MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ సినిమా మాకొద్దని చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు చేతులెత్తేశారు..అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణ

ఈ సినిమా మాకొద్దని చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు చేతులెత్తేశారు..అదే కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణ

ఒక చిత్రం విషయంలో సూపర్ స్టార్ కృష్ణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఆయనకి ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 06 2025, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో సూపర్ స్టార్ కృష్ణకి సాటి ఇంకెవరూ లేరని ఇండస్ట్రీలో అంతా చెబుతుంటారు. తన సాహసోపేతమైన నిర్ణయాలు కారణంగానే సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో విజయాలు అందుకున్నారు. చిత్ర పరిశ్రమలో కొత్త ఆవిష్కరణలకు ఆయన కారణమయ్యారు. ఒక చిత్రం విషయంలో సూపర్ స్టార్ కృష్ణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఆయనకి ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

25
Image Credit : Asianet News

1982లో కన్నడలో జిమ్మిగల్లు అనే చిత్రం విడుదలైంది. శ్రీప్రియ, విష్ణువర్ధన్ కలిసిన నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఈ చిత్రాన్ని నిర్మాత వి బి రావు చూశారు. ఆ సినిమా ఫ్లాప్ అని తెలిసినప్పటికీ.. ఈ కథలో కొన్ని మార్పులు చేసి తెలుగులో రీమేక్ చేస్తే తప్పకుండా హిట్ అవుతుందని ఆయన నమ్మారు. దీంతో ఆ చిత్ర రీమేక్ హక్కులని కొన్నారు.

Related Articles

Related image1
చిరంజీవి తొత్తువి నువ్వు, పరిటాల రవి ముందే నటుడికి మోహన్ బాబు వార్నింగ్.. గొడవ ఎలా మొదలైందంటే
Related image2
ఒకప్పుడు విజయశాంతికి ఆయన పర్సనల్ మేకప్ మెన్..ఇప్పుడు 200 కోట్ల సినిమా నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్
35
Image Credit : Social Media

చిరంజీవితో ఈ చిత్రం చేయాలని ఆయనకి కన్నడ సినిమాని చూపించారు. చిరంజీవికి ఆ చిత్రం నచ్చలేదు.. దీంతో రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ, మోహన్ బాబులకు కూడా కన్నడ చిత్రాన్ని చూపించారు. వాళ్లు కూడా ఈ ఫ్లాప్ సినిమా రీమేక్ లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. కథలో మార్పులు చేస్తామని చెప్పినప్పటికీ ఈ ముగ్గురు హీరోలు ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.

45
Image Credit : our own

ఆ తర్వాత ఈ చిత్ర కథలో మార్పులు చేసేందుకు పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగారు. జిమ్మిగల్లు చిత్రంలో కేవలం మూడు సన్నివేశాలను మాత్రమే పరుచూరి బ్రదర్స్ తీసుకున్నారు. మిగిలిన సన్నివేశాలని, కథని మార్చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణకి కథను వినిపిస్తే ఆయనకి చాలా బాగా నచ్చేసింది. కృష్ణ వెంటనే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

55
Image Credit : our own

ఆ విధంగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ మూవీలో పోలీస్ అధికారి పాత్రలో సీనియర్ నటి శారద నటించారు. విజయశాంతి లాయర్ గా నటించింది. హీరోయిన్ పాత్రలో రాధ, మరో కీలక పాత్రలో శరత్ బాబు నటించారు. 1987లో 'ముద్దాయి' అనే టైటిల్ తో ఈ చిత్రం రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఫ్లాప్ సినిమా రీమేక్ అయినప్పటికీ కృష్ణ ఈ చిత్రాన్ని చేసేందుకు వెనకడుగు వేయలేదు. మొత్తంగా చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ఒక సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ అయ్యారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణ ఘట్టమనేని
నందమూరి బాలకృష్ణ
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: అన్నకి పోటీగా వెంకటేష్‌ ప్రొడక్షన్‌, రామానాయుడుకి చుక్కలు.. సోగ్గాడితో చేదు అనుభవం
Recommended image2
Funky Collections: `ఫంకీ` మూవీ ఫస్ట్ డే బాక్సాఫీసు.. అనుదీప్‌ దెబ్బకి విశ్వక్‌ సేన్‌ జాక్‌ పాట్‌
Recommended image3
The Raja Saab : డూప్‌తో యాక్షన్ సీన్స్.. ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ క్లారిటీ
Related Stories
Recommended image1
చిరంజీవి తొత్తువి నువ్వు, పరిటాల రవి ముందే నటుడికి మోహన్ బాబు వార్నింగ్.. గొడవ ఎలా మొదలైందంటే
Recommended image2
ఒకప్పుడు విజయశాంతికి ఆయన పర్సనల్ మేకప్ మెన్..ఇప్పుడు 200 కోట్ల సినిమా నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved