- Home
- Entertainment
- ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, స్టార్ హీరోయిన్ దెబ్బకు రామారావు ఏం చేశారంటే ?
ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, స్టార్ హీరోయిన్ దెబ్బకు రామారావు ఏం చేశారంటే ?
సీనియర్ ఎన్టీఆర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు భయపడేవారు. కొందరు మాత్రం ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవారు. కాని ఎన్టీఆర్ కు ఎదురెళ్లగలిగేది మాత్రం భానుమతి ఒక్కరే. ఓ సందర్భంటో ఎన్టీఆర్ నే బురిడీ కొట్టించింది అలనాటి స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఏం చేశారంటే?

తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, భానుమతి ఇద్దరూ అమోఘమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇద్దరికి ఇద్దరు ఎవరు వీరికి సాటి రారు అన్న విధంగా తమ కెరీర్ ను మలుచుకున్నారు. పట్టుదల విషయంలో ఇద్దరికి పెద్ద తేడా లేదు. పద్దతులు, సమయపాలన, ఆహారం, ఏది తీసుకున్నా ఎన్టీఆర్ భానుమతి స్ట్రిక్ట్ గానే ఉంటారు.
కాకపోతే వారి వారిఅభిరుచులు తేడా కాని, చేసే పనిలో నిబద్ధత మాత్రం ఒక్కటే. ఉదాహరణకు తీసుకుంటే ఎన్టీఆర్ నాన్ వేజ్ లేనిదే ముద్దు ముట్టరు, కాని భానుమతి మాత్రం పక్కా మడి ఆచారంతో వండిన వెజిటేరియన్ ఫుడ్ తింటారు. ఇక భానుమతి పక్కాగా 12 అవ్వగానే ఎంత పెద్ద సినిమా షూటింగ్ లో ఉన్నా సరే భోజనానికి వెళ్లాల్సిందే.
కాని ఎన్టీఆర్ ఒంటిగంట కొట్టిన తరువాతే భోజనానికి లేస్తారు. వీరి టైమింగ్ లో మార్పు ఉండాదు. తినే తిండి విషయంలో మార్పు ఉండదు. కాని వారు అనుకున్నది అనుకున్నట్టు పద్దతిగా చేసుకుంటూ వెళ్తారు అంతే. ఎవరికోసమో వారి పద్దతులు మార్చుకోరు. ఇలా ఇద్దరు స్టార్లుగా వెలుగు వెలిగారు.
ఇక ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ శాశ్వత గుర్తింపును తెచ్చుకున్న మహానుభావుడు. సినిమాల్లో కృష్ణుడు, రాముడు, బ్రహ్మంగారు, లాంటి పాత్రలు చేయడంతో ప్రజలు రామారావును నిజమైన దేవుడిగా కొలిచేవారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేసిన మంచి పనులు జనాల్లో నిజమైన దేవుడిగా ఎన్టీఆర్ కు గుర్తింపును ఇచ్చాయి. అలా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేసి చిర కీర్తినిపొందారు.
అలాగే భానుమతి కూడా నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, గాయనిగా, స్టూడియో యజమానిగా అన్ని రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సాధించారు. హీరోలను మించిన స్టార్ డమ్ తో దూసుకుపోయింది భానుమతి. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా అంతే కాదు కలిసి సినిమాలు చేసినా వీరి మధ్య కొన్ని సందర్భాల్లో కోల్డ్ వార్ జరిగేదని సమాచారం.
అయితే ఈ ఇద్దరు తారల మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. "తాతమ్మ కల" సినిమా తో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణను పరిచయం చేయాలని భావించారు. ఆ సినిమాలో తాతమ్మగా ఓల్డ్ లేడీ పాత్రలో భానుమతిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ పాత్రకోసం భానుమతి అయితేనే బాగుంటుంది అని ఎన్టీఆర్ భావించారట. ఇందుకోసం ప్రముఖ రచయిత నరసరాజును భానుమతిని సంప్రదించమని ఎన్టీఆర్ పంపారు.
అయితే అప్పుడు భానుమతి రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసేవారట. అంతే కాదు భానుమతిని నరసరాజు సంప్రదించగా.. తాను ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటే, దాని కంటే 5,000 తక్కువ తీసుకుంటాను" అని చెప్పారు. కానీ అప్పటికి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ రూ.4 నుంచి 5 లక్షల మధ్య ఉండేది. దాంతో దీన్ని గమనించిన ఎన్టీఆర్, “నేను రెండే లక్షలు తీసుకుంటున్నానని చెప్పు అప్పుడు ఆమె దాంట్లో 5 వేలు తక్కువే తీసుకుంటుంది అని అని నరసరాజుతో చెప్పారట.
అయితే భానుమతి కూడా ఈ విషయంలో తాను తక్కువ తక్కువ కాదని నిరూపించారు. నరసరాజు మాటలు విని, సరే ఇక్కడే 5,000 ఉన్నాయి. . ఇదిగో, ఇది ఎన్టీఆర్ గారికివ్వండి. నా రెమ్యునరేషన్ కూడా కలిపి ఇవ్వండి నేను తారువాత తీయ్యబోయే ‘అమ్మాయి పెళ్లి’ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా చేయాలి.. ఆయన్ని ఒప్పించండి అని స్పష్టంగా చెప్పారు.
ఈ సమాధానం విని నరసరాజు కంగారుపడిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీరామారావు అమ్మాయి పెళ్లి సినిమాలో నటించాల్సి వచ్చింది. తన ప్లాన్ తనకే తిరిగొచ్చిన పరిస్థితిని ఎన్టీఆర్ ఫేస్ చేశారు. అంతే కాదు ఈ విషయంలో భానుమతిని తెలివితేటను ప్రశంసించారట కూడా.
ఈ సంఘటన ద్వారా భానుమతి తెలివితేటలే కాకుండా, ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని ఆమె బురిడీ కొట్టించిన ధైర్యసాహసాలను తెలుగు పరిశ్రమ ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఒకప్పుడు స్టార్ నటులే కాదు దర్శకులు కూడా ఆమె ముందు కాస్త జాగ్రత్తగా ఉండేవారట.
ఎవరు అనేది చూసేవారు కాదట భానుమతి. తప్పు అని తెలిస్తే ఎంతటివారితో అయిన ముఖా ముఖి ఉండేదట. అంతే కాదు భానుమతి ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో అంత మంచి మనసు ఆమెది. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో కూడా ఆమె మార్క్ ప్రత్యేకం.