సురేష్ బాబుపై సెటైర్లు వేస్తూ, విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. ఈవెంట్ లో సీనియర్ నటుడిగా, మాజీ మంత్రిగా తనకి తగిన గౌరవం, ప్రాధాన్యం దక్కలేదు అని బాబు మోహన్ భావించారు. ఇక్కడ పెత్తనం అంతా సురేష్ బాబుదే కదా.. నన్ను ఇక్కడికి ఇంకెప్పుడూ పిలవకండి అంటూ బాబు మోహన్ మండిపడ్డారు.

Related Articles

Related image1
చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?
Related image2
Vijay Sangeetha Divorce: నిశ్చితార్థానికి ముందే విజయ్ అలా చేశాడు.. మొత్తం బయట పెట్టిన సంగీత
35
రోజుకు 6 షిఫ్టులు
Image Credit : our own

రోజుకు 6 షిఫ్టులు

ఈ నేపథ్యంలో బాబు మోహన్ తన సినీ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. నన్ను నటుడిని చేసింది కోడి రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి. వారిద్దరూ తమ సినిమాల్లో ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అంకుశం చిత్రంతో నాకు తిరుగులేని గుర్తింపు దక్కింది. ఆ తర్వాత రోజుకు 6 షిఫ్టులు పనిచేసే నటుడిగా బిజీ అయ్యాను.

45
మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచా
Image Credit : Asianet News

మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచా

ఆ తర్వాత ప్రజా ప్రతినిధిగా ప్రజల ఓట్లతో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాను. చిత్ర పరిశ్రమ నుంచి మూడుసార్లు గెలిచినా ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో మీరే లెక్కబెట్టుకోండి. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశాను. చంద్రబాబు గారు మంత్రిగా నా పనితీరుకి 97 మార్కులు ఇచ్చారు. అలా ఎక్కడికి వెళ్లినా అక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాను. ఇవన్నీ సినిమా డైలాగులు కాదు. జీవితంతో పోరాటం చేస్తూ ఎదిగాను.

55
కనీసం సభా మర్యాద పాటించలేదు
Image Credit : our own

కనీసం సభా మర్యాద పాటించలేదు

నా కెరీర్ లో ఇప్పటి వరకు 2012 సినిమాల్లో నటించాను. ఇప్పటికీ నటిస్తున్నాను. ఈవెంట్ ఆర్గనైజర్స్ తో మాట్లాడుతూ.. నాకు రామానాయుడు గారు దైవ సమానులు. ఎన్నో సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఆయన కోసమే ఈ ఈవెంట్ కి వచ్చాను. ఇకపై నన్ను ఇక్కడికి పిలవకండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పెత్తనం సురేష్ బాబు గారిది. రామానాయుడు గారి కంటే సురేష్ బాబు గారు పెద్ద వారు కదా.. కాబట్టి ఈ స్టేజీపై నిలబడడానికి నేను అనర్హుడిని. కనీసం సభా మర్యాద పాటించలేదు. నేను మాజీ మంత్రిని, స్టార్ ని.. ఆయన చేస్తే నేను స్టార్ కాలేదు అంటూ బాబు మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?
Recommended image2
Vijay Sangeetha Divorce: నిశ్చితార్థానికి ముందే విజయ్ అలా చేశాడు.. మొత్తం బయట పెట్టిన సంగీత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved