MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అద్భుతమైన నటుడివి, ఇలా పాడు చేసుకోకు అని కోటపై కేకలు వేసిన చిరంజీవి.. అసలేం జరిగిందంటే

అద్భుతమైన నటుడివి, ఇలా పాడు చేసుకోకు అని కోటపై కేకలు వేసిన చిరంజీవి.. అసలేం జరిగిందంటే

ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు 750 పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ రోల్స్ చేసినా, విలన్ గా నటించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించేవారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 13 2025, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube/Geetha Arts

ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు 750 పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ రోల్స్ చేసినా, విలన్ గా నటించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించేవారు. ఆయన నటనా శైలి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే నాలుగు దశాబ్దాల పాటు కోట శ్రీనివాసరావు టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా రాణించారు.

25
Image Credit : Youtube/Geetha Arts

కోట మరణంతో ఆయన కెరీర్ విశేషాలని అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కోట శ్రీనివాసరావుకి మంచి అనుబంధం ఉంది. చిరంజీవి చాలా చిత్రాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. అందులో యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, బావగారు బాగున్నారా, అన్నయ్య లాంటి చిత్రాలు చెప్పుకోదగినవి.

Related Articles

Related image1
మొత్తం స్క్రిప్టెడ్, అర్జున్ కళ్యాణ్ కి అందుకే ముద్దు పెట్టా.. బిగ్ బాస్ వాసంతి బయటపెట్టేసిందిగా
Related image2
వరుసగా నంది అవార్డులు ఆ నటుడికే, టాలీవుడ్ ని అవమానించేలా డైరెక్టర్ కామెంట్స్.. కోపంతో కోట చేశారో తెలుసా
35
Image Credit : ANI

కోట శ్రీనివాసరావు మద్యం సేవించే అలవాటు గురించి గతంలో చాలా వార్తలు వచ్చాయి. తాను డ్రింకింగ్ ఎక్కువగా చేస్తున్నానని చిరంజీవి చాలా సందర్భాల్లో హెచ్చరించిన విషయాన్ని కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేస్తున్నారు. నేనంటే చిరంజీవికి బాగా ఇష్టం.

45
Image Credit : Facebook/Kota Srinivasa Rao

నా మీద చాలాసార్లు కేకలు వేశాడు. ఏంటి మరీ ఎక్కువగా తాగుతున్నావట. నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్ వి.. ఇలా చేసి పాడు చేసుకోకు అని చిరంజీవి చాలా సార్లు నాపై అరిచారు అని కోట శ్రీనివాసరావు తెలిపారు. చిరంజీవి నాపై అలా అరవడంలో తప్పులేదు. నేనంటే ఇష్టం కాబట్టి అలా చేశారు అని తెలిపారు.

55
Image Credit : Facebook/Kota Srinivasa Rao

కానీ అందరూ అంటున్నట్లు తాను తాగి షూటింగ్ కి వెళతాను అనే ప్రచారంలో వాస్తవం లేదని కోట తెలిపారు. చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు మూవీతోనే కోట సినీ కెరీర్ కూడా ప్రారంభమైంది.బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న కోట నటనపై ఆసక్తితో రంగస్థల నటుడిగా రాణించేవారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
O Romeo Cast: 'ఓ రోమియో' స్టార్స్ ఆస్తులెంత? షాహిద్, తృప్తి, తమన్నా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది?
Recommended image2
Kadhalar Dhinam: భారతీయుడు సినిమాను మించిన బడ్జెట్, యువతకు పిచ్చెక్కించిన ఆ లవ్ స్టోరీ ఇదే!
Recommended image3
Silk Smitha: రజినీ, కమల్‌కే చుక్కలు చూపించింది.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఆమె టాప్ 5 సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
మొత్తం స్క్రిప్టెడ్, అర్జున్ కళ్యాణ్ కి అందుకే ముద్దు పెట్టా.. బిగ్ బాస్ వాసంతి బయటపెట్టేసిందిగా
Recommended image2
వరుసగా నంది అవార్డులు ఆ నటుడికే, టాలీవుడ్ ని అవమానించేలా డైరెక్టర్ కామెంట్స్.. కోపంతో కోట చేశారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved