MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భరణి ఎలిమినేట్ అయింది ఎవరి వల్లో తెలుసా ? గొంతు చించుకుని చెప్పిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్

భరణి ఎలిమినేట్ అయింది ఎవరి వల్లో తెలుసా ? గొంతు చించుకుని చెప్పిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. భరణి ఎలిమినేట్ కావడానికి కారణం చెబుతూ వైల్డ్ కార్డు ఎంట్రీ శ్రీనివాస్ సాయి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 20 2025, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైల్డ్ కార్డు ఎంట్రీలు
Image Credit : Asianet News

వైల్డ్ కార్డు ఎంట్రీలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక మరింత ఆసక్తికరంగా మారింది. దివ్వల మాధురి, అయేషా, నిఖిల్, సాయి లాంటి వారంతా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరికంటే ముందుగా దివ్య బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డుగా అడుగుపెట్టింది. ఆదివారం రోజు జరిగిన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ భరణిని ఎలిమినేట్ చేశారు. భరణి ఎలిమినేషన్ ని ఎవరూ ఊహించలేదు. 

25
భరణి ఎలిమినేషన్
Image Credit : Asianet News

భరణి ఎలిమినేషన్

కానీ అతి తక్కువ ఓటింగ్ తో భరణి ఎలిమినేట్ కాక తప్పలేదు. భరణి హౌస్ లో గేమ్ కంటే బంధాలు పెంచుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడని అందుకే అతడు ఎలిమినేట్ కావలసి వచ్చింది అని కామెంట్స్ వినిపించాయి. భరణిపై రేలంగి మావయ్య అనే ముద్ర కూడా పడింది. భరణిని తనూజ నాన్న అని పిలుస్తూ అతడితో ఎమోషనల్ బాడింగ్ ఏర్పరుచుకుంది. దివ్య కూడా భరణితో ఎమోషనల్ గా దగ్గరైంది. దీనితో భరణి ఎలిమినేట్ కావడంతో వారిద్దరూ భరించలేకపోయారు. 

Related Articles

Related image1
ఆమె లేకుంటే ఇంద్ర, అత్తారింటికి దారేది సినిమాలే లేవు.. సుహాసిని నుంచి ఆర్తి అగర్వాల్ వరకు, అందరికీ ఆమె గొంతే
Related image2
చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి నచ్చదా ? సుమన్ బయటపెట్టిన అసలు నిజం ఇదే
35
ఆమె వల్లే భరణి అవుట్
Image Credit : Asianet News

ఆమె వల్లే భరణి అవుట్

సోమవారం రోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ కి సంబంధించిన వాగ్వాదాలు జరగనున్నాయి. బిగ్ బాస్ తెలుగు 9 నుంచి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ సాయి.. దివ్యపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. భరణి గారు హౌస్ లో ఆకాశమంత ఎత్తులో ఉన్నారు. దివ్య హౌస్ లోకి వచ్చాకే ఆయన పెర్ఫార్మెన్స్ పడిపోయింది. ఆమె వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారు అన్నట్లుగా సాయి ఆరోపించారు.బిగ్గరగా అరుస్తూ సాయి.. దివ్యపై ఆరోపణలు చేశారు. 

45
నిలదీసిన దివ్య
Image Credit : Asianet News

నిలదీసిన దివ్య

సాయి ఆరోపణలతో దివ్య కూడా గట్టిగా ఫైర్ అయింది. భరణి గారు నా వల్ల ఎలిమినేట్ అయినట్లు ఎవరు చెప్పారు అంటూ నిలదీసింది. సాయికి దివ్య పూర్తి స్థాయిలో ఎలా కౌంటర్ ఇచ్చింది అనేది కంప్లీట్ ఎపిసోడ్ లో తేలనుంది. రాము, రీతూ చౌదరి మధ్య కూడా మాటల యుద్ధం చెలరేగింది. 

55
కళ్ళు చెకప్ చేయించుకో
Image Credit : Asianet News

కళ్ళు చెకప్ చేయించుకో

రాము ఎక్కడా కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు అని రీతూ ఆరోపించింది. దీనితో రాము వెంటనే.. నువ్వు కళ్ళు చెకప్ చేయించుకుంటే బెటర్ అని అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. రమ్య మోక్ష అయితే తనూజ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనూజ ఒక ముసుగులో ఉంది. ఆమె ఫుల్ డ్రామా క్వీన్. తనూజ చేసేదంతా నటనే.. ఆమె ఫేక్ అంటూ రమ్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనూజ కూడా అదే రేంజ్ లో రమ్యకి సమాధానం ఇచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
పుష్ప, కాంతార, బాహుబలి... ఇండియన్ సినిమాను ఏలుతున్న 6 ఫ్రాంచైజీలు, టాలీవుడ్ హీరోలదే హవా..
Recommended image2
సమంత రాజ్ తో పాటు పెళ్లి తర్వాత ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఈ 6 సినిమా జంటలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే?
Recommended image3
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Related Stories
Recommended image1
ఆమె లేకుంటే ఇంద్ర, అత్తారింటికి దారేది సినిమాలే లేవు.. సుహాసిని నుంచి ఆర్తి అగర్వాల్ వరకు, అందరికీ ఆమె గొంతే
Recommended image2
చిరంజీవిని పొగిడితే బాలకృష్ణకి నచ్చదా ? సుమన్ బయటపెట్టిన అసలు నిజం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved